సమష్టిగా పాటుపడితే విజయం మన ముంగిట వాలుతుందని రాష్ట్ర మాజీ మంత్రి, బందరు పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు.
అవనిగడ్డ, న్యూస్‌లైన్ : సమష్టిగా పాటుపడితే విజయం మన ముంగిట వాలుతుందని రాష్ట్ర మాజీ మంత్రి, బందరు పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. పార్టీ శ్రేణులను కలుసుకునేందుకు అవనిగడ్డ వచ్చిన సారథికి నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఘన స్వాగతం పలికారు. సోమవారం కోడూరు మండల పరిధిలోని విశ్వనాథపల్లి, పిట్టల్లంక గ్రామాలు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్‌బాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు.
అనంతరం రమేష్ స్వగృహంలో ఆయన పార్టీ పరిస్థితిపై నాయకులతో చర్చించారు. సారథి మాట్లాడుతూ త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బందరు పార్లమెంటు, అసెంబ్లీల బరిలో ఉన్న అభ్యర్థుల విజయంకోసం సమష్టిగా పాటుపడదామని పిలుపునిచ్చారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం కావాలని, ఆ దిశగానే పార్టీ శ్రేణులు పురోగమించేలా నాయకులు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కడవకొల్లు నరసింహారావు, గోవాడ రాము, ఇంకొల్లు శేషగిరిరావు, కటికల కిషోర్, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు, చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, నాగాయలంక మండలాల కన్వీనర్లు చండ్ర వెంకటేశ్వరరావు, వేమూరి వెంకట్రావు, అరజా నరేంద్రకుమార్, విశ్వనాథపల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, బడే వెంకటేశ్వరరావు, మద్ది చిన్నా, భోగాది శేషగిరి, గాజుల శ్రీనివాసరావు, బచ్చు భద్రయ్య, తోట కృష్ణాంజనేయులు, కామిశెట్టి శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.
చిట్టిబాబు, శివరావ్‌ను కలిసిన సారథి...
స్థానిక సోషల్‌క్లబ్ వద్ద పార్టీ నాయకులు గుడివాక శివరావ్, యాసం చిట్టిబాబుతో బందరుపార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పార్థసారథి సమావేశమయ్యారు. పార్టీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యులు గాజుల మురళీకృష్ణ, కోసూరు గోపీచంద్, పొన్నూరు నాంచారయ్య, రావి చిట్టిబాబు, మాజీ ఎంపీపీ దిడ్ల ప్రసాద్, సనకా శేషుబాబు, ముళ్లపూడి శ్రీనివాసరావు, గుడివాక నాగమల్లిఖార్జునరావు (పద్మాయ్), తదితరులు పాల్గొన్నారు.
మా మద్దతు మీకే..
ఎన్ని పార్టీలు వచ్చిన మా గ్రామస్తులంతా వైఎస్సార్ సీపీకే మద్దతుగా ఉంటామని డీసీసీ మాజీ చైర్మన్ విష్టుబోట్ల సూర్యన్నారయణ పార్థసార థికి హామీ ఇచ్చారు. విశ్వనాథపల్లిలో ఆయన నివాస గృహంలో పార్థసారధి, రమేష్‌బాబు మర్యాద పూర్వకంగా సూర్యనారాయణను కలుసుకున్నారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుడివాక శివరావు,కడవకొల్లు నరసింహరావు, యలవర్తి శ్రీరామూర్తి, పీ రాజబాబు పాల్గొన్నారు.