![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/10/09vscp11-600449_mr_1.jpg.webp?itok=N_lFzJ2e)
విశాఖ స్పోర్ట్స్: మహా క్రీడా సంబరంతో విశాఖ మురిసిపోయింది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ తుది ఘట్టానికి విశాఖ వేదికైంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను విశాఖ రైల్వే స్టేడియంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు.
ఈనెల 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈసందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే ఇదే చక్కటి సందర్భం అన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తొలుత రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వీసీఎండీ టాలెంట్ హంట్‌లో భాగంగానే ఈ పోటీలు అన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ క్రీడాకారులు పోటీతత్వం అలవర్చుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ విశాఖ వేదికగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం నగరం చేసుకున్న అదృష్టమన్నారు. భారత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్, స్థానికుడు కేఎస్ భరత్ మాట్లాడుతూ కష్టపడితే ఫలితం దక్కుతుందని అన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 26 జిల్లాలకు చెందిన మెన్, వుమెన్ జట్ల చేత అతిథులు క్రీడాప్రతిజ్ఞ చేయించారు.
తొలుత రైల్వే స్టేడియంలోని వేదిక వద్ద శాప్ పతాకాన్ని ఆ సంస్థ చైర్మన్ సిద్ధ్దార్థరెడ్డి, జాతీయ పతాకాన్ని మంత్రి రోజా ఆవిష్కరించగా అతిథులు గౌరవవందనం సమర్పించారు. పోటీలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి ప్రకటించి గాల్లోకి బెలూన్లను విడిచారు. అనంతరం అతిథులు క్రీడాకారుల్ని పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏడీసీ కేఎస్ విశ్వనాథన్, ఇతర రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
![ఏయూ మైదానంలో వాలీబాల్ పోటీలో తలపడుతున్న క్రీడాకారిణులు1](/gallery_images/2024/02/10/09vsc81d-320047_mr_0.jpg)
ఏయూ మైదానంలో వాలీబాల్ పోటీలో తలపడుతున్న క్రీడాకారిణులు
![కబడ్డీ..కబడ్డీ2](/gallery_images/2024/02/10/09vsc274-320061_mr_0.jpg)
కబడ్డీ..కబడ్డీ
![3](/gallery_images/2024/02/10/09vscp05-600449_mr_0.jpg)
![క్రీడాకారులతో మంత్రి రోజా క రచాలనం4](/gallery_images/2024/02/10/09vscp27-600449_mr_0.jpg)
క్రీడాకారులతో మంత్రి రోజా క రచాలనం
![కలెక్టర్ మల్లికార్జునతో సెల్ఫీ5](/gallery_images/2024/02/10/09vscp29-600449_mr_1.jpg)
కలెక్టర్ మల్లికార్జునతో సెల్ఫీ
![శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి 6](/gallery_images/2024/02/10/09vscp17-600449_mr_0.jpg)
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment