అవార్డులు అందుకున్న కార్యదర్శులు, ల్యాబ్ టెక్నీషియన్లు
మాకవరపాలెం: క్షయ రహిత గ్రామాలకు అవార్డులు లభించాయి. మండలంలోని బయ్యవరం, జి.గంగవరం, బి.ఎస్.పేట, జడ్.గంగవరం గ్రామాలను ఇటీవల క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ముక్త్ భారత్ కార్యక్రమంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఈ పంచాయతీల కార్యదర్శులు క్షయ జిల్లా అధికారుల నుంచి అవార్డులు అందుకున్నారు. మాకవరపాలెం పీహెచ్‌సీలో క్షయ విభాగం ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సుధీర్ కూడా అవార్డు అందుకున్నట్టు వైద్యాధికారి సీతారామలక్ష్మి తెలిపారు.