మద్యానికి బానిసైన కన్నతల్లిని ఓ వ్యక్తి అంతంచేశాడు. విశాఖ జిల్లా పాడేరు మండలం లగిశపల్లిలో ఈ ఘటన జరిగింది. మసాడ సింహాచలం (40) అనే మహిళ మద్యానికి బానిసైంది. అలవాటు మానుకోవాలని కుమారుడు రమేష్‌బాబు తల్లికి చాలాసార్లు నచ్చజెప్పాడు. అయినా ఆమె ఆ అలవాటు వీడలేదు. దీంతో శనివారం రాత్రి రమేష్‌బాబు మద్యం సేవించి కన్నతల్లిని గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలతో సింహాచలం మృతి చెందింది. ఈ ఘటన తర్వాత నిందితుడు పాడేరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
కన్నతల్లిని గొడ్డలితో నరికాడు
Published Sun, Jan 24 2016 11:54 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement