
బాలీవుడ్ ఎంట్రీకి మహేష్ రెడీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో దీనిపై మహేష్ భార్య నమ్రత మాట్లాడుతూ.. బాలీవుడ్లో అడుగుబెట్టడానికి మహేష్ సిద్ధంగా ఉన్నారని మంచి కథ కుదిరితే త్వరలోనే హిందీలో నటిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే మహేష్ మాట్లాడే హిందీ కూడా బాగుంటుందని నమ్రత కితాబిచ్చింది.
ఇటీవల మహేష్ బాబు ముంబైలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతని మిత్రులతో కలిసి ఏర్పాటుచేసిన వెంచర్లో రూ. 25 కోట్లతో మహేష్ ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ఎంట్రీని దృష్టిలో ఉంచుకొనే మహేష్ ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారని, త్వరలోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉండొచ్చని ఫిల్మ్నగర్ వర్గాలు భావిస్తున్నాయి.