స్థల వివాదంపై ఇరువర్గాల ఫిర్యాదు
గొలుగొండ: కొత్తమల్లంపేట గ్రామంలో ఇంటి స్థలం వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన రొంగల సత్యవతి ఊరు శివారున రేకుల షెడ్డులో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి దౌర్జన్యంగా ఇంటిలో నుంచి తనను బయటకు తీసుకువచ్చి సర్పంచ్ రాజుబాబు దౌర్జన్యం చేసి, ఇంటిని పొక్లెయిన్‌తో కూల్చివేశారని సత్యవతి ఆరోపిస్తోంది. కుటుంబ సభ్యుల గొడవలో స్థానిక సర్పంచ్ రాజుబాబు కలగజేసుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఇంటిని నేలమట్టం చేశారని సత్యవతి గొలుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అటుగా వెళ్తున్న తనపై దౌర్జన్యం చేయడంతో గాయపడినట్లు రాజుబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవతితో పాటు రాజుబాబు కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొలుగొండ ఎస్‌ఐ రామారావు తెలిపారు.
స్థల వివాదంపై ఇరువర్గాల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment