సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రెండో విడత సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో విడత సామాజిక బస్సుయాత్రకు పూనుకున్నారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించనున్నారు.
అలాగే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మతాలకతీతంగా అర్హులైన అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారు. చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సామాజిక సాధికారత పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ యాత్రకు స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగాం సురేష్,తదితరులు హాజరు కానున్నారు.
బస్సు యాత్ర సాగేదిలా..
●ఉదయం 10.30 గంటలకు పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జంక్షన్‌లో సామాజిక సాధికార బస్సు యాత్రకు స్వాగతం
●10.45 గంటలకు మంత్రుల ప్రెస్‌మీట్
●11.30 గంటలకు యాత్ర ప్రారంభం. వేపగుంట జంక్షన్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకూ బైక్ ర్యాలీ
●మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతన బ్లాక్ ప్రారంభం. అనంతరం అక్కడి నుంచి వెల్ఫేర్ కళాశాల వరకూ ర్యాలీ. అక్కడే లంచ్ ఏర్పాటు
●మధ్యాహ్నం 3.30 గంటలకు సబ్బవరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ
యాత్ర విజయవంతం చేయండి
సామాజిక సాధికార బస్సు యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజకీయంగా, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం చేసి బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలి
– వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment