విద్యుత్ లోడ్ రెన్యూవల్‌కు రాయితీ
● సర్‌చార్జీలు లేకుండా బిల్లులు చెల్లించవచ్చు ● ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణారావు
నర్సీపట్నం: ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయిలు ఏప్రిల్ 17వ తేదీలోగా చెల్లిస్తే సర్‌చార్జీలు ఉండవని ఏపీఈపీడీసీఎల్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఆయా కార్యాలయా ల అధికారులు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు సహకరించాలన్నారు. లోడ్ రెన్యూవల్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. గృహ వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి లోడ్ రెన్యూవల్ చేసుకుంటే 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఈ అవకాశం జూన్ నెలాఖరు వరకు మాత్రమే ఉందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 315 దరఖాస్తులు వచ్చాయని, 194 కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల 121 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కొద్ది రోజుల్లో మంజూరు చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఉక్కపోత ప్రారంభం కావడంతో ఏసీల వాడకమూ పెరిగిందని డిఈఈ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏసీలు కొనుగోలు చేసేవారు, ఇప్పటి వరకు వాడకుండా పునఃప్రారంభించే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. గది లోపల సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలని, ఏసీలోని ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయాలని సూచించారు. బిగించేటప్పుడు కండెన్సేషన్ పైపుల్లో నీరు పోసి పరీక్షించాలన్నారు. గాలి వీచే ద్వారాలను శుభ్రం చేయాలన్నారు. తద్వారా విద్యుత్తు ఆదా అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment