
హీరో కృష్ణ కొడుకు రమేష్‌బాబుకు రూ. 22 వేల జరిమానా
సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘అతిథి’ సినిమాను విడుదల చేసినందుకు చిత్ర నిర్మాత, మహేష్‌బా బు సోదరుడు రమేష్‌బాబుకు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘అతిథి’ సినిమాను విడుదల చేసినందుకు చిత్ర నిర్మాత, హీరో కృష్ణ కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబుకు ఇక్కడి కూకట్‌పల్లి 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 22 వేల రూపాయల జరిమానా విధించింది.
దీనిపై గతంలో కేసు నమోదైంది. శనివారం విచారణకు హాజరైన నిర్మాత రమేష్‌బాబు తన పొరపాటును అంగీకరించడంతో న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పు వెల్లడించారు.