Mahesh Babu Mother Indira Devi Died Months After His Brother Death - Sakshi
Sakshi News home page

Indira Devi Death: ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్‌

Published Wed, Sep 28 2022 10:43 AM | Last Updated on Wed, Sep 28 2022 12:57 PM

Mahesh Babu Mother Indira Devi Passed Away, Super Star Is In Deep Sorrow - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో జనవరి 8న తుదిశ్వాస విడిచారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి.

అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి దూరం అవ్వడం మహేశ్‌ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మహేశ్‌కు తల్లిపై ఎనలేని ప్రేమ ఉండేది. నమ్రతతో వివాహం జరిగే వరకు తల్లి చాటు బిడ్డగానే పెరిగాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో మహేశ్‌ బాబే స్వయంగా చెప్పారు. సందర్భం వచ్చినప్పుడల్లా తల్లితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించేవాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళితే తల్లి చేయి పట్టుకొని పక్కనే ఉండేవాడు. ఇందిరాదేవికి కూడా చిన్న కొడుకు మహేశ్‌ అంటే చాలా ఇష్టం ఉండేది. 

మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement