Pendurthi Assembly Constituency
-
Panchakarla Ramesh Babu: పంచకర్ల మైనింగ్ డాన్
పెందుర్తి: ‘‘యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు భారీ ఎత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు. యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసి రోజుకు రూ.6 లక్షలు సంపాదించాడు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీలు, దందాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తినా మీరు గెలిపిస్తారు.. రమేష్ బాబు లాంటి అవినీతి పరుడ్ని గెలిపించి మీరు చాలా తప్పు చేశారు’’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఐదేళ్ల పాటు యలమంచిలిని దోచుకున్నాడని 2019 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదే పంచకర్లకు పెందుర్తిలో పవన్ కల్యాణ్ సీటు ఇచ్చారు. దీంతో ఇక్కడి నేతలు పవన్ కల్యాణ్ అప్పట్లో పంచకర్లపై చేసిన విమర్శలను గుర్తు చేసుకుంటున్నారు. అక్రమాలే అజెండా రాజకీయాల్లో వలస పక్షిగా ముద్ర వేసుకున్న పంచకర్ల రమేష్ బాబు టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు యలమంచిలిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ లెక్క ప్రకారం రోజుకు రూ.6 లక్షలు చొప్పున ఐదేళ్లలో రూ.కోట్లలో సంపాదించారని చెప్పినా.. రాంబిల్లిలోని పంచదార్ల కొండను పిండి చేసి అంతకు మించి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటు సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం విషయంలో పంచకర్ల, అతని అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. తప్పుడు పత్రాలతో బినామీలను సృష్టించి రైతులకు అందాల్సిన పరిహారాన్ని పంచకర్ల గ్యాంగ్ కాజేశారని స్వయంగా యలమంచిలి టీడీపీ నాయకులే ఆరోపించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకులను పక్కన పెట్టి మండలానికో షాడో పంచకర్లను తయారు చేసి ఆయా దందాలకు పాల్పడినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆగడాలు అప్పటి నుంచే.. 2009లో ప్రజారాజ్యం తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2011 నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు. ఆ క్షణం నుంచే పంచకర్ల, అతని అనుచరుల అసలు రూపం బయటకు వచ్చింది. అధికారులను తమ దారికి తెచ్చుకుని రౌడీయిజంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెందుర్తి కేంద్రంగా ఎన్నో దందాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో పంచకర్ల అనుచరుడు ఒకరు ఏకంగా పోలీసుల భూమికే గురి పెట్టాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి కేటాయించారు. అప్పటి పంచకర్ల అనుచరుడు గొర్లె అప్పారావు దానిపై కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా పోలీసులకు కేటాయించిన స్థలాన్నే ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆట కట్టించారు. అప్పట్లో రమే‹Ùబాబు పేరు చెప్పుకుని సెటిల్మెంట్లు చేయడం, బెదిరింపులకు పాల్పడం వంటి ఘటనలు కో కొల్లలు. ఒక రకంగా చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో రౌడీయిజానికి పంచకర్ల రమే‹Ùబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.అనుచరుల రౌడీయిజం ఈ ఏడాది ఏప్రిల్ 14న జీవీఎంసీ 88వ వార్డు సతివానిపాలెంలో జరిగిన విందు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడుపై పంచకర్ల రమేష్ అనుచరుడు గల్లా శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో ముత్యాలనాయుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధిత కార్పొరేటర్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఇలా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అనుచరుల రౌడీయిజం పెచ్చు మీరుతోంది. తమకు నచ్చని వారిపై హత్యాయత్నాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థులను సోషల్ మీడియా వేదికగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కులాల పేరుతో వేధిస్తున్నారు. ‘మేం వస్తే మీ సంగతి తేలుస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంపై ఇక్కడి ప్రజలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి నాయకుడికి ఓటుతోనే చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు, పెందుర్తి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ పంచకర్ల గ్యాంగ్ హడావుడి పెందుర్తి ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమే‹Ùబాబు అనుచరులు ఆగడాలు మొదలు పెట్టారు. 2023 నవంబర్ 12 దీపావళి రోజు పెందుర్తి మండలం చింతగట్ల సర్పంచ్ భర్త, రాష్ట్ర అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గనిశెట్టి కనకరాజుపై జనసేన నాయకులు రెచ్చిపోయారు. బీరు బాటిళ్లు..పదునైన ఆయుధాలతో కనకరాజుపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు స్పందించి రక్తపు మడుగులో ఉన్న కనకరాజును ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. జనసేన నాయకులు మాడిస హరీ‹Ù, చందక గోవిందరాజు, దాసరి గణే‹Ùలను నిందితులుగా గుర్తించి పెందుర్తి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 2న అరెస్ట్ చేశారు. -
పంచకర్లపై జనసైనికుల అసహనం
పెందుర్తి: పొత్తులో భాగంగా జనసేన నుంచి పెందుర్తి టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుపై స్థానిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్లో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు, జనసేన సీనియర్ నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్‌కు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఆత్మీయ సమావేశానికి తమకు ఆహ్వానం లేదంటూ శివశంకర్ వర్గీయులు నిరసనకు దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారు పెత్తనం చెలాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ప్రోటోకాల్ మర్యాదలు తెలియవంటూ రమే‹Ùబాబు వర్గీయులపై మండిపడ్డారు. ఈ దశలో ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు వేదిక వద్దకు వచ్చే సమయం దగ్గర పడడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగేలా చేశారు. శివశంకర్–బండారుకు చెక్ జనసేనకు సీటు కేటాయిస్తే అది తనకే ఇవ్వాలని పంచకర్ల రమేష్‌బాబు పట్టుపడుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే తొలి నుంచి పంచకర్లతో రాజకీయ వైరం ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి.. పంచకర్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీకి అయితే తనకు, జనసేనకు అయితే శివశంకర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంచకర్లకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ తాను పనిచేయనంటూ ఇరువర్గాల అధిష్టానాలకు బండారు ఇదివరకే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఆత్మీ సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు ఏకకాలంలో శివశంకర్, అతనికి బలంగా మద్దతు పలుకుతున్న బండారుకు ఏకకాలంలో చెక్ పెట్టేందుకు పావులు కదిపారు. తనకు పారీ్టలోనే ప్రత్యరి్థగా ఉన్న శివశంకర్‌తోపాటు అతని వర్గీయులెవరికీ ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. దీంతో శివశంకర్‌తో పాటు అతని అనుచరులు కూడా రగిలిపోతున్నారు. ఒకవేళ టీడీపీకి టికెట్ వస్తే బండారుకు పని చేయబోమని పంచకర్ల వర్గం కూడా పరోక్షంగా చెప్పినట్లైందని జనసైనికులు అంటున్నారు. ఈ సమావేశంలో జనసేన కార్యదర్శి కె.నాగబాబు మాట్లాడుతూ టీడీపీ–జనసేన–బీజేపీల పొత్తు నిర్ణయంపై స్పష్టత వచ్చాకే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. -
‘పొత్తు’ కడుపులో కత్తులు!.. 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే స్థానాలపై పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముందుంచిన ప్రతిపాదిత అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇటీవల బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తమ సీటు ఎలా అడుగుతారంటూ టీడీపీ నేతలు స్థానిక జనసేన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఒత్తిళ్లకు తలొగ్గే పవన్ ప్రతిపాదనలు పార్టీ నాయకులు, కొన్ని కుల సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తమ పార్టీ కోరే సీట్ల జాబితాను అందజేశారు. జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న స్థానాలనూ జనసేనకు కేటాయించారన్న అభిప్రాయం కలిగించేలా ఉండాలని బాబుకు పవన్ స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతోపాటు మరో రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. 68 అసెంబ్లీ స్థానాల జాబితాను ఇచ్చి వాటిలో 45 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని, 2019లో టీడీపీ గెలిచిన 23 అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండైనా తప్పనిసరిగా ఇవ్వాలని పవన్ ప్రతిపాదించారని సమాచారం. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన లేదా అత్యధిక ఓట్లు సాధించిన స్థానాలతోపాటు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీకి కలిపి ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలను గుర్తించి జాబితాను టీడీపీ ముందుంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవే జనసేనకు కేటాయించాలని పవన్ కోరినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి. బీజేపీ పేరు చెప్పి వేచి చూద్దామన్న బాబు పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకోవాలని తొలి నుంచి యోచిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు వేచి చూద్దామని చంద్రబాబు పవన్‌కు సూచించినట్టు తెలుస్తోంది. మరో పది పదిహేను రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, అప్పటిదాకా రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలోనూ, నియోజకవర్గాల స్థాయిలోనూ సీట్ల అంశంలో ఎలాంటి ప్రకటనలు, విభేదాలు లేకుండా చూద్దామని చెప్పినట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో సీట్ల పంపకాలపై ప్రస్తుతానికి ప్రతిష్టంభన కొనసాగుతోంది. పలుచోట్ల రచ్చకెక్కిన విభేదాలు ► రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అసలు ఈ నియోజకవర్గాన్ని జనసేన ఎలా అడుగుతుందని అక్కడి జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు తమ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ► పెందుర్తి నియోజకవర్గంలో అక్కడి టీడీపీ నాయకుడు బండారు సత్యానందరావు, స్థానిక జనసేన నేత పంచకర్ల రమేష్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ► కాకినాడ రూరల్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టికెట్ రేసులో ఉన్న టీడీపీ నాయకులు తమ స్థానాలను జనసేనకు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ► పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేన నాయకుల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సమయంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ తరహా అసంతృప్తులను కట్టడి చేసేందుకు బీజేపీని బూచిగా చూపి జనసేనను శాంతపరుస్తున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించాలని కోరుతూ పవన్‌కళ్యాణ్ ప్రతిపాదించిన నియోజకవర్గాల జాబితా ఇదీ.. ► ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ► ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ► ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక ► ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం ► ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట ► ఉమ్మడి కష్ణా, గుంటూరు జిల్లాలో..: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు ► ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో: దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం -
బండారు బెండు వంచారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీటు కోసం నోటికి పని చెప్పి... వయస్సును కూడా మరచిన బండారు బెండు వంచింది సొంత పార్టీ. రానున్న ఎన్నికల్లో పెందుర్తి నుంచి టికెట్ లేదంటూ ఆ పార్టీ అధినేత బండారుకు తేల్చిచెప్పినట్టు సమాచారం. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును ఆ పార్టీకి కేటాయించనున్నట్టు పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల రాజకీయంలో ఉండాలంటే మాడుగుల నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తేల్చిచెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, మాడుగుల నుంచి బరిలోకి దిగేందుకు బండారు ససేమిరా అంటున్నారు. పెందుర్తి టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు వయస్సును కూడా మరచి మంత్రి రోజాపై అవాకులు చెవాకులు పేలారు. అయినప్పటికీ బండారుకు గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. పైగా ఆయన వ్యాఖ్యలతో మరింతగా పరిస్థితి దిగజారిపోయిందంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ చాప్టర్ ముగిసిన అధ్యాయమేనని ఆయన వర్గీయులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా సీటు కోసం నోటికి పనిచెప్పి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని దిగజార్చుకున్నా ఫలితం లేకపోవడంతో తన సన్నిహితుల వద్ద పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి రోజాపై వ్యాఖ్యల తర్వాత బండారు రాజకీయ గ్రాఫ్ మరింత వేగంగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వాస్తవానికి గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా బండారు పనిచేశారు. గత ఎన్నికల్లో యువకుడైన అదీప్‌రాజ్ చేతిలో మట్టికరిచారు. అప్పటి నుంచి ఎలాగోలా వార్తల్లో ఉండేలా బండారు నోటికి పనిచెబుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వార్తల్లో నిలిచే విధంగా చూసుకున్నారు. అయితే, ప్రజల్లో మద్దతు కోల్పోవడంతో ఆయనకు సీటు ఇచ్చినా గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసినా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఆయన కుమారుడు వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకతను మరింతగా పెంచింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పెందుర్తి నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలంటూ జనసేన పార్టీ పట్టుబట్టింది. అయితే, పెందుర్తి నుంచి టికెట్ ఇవ్వకపోతే తన సత్తా చూపిస్తానంటూ బండారు సన్నిహితుల వద్ద తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది. వయసైపోయిన నేపథ్యంలో తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుండటం.. ఇప్పటికీ వారసత్వంగా కొడుకును పరిచయం చేయకపోవడం బండారును చాలా బాధ పెడుతున్నట్టు తెలుస్తోంది. పెందుర్తి సీటుపై జనసేన కన్ను గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలవడంతో ఈ సీటు కోసం జనసేన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ పంచకర్ల రమేష్‌బాబు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ ఈ సీటు తనదేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే, సీటు జనసేనకు కేటాయించినా తెలుగుదేశం పార్టీ వర్గాలు సహకరించేది కష్టమేననన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ సీట్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో తెలుగుదేశం–జనసేన కలిసి జెండాలు పట్టుకుని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎక్కడా కలిసి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారికంగా బండారుకు ఝలక్ ఇస్తే.. జనసేన అభ్యర్థికి సహకరించడం కష్టమేనని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఇరు పార్టీల పొత్తుకు ఇక్కడి నుంచే బీటలు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జనసంద్రంతో హోరెత్తిన పెందుర్తి
పెందుర్తి(అనకాపల్లిజిల్లా): అనకాపల్లి జిల్లా పెందుర్తిలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర జనసంద్రంతో హోరెత్తింది. ఎమ్మెల్యే అదీప్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ రూపాయి లంచం లేకుండా సీఎం జగన్ పాలన చేశారు. కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబులాగా మాట తప్పే వ్యక్తి సీఎం జగన్ కాదు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి సీఎం జగన్. నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పిన సీఎంలు గతంలో ఎవరు లేరు. ప్రభుత్వ పాఠాశాలలను కార్పొరేట్ పాటశాలలుగా మార్చిన నాయకుడు సీఎం జగన్.మహిళలు కోసం అమ్మ ఒడి, చేయూత, ఆసరా, వసతి దీవెన, విద్య దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్నపుడు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘ రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం కూడా దైర్యంగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని దైర్యం చెప్పలేదు. ప్రతి కుటుంబం సీఎం జగన్ పథకాలతో బాగుపడింది.పేదల పిల్లలను అగ్ర వర్ణాల పిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. బీసీలను ఎస్సీలకు చంద్రబాబు అవమానించారు’ అని తెలిపారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో పదవులు కట్టబెట్టారు. త్వరలో వైజాగ్ వచ్చే సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘పెందుర్తి సభను చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోంది. 2 లక్షల 35 వేల కోట్లు ప్రజలకు రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్.సంక్షేమ పథకాలు వలన బడుగు బలహీనర్గాలు బాగుపడ్డాయి’అని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘ బీసీలకు అత్యధిక మంత్రి ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. బడుగు బలహీనర్గాల వారిని చంద్రబాబు ముష్టి వారిగా చూశారు. పేదల ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు అడ్డుకున్నారు. ద్రబాబు ఎన్నడూ నీతిగా పాలన చేయలేదు మళ్ళీ జగన్ సీఎం కాకపోతే మన జీవితం 25 ఏళ్లు వెనక్కి పోతుంది. రెండు ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారు?, లేని రోగాలు చెప్పుకొని చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక దొంగ అని గతంలో పవన్ చెప్పారు. ప్యాకేజీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట మారిపోయింది’ అని మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ జన ప్రవాహాన్ని చూస్తే వేదిక దగ్గరకు వెళ్ళగలనా అనే అనుమానం కలిగింది. సామాజిక సాధికార యాత్రకు ప్రవాహంలా తరలి వస్తున్నారు. సామాజిక సాధికార యాత్ర చూసి ప్రతి పక్ష పార్టీలు కలవర పాటుకు గురవుతున్నాయి. సామాజిక సాధికార యాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంబేద్కర్ పూలే అశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ఏపీ లో ఉన్న పేదరికాన్ని సీఎం జగన్ పారద్రోలుతున్నారు. పేదరికం ప్రభుత్వ పథకాలకు అనర్హత కాకూడదు అనేది సీఎం జగన్ విధానం.కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అణగదొక్కిన కులాలను సీఎం జగన్ ఆదుకున్నారు. క్యాబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు.బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చట్ట సభలకు పంపించారు.’ అని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 21వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గాల్లో జరగనుంది. అనకాపల్లి జిల్లా: పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జీవీఎంసీ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 11:30 గంటలకు వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ జరపనున్నారు. 12 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం 3 గంటలకు వెల్ఫే ర్ కాలేజీ నుంచి సబ్బవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్బవరం జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరుకానున్నారు. కాకినాడ జిల్లా: తునిలో ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తుని ఆర్అండ్బి అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జ్ పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. -
నేడు ‘పెందుర్తి’లో సామాజిక సాధికార బస్సు యాత్ర
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ తలపెట్టిన రెండో విడత సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో విడత సామాజిక బస్సుయాత్రకు పూనుకున్నారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మతాలకతీతంగా అర్హులైన అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారు. చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సామాజిక సాధికారత పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగాం సురేష్,తదితరులు హాజరు కానున్నారు. బస్సు యాత్ర సాగేదిలా.. ●ఉదయం 10.30 గంటలకు పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జంక్షన్లో సామాజిక సాధికార బస్సు యాత్రకు స్వాగతం ●10.45 గంటలకు మంత్రుల ప్రెస్‌మీట్ ●11.30 గంటలకు యాత్ర ప్రారంభం. వేపగుంట జంక్షన్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకూ బైక్ ర్యాలీ ●మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతన బ్లాక్ ప్రారంభం. అనంతరం అక్కడి నుంచి వెల్ఫేర్ కళాశాల వరకూ ర్యాలీ. అక్కడే లంచ్ ఏర్పాటు ●మధ్యాహ్నం 3.30 గంటలకు సబ్బవరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ యాత్ర విజయవంతం చేయండి సామాజిక సాధికార బస్సు యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజకీయంగా, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం చేసి బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలి – వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్