రాంబిల్లి కొండపై అక్రమ తవ్వకాలు
2019లో పంచకర్లపై నిప్పులు చెరిగిన
జనసేన అధినేత పవన్
అదే పంచకర్లకు జనసేన సీటు
మళ్లీ పెందుర్తిలో చెలరేగిపోతున్న పంచకర్ల గ్యాంగ్
పెందుర్తి: ‘‘యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు భారీ ఎత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు. యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసి రోజుకు రూ.6 లక్షలు సంపాదించాడు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీలు, దందాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తినా మీరు గెలిపిస్తారు.. రమేష్ బాబు లాంటి అవినీతి పరుడ్ని గెలిపించి మీరు చాలా తప్పు చేశారు’’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఐదేళ్ల పాటు యలమంచిలిని దోచుకున్నాడని 2019 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదే పంచకర్లకు పెందుర్తిలో పవన్ కల్యాణ్ సీటు ఇచ్చారు. దీంతో ఇక్కడి నేతలు పవన్ కల్యాణ్ అప్పట్లో పంచకర్లపై చేసిన విమర్శలను గుర్తు చేసుకుంటున్నారు.
అక్రమాలే అజెండా
రాజకీయాల్లో వలస పక్షిగా ముద్ర వేసుకున్న పంచకర్ల రమేష్ బాబు టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు యలమంచిలిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ లెక్క ప్రకారం రోజుకు రూ.6 లక్షలు చొప్పున ఐదేళ్లలో రూ.కోట్లలో సంపాదించారని చెప్పినా.. రాంబిల్లిలోని పంచదార్ల కొండను పిండి చేసి అంతకు మించి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటు సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం విషయంలో పంచకర్ల, అతని అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. తప్పుడు పత్రాలతో బినామీలను సృష్టించి రైతులకు అందాల్సిన పరిహారాన్ని పంచకర్ల గ్యాంగ్ కాజేశారని స్వయంగా యలమంచిలి టీడీపీ నాయకులే ఆరోపించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకులను పక్కన పెట్టి మండలానికో షాడో పంచకర్లను తయారు చేసి ఆయా దందాలకు పాల్పడినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
ఆగడాలు అప్పటి నుంచే..
2009లో ప్రజారాజ్యం తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2011 నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు. ఆ క్షణం నుంచే పంచకర్ల, అతని అనుచరుల అసలు రూపం బయటకు వచ్చింది. అధికారులను తమ దారికి తెచ్చుకుని రౌడీయిజంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెందుర్తి కేంద్రంగా ఎన్నో దందాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో పంచకర్ల అనుచరుడు ఒకరు ఏకంగా పోలీసుల భూమికే గురి పెట్టాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి కేటాయించారు. అప్పటి పంచకర్ల అనుచరుడు గొర్లె అప్పారావు దానిపై కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్‌లు సృష్టించి ఏకంగా పోలీసులకు కేటాయించిన స్థలాన్నే ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ హుస్సేన్ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆట కట్టించారు. అప్పట్లో రమే‹Ùబాబు పేరు చెప్పుకుని సెటిల్‌మెంట్లు చేయడం, బెదిరింపులకు పాల్పడం వంటి ఘటనలు కో కొల్లలు. ఒక రకంగా చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో రౌడీయిజానికి పంచకర్ల రమే‹Ùబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
అనుచరుల రౌడీయిజం
ఈ ఏడాది ఏప్రిల్ 14న జీవీఎంసీ 88వ వార్డు సతివానిపాలెంలో జరిగిన విందు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడుపై పంచకర్ల రమేష్ అనుచరుడు గల్లా శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో ముత్యాలనాయుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధిత కార్పొరేటర్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఇలా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అనుచరుల రౌడీయిజం పెచ్చు మీరుతోంది. తమకు నచ్చని వారిపై హత్యాయత్నాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థులను సోషల్ మీడియా వేదికగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కులాల పేరుతో వేధిస్తున్నారు. ‘మేం వస్తే మీ సంగతి తేలుస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంపై ఇక్కడి ప్రజలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి నాయకుడికి ఓటుతోనే చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు, పెందుర్తి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ పంచకర్ల గ్యాంగ్ హడావుడి
పెందుర్తి ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమే‹Ùబాబు అనుచరులు ఆగడాలు మొదలు పెట్టారు. 2023 నవంబర్ 12 దీపావళి రోజు పెందుర్తి మండలం చింతగట్ల సర్పంచ్ భర్త, రాష్ట్ర అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గనిశెట్టి కనకరాజుపై జనసేన నాయకులు రెచ్చిపోయారు. బీరు బాటిళ్లు..పదునైన ఆయుధాలతో కనకరాజుపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు స్పందించి రక్తపు మడుగులో ఉన్న కనకరాజును ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. జనసేన నాయకులు మాడిస హరీ‹Ù, చందక గోవిందరాజు, దాసరి గణే‹Ùలను నిందితులుగా గుర్తించి పెందుర్తి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 2న అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment