దంచికొట్టుడు
సాగర తీరంలో
విశాఖ స్పోర్ట్స్ : సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. చివరి వరకు మ్యాచ్ ఇరువైపులా దోబూచులాట.. క్రికెట్ అభిమానులకు ఇంకేం కావాలి. ఫుల్ పండగే. డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్ ఫ్యాన్స్‌కు మస్తు మజా ఇచ్చింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆధిపత్యం చూపించగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు తామేం తక్కువ కాదన్నట్లుగా అద్భుత షాట్లతో అలరించారు. బ్యాటర్లు సిక్సులు, ఫోర్లు దంచికొట్టగా ఫ్యాన్స్ హోరు అంబరాన్ని తాకింది. అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓటర్లకు 209/8 పరుగు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 211/9 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండో మ్యాచ్‌ను వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలోనే ఈనెల 30న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది.
కులదీప్‌తో అక్షర్ పటేల్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మద్దతు తెలుపుతూ ఫ్యాన్స్ సందడి
ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
చివరివరకు పోరాడిన లక్నో సూపర్ జెయింట్స్
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ పండగ
దంచికొట్టుడు
దంచికొట్టుడు
Comments
Please login to add a commentAdd a comment