కీసర, న్యూస్‌లైన్: మండల పరిధిలోని నాగారం, దమ్మాయిగూడల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగనుంది. మొన్నటి వరకు ఇక్కడ పంచాయతీ ఎన్నికలుం టాయో లేదోనన్న సందేహానికి హైకోర్టు ఉత్తర్వులతో తెరపడింది. ఏప్రిల్ 13న పంచాయతీ ఎన్నికలు నిర్వహించేం దుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దీంతో ఆశావహులు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు.నాగారంలో దాదాపు 75 కాలనీ లు, దమ్మాయిగూడాలో 50కిపైగా కాల నీలున్నాయి. నాగారంలో 20,666 మం ది, ద మ్మాయిగూడలో 14,846 మంది ఓటర్లు ఉన్నారు. నాగారం సర్పంచ్ స్థానం జనరల్‌కు, దమ్మాయిగూడ సర్పంచ్ స్థానాన్ని బీసీ-మహిళకు కేటాయించారు.
నగర శివారులో ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానం కూడా ఎమ్మెల్యేతో సమానం. దీంతో పార్టీలు ఖర్చుకు వెనకాడకుండా పోటీకి సిద్ధమవుతున్నాయి. నాగారంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మండల మాజీ కన్వీనర్ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, టీడీపీ తరఫున కౌకుంట్ల చంద్రారెడ్డి, కాంగ్రెస్ తరఫున ర్యాల అశోక్‌యాదవ్, బీజేపీ నుంచి కందాడి సత్తిరెడ్డిలు సర్పంచ్ బరిలో నిలవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని 18 వార్డుల్లో తమ అనుచరులను రంగంలోకి దింపడానికి ఆయా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక దమ్మాయిగూడ సర్పంచ్ విషయానికొస్తే టీడీపీ నుంచి మాజీ సర్పంచ్ రామారం వెంకటేష్‌గౌడ్ సతీమణి రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ తరఫున మాజీ వార్డు సభ్యుడు పడాల యా దగిరి సతీమణి బరిలో ఉన్నారు.
వీరు కాక మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూ డా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 16 వార్డులకు కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఈ రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రచార పర్వానికి తెరతీశారు. పది రోజులుగా గ్రామంలో సం చరిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పని లో పడ్డారు. ఈ రెండు గ్రామాలకు ఈనె ల 29న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 1వరకు నామినేషన్ల గడువు, ఏప్రిల్ 2న నామినేషన్ల పరిశీలన, 3న అప్పీళ్ల స్వీకరణ, 4న పరిశీలన, ఏప్రిల్ 5న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల యుద్ధం.. పార్టీలు సిద్ధం
Published Fri, Mar 28 2014 12:20 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement