మెదక్‌ డీఈఓకు సన్మానం | honor for medak new DEO | Sakshi
Sakshi News home page

మెదక్‌ డీఈఓకు సన్మానం

Published Sat, Sep 10 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

డీఈకు సన్మానం

డీఈకు సన్మానం

మెదక్‌ మున్సిపాలిటీ: మెదక్‌ జిల్లా విద్యాధికారి(డీఈఓ)గా నియమితులైన మెదక్‌ పట్టణానికి చెందిన శివ్వ రమేష్‌ బాబును శనివారం ఘనంగా సన్మానించారు. శనివారం డీఈఓను ఆయన ఇంట్లో కలిసి  కౌన్సిలర్‌ ఆర్కె శ్రీనివాస్‌ కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో మచ్చలేని వ్యక్తిగా ఉన్న రమేష్‌బాబు ఎంతోప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు.

లెక్చరర్‌గా, డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా, డిప్యూటీ ఈఓగా పనిచేసిన రమేష్‌బాబు  డీఈఓగా ప్రమోషన్‌ పొందడం మెదక్‌ పట్టణానికే గర్వకారణమన్నారు. రమేష్‌బాబు మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తొడుపునూరి శివరామకృష్ణ, కొండశ్రీనివాస్‌, నరెందర్‌, బిక్షపతి, టిన్ను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement