
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు(56)మృతితో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఈ రోజు (జనవరి9) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రమేశ్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కూడా ఉంచేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంత్యక్రియలు త్వరగా ముగించాలని భావిస్తున్నారు. రమేశ్ బాబు అంతిమ కార్యక్రమాలకు ఎక్కువమంది హాజరు కాకపోవడమే మంచిదని కృష్ణ ఫ్యామిలీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. సోదరుడి కడసారి చూసేందుకు మహేశ్ బాబు వస్తాడా రాడా అనే సందేహం అందరిలో నెలకొంది. ఇటీవల మహేశ్ బాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా.. మరోవైపు సోదరుడి మరణంతో మహేశ్‌బాబుకు మరింత బాధపడుతున్నారు.
(చదవండి: హీరో మహేశ్ బాబు ఇంట్లో విషాదం.. రమేశ్‌బాబు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment