మాడుగుల టికెట్‌ ఎవరికిచ్చినా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

మాడుగుల టికెట్‌ ఎవరికిచ్చినా పనిచేయాలి

Feb 10 2024 1:00 AM | Updated on Feb 11 2024 1:15 PM

కార్యకర్తలతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు

మాడుగుల/చోడవరం: మాడుగుల టికెట్‌ ఎవరికిచ్చినా అందరూ కలిసి పనిచేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. శుక్రవారం మాడుగుల మండలంలోని ఘాట్‌రోడ్‌ జంక్షన్‌లో ఆ పార్టీ నాయకుడు రాయిపురెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవల వల్లే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని, గడచిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకపోవడం వల్లే జనసేన పార్టీ ఓటమి చవిచూసిందని చెప్పారు. సమావేశానికి జనసేన కార్యకర్తలు అరకొరగా హాజరయ్యారు.

చోడవరంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు ఆధ్వర్యంలో చోడవరంలో జరిగిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుందనే అంశాలు వారం రోజుల్లో తేలుతాయన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌ బాబు, యలమంచిలి ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement