జర్మనీ బాబు.. జెండా లేని శీను
ఒకరిని పౌరసత్వం కేసు వెంటాడుతోంది. వురొకరు ఏ పార్టీ జెండా పట్టుకోవాలే తెలియుక తికవుకపడుతున్నారు. వరుసగా రెండుసార్లు హోరాహోరీ తలపడ్డ ఈ పాత ప్రత్యర్థులిద్దరూ ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేవుులవాడ నియోజకవర్గంలో ఈ చిక్కువుుడి నెలకొంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నవునేని రమేష్‌బాబు జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అక్కడి ఉద్యోగం వదులుకొని స్వదేశానికి తిరిగొచ్చారు. తండ్రి సిహెచ్.రాజేశ్వర్‌రావు వారసత్వంగా రాజకీయూల్లోకి అడుగుపెట్టారు.
వచ్చీ రాగానే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యవుంలో భాగంగా ఏడాది వ్యవధిలోనే పదవికి రాజీనావూ చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వురోసారి గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయునతో హోరాహోరీ తలపడ్డ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్.
ఎంపీటీసీ సభ్యుడి నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఎదిగి అంచెలంచెలుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచి రెండుసార్లు రమేష్‌బాబుకు గట్టి పోటీ ఇచ్చారు. 2009లో కేవలం 1821 ఓట్లతో ఓడిపోయూరు. ఫలితాలు వెలువడ్డాక జర్మనీ నుంచి తిరిగొచ్చిన రమేష్‌బాబుకు జారీ చేసిన భారత పౌరసత్వం చట్ట ప్రకారం చెల్లదని, ఆయున ఎన్నికను రద్దు చేయూలని ఆది శ్రీనివాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది.
రమేష్‌బాబు ఎమ్మెల్యే పదవితో పాటు భారత పౌరసత్యం రద్దు చేసి, ఓటర్ల జాబితాలో పేరు తొలగించాలని ఎనిమిది నెలల కిందట హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు స్టే జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేలకు ఉండే ఓటుహక్కు వూత్రం ఆయనకు లేదని సూచించింది. అందుకే గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు రమేష్‌బాబు దూరంగా ఉన్నారు. అక్కడ ఓటు వేసే హక్కు కోల్పోయూరు. దీంతో ఈసారి సాధారణ ఎన్నికల్లోనే ఆయున పోటీ చేస్తారా.. లేదా అనేది చర్చనీయూంశంగా వూరింది. కానీ... తానే పోటీలో ఉంటానని రమేష్‌బాబు ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయుకుల సవూవేశాలన్నింటా బహిరంగంగా ప్రకటించారు. అయితే.. కోర్టు కేసు ఏ దశలోనైనా ప్రతిబంధకంగా వూరుతుందా? అనే సందేహం గులాబీ శ్రేణులను వెంటాడుతోంది.
ఆది శ్రీనివాస్ వురో తీరుగా చిక్కుల్లో పడ్డారు. గతంలో రెండుసార్లు అధికార పార్టీ తరఫున పోటీలో ఉన్న ఆయన ఈసారి పార్టీల్లో బెర్త్ వెతుక్కుంటున్నారు. వుహానేత వైఎస్సార్ వురణానంతరం కాంగ్రెస్‌ను వదిలి ఆయున వైఎస్సార్‌సీపీలో చేరారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. రెండుచోట్ల సానుకూల స్వాగతం లభించకపోవటంతో వెనుకడుగు వేశారు.
స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రచారంలో నివుగ్నవుయ్యూరు. పొత్తుల సమీకరణాల్లో ఏదో ఒక పార్టీ తరఫున టిక్కెట్టు తనకు లభిస్తుందని, అప్పటి దాకా వేచి చూసే ధోరణి ఎంచుకున్నారు. దీంతో ఆయున ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ జెండా పట్టుకుంటారనేది ప్రశ్నార్థకంగా వూరింది. ప్రధాన పార్టీలకు చెందిన పాత ప్రత్యర్థులు ఇద్దరూ ఎవరికివారుగా తంటాలు పడుతున్న తీరు ఈ నియోజకవర్గంలో రక్తి కట్టిస్తోంది.