సాక్షి, కడప : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను ఈనెల 9వ తేదీన చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఫలితాలను ఈనెల 9న ప్రకటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫలితాలు వెలువడతాయన్న ఊహాగానాలకు పుల్‌స్టాప్ పడింది. ముఖ్యంగా బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ వీడింది. ఇప్పటికే అభ్యర్థుల భవిత్వం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. గెలుపు, ఓటములు తెలియాలంటే మరో వారం రోజులు నిరీక్షించాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో కడపకార్పొరేషన్, బద్వేలు, మైదుకూరు, పులివెందుల,రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీలలో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. గెలుపు, ఓటములపై బెట్టింగులు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల పార్టీలు గెలుపొందే వార్డులు, డివిజన్లపై కూడా పందేలు సాగుతున్నాయి. మొత్తం మీద వారం రోజులపాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు, ప్రజలకు టెన్షన్ తప్పదు.
వీడిన ఉత్కంఠ
Published Wed, Apr 2 2014 3:03 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
Advertisement