రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
సంఘటన స్థలంలో తాతీలు మృతదేహం
మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృతి చెందారు. మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన గుడివాడ తాతీలు(60) శుక్రవారం మధ్యాహ్నం నర్సీపట్నం నుంచి మోటార్ సైకిల్‌పై స్వగ్రామం వస్తున్నారు. మండలంలోని జి.గంగవరంలోని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తూ ఢీకొట్టారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment