‘గోవాడ’ క్రషింగ్‌కు మరో సమస్య
చోడవరం: కాటాల నుంచి చెరకు తరలించాల్సిన లారీలు రాకపోవడంతో ఎక్కడి చెరకు అక్కడే ఉండిపోయింది. చేతికందిన డబ్బులతో లారీల కాంట్రాక్టర్ చడీచప్పుడు లేకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి మరో సమస్య వచ్చి పడింది. కాటాల వద్ద చెరకు ఉండిపోయి క్రషింగ్‌కు కావలసిన సరకు సమయానికి అందని పరిస్థితి నెలకొంది. చెరకు కాటాల నుంచి సుగర్ ఫ్యాక్టరీకి లారీల్లో చెరకు చేరవేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఏటా ఒప్పందం చేసుకుంటారు. ఈ ఏడాది కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. మొత్తం 19 కాటాల నుంచి 25 నుంచి 30 లారీల్లో కాంట్రాక్టర్ ఫ్యాక్టరీకి చెరకు తరలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యాక్టరీ లారీల కాంట్రాక్టర్‌కు రెండు నెలలుగా బిల్లులు చెల్లించడంలో జాప్యం చేసింది. ఎట్టకేలకు శనివారం కాంట్రాక్టర్‌కు రూ.66 లక్షలు చెల్లించింది. ఈ పేమెంట్ తీసుకున్న కాంట్రాక్టర్ యాజమాన్యానికి చెప్పకుండా లారీలను నిలిపివేసి గుట్టుచప్పుడు కాకుండా వారి సొంత ఊరికి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయానికి కాటాల నుంచి చెరకు రాకపోవడంతో ఫీల్డు సిబ్బంది, వ్యవసాధికారులను యాజమాన్యం వాకబు చేయడంతో అసలు విషయం బయటపడింది. కాటాల వద్దకు లారీలు రాకపోవడంతో అక్కడ చెరకు లోడ్ చేసే కలాసీలు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ సన్యాసినాయుడుతో సమావేశమయ్యారు. లారీల కాంట్రాక్టర్ తమకు రావలసిన లోడింగ్ డబ్బులు ఇవ్వకుండా లారీలను తీసుకొని వెళ్లిపోయాడని, తమకు న్యాయం చేయాలని వారు ఎండీకి విన్నవించుకున్నారు. క్రషింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో సకాలంలో చెరకు ఫ్యాక్టరీకి రాకుండా కాటాల వద్దే ఉండిపోవడంతో క్రషింగ్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్‌ను ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ఎండీ తెలిపారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
బిల్లు డబ్బులు తీసుకుని లారీలతో పరారైన ఒప్పంద కాంట్రాక్టర్
లారీలు రాక కాటాల వద్దే నిలిచిపోయిన చెరకు
క్రషింగ్‌కు చెరకు అందక ఇబ్బందులు
తమకు లోడింగ్ డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడని కలాసీలు లబోదిబో
ప్రత్యామ్నాయ ట్రాన్స్‌పోర్టుకు చర్యలు చేపట్టిన యాజమాన్యం
‘గోవాడ’ క్రషింగ్‌కు మరో సమస్య
Comments
Please login to add a commentAdd a comment