ట్రాలీ లారీ బీభత్సం
మాడుగుల : మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో ట్రాలీ లారీ ఆదివారం సాయంకాలం మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, బాధితులు కథనం ప్రకారం చోడవరం నుంచి కింతలి వైపు వస్తున్న ట్రాలీ లారీ కింతలి వైపు నుంచి ఘాట్‌రోడ్ వైపు వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను గాదిరాయి వద్ద ఢీకొట్టింది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖకు చెందిన ఎపి31 టిహెచ్ 2469 అనే నెంబరుగల ట్రాలీ లారీని పెందుర్తికి చెందిన లారీ డ్రైవర్ పాకలపాటి పవన్ కుమార్ మద్యం మత్తులో అజాగ్రతగా నడుపుతూ గాదిరాయి వద్ద వాహనాలను ఢీకొట్టాడు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇల్లపు పల్లవికి తీవ్ర గాయాలు తగలడంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చీడికాడ మండలం చెట్టుబిల్లి గ్రామానికి చెందిన కాకర కొండబాబు, (55) కాకర కొండమ్మ(50)తో పాటు మాడుగుల మండలం గొటివాడ అగ్రహారానికి చెందిన మాదాసి ఎర్రునాయుడు, పల్ల అప్పారావుకు తీవ్రగాయాలు తగిలాయి. వారిని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల బైక్‌లతో పాటు దగ్గరలో ఉన్న వ్యాపారదుకాణాన్ని లారీ ఢీకొట్టడంతో దుకాణం గోడలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా బైక్‌లు నుజ్జునుజ్జు అయ్యి ఐదుగురు గాయపడ్డారు. స్థానిక 30 పడకల ఆసుపత్రికి వారిని తరలించగా అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి తీవ్రంగా గాయపడిన పల్లవిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు రిపర్ చేశారు. మరో నలుగురిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్.ఐ నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు ద్విచక్ర వాహనాలకు ఢీ
ఐదుగురికి తీవ్ర గాయాలు
ఆస్పత్రికి తరలింపు
ట్రాలీ లారీ బీభత్సం
ట్రాలీ లారీ బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment