
జనసేన నేతలు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు. ఆయనపై మరో జనసేన నేత నోరు పారేసుకున్నారు.
సాక్షి, కృష్ణా జిల్లా: జనసేన నేతలు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు. ఆయనపై మరో జనసేన నేత నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఓ కమెడియన్ అంటూ ఆ పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు నోటి దురుసు ప్రదర్శించారు. ‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండతో ఇండస్ట్రీకి వచ్చావు. మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయి నీకు లేదు. నీ బాబు అల్లు అరవింద్ పిల్లికి బిక్షం కూడా పెట్టడు. నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘‘చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లుకడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని తప్పుని సరిచేసుకో. అలా చేయని పక్షంలో డిసెంబర్ లో రిలీజ్ అయ్యే నీ సినిమాలను అడ్డుకుంటాం. గన్నవరం నియోజకవర్గంలో నీ సినిమా ఒక్క థియేటర్‌లోకూడా విడుదలయ్యే పరిస్థితి ఉండదు.’’ అని చలమశెట్టి హెచ్చరించారు.
కాగా, ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అంటూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
