Niharika Konidela Husband Chaitanya Gives Clarity On His Acting Debut, Deets Inside -- Sakshi
Sakshi News home page

Niharika Konidela: మూవీ ఎంట్రీపై మెగా డాటర్‌ నిహారిక భర్త చైతన్య క్లారిటీ!

Published Fri, Jul 29 2022 3:35 PM | Last Updated on Fri, Jul 29 2022 5:07 PM

Niharika Konidela Husband Chaitanya Clarity on His Acting Debut - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె నటిగా రాణించింది. ఇక పెళ్లి అనంతరం ప్రొడ్యూసర్‌గా మారిపోయింది. ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌, సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమె భర్త గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా పెళ్లి అనంతరం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది.

చదవండి: విజయ్‌, రష్మిక డేటింగ్‌? హింట్‌ ఇచ్చిన అనన్య పాండే

దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడంటూ అందరు చర్చించుకున్నారు. చైతన్య హైట్‌, పర్సనాలిటి కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండ ఉండటంతో అంతా అతడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన మూవీ డెబ్యూ చైతన్య సన్నిహితుల నుంచి ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా చైతన్యకు సినిమాలు, నటన అంటే పెద్ద ఆసక్తి లేదని, అతడి వ్యాపారం అంటనే ఇష్టమని చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి: రష్మికపై విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

నిహారికి పెళ్లి అనంతరం ఎక్కడికి వెళ్లిన చైతన్యకు తన సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతున్నాయట. వాటికి విసిగిపోయిన చైతన్య తనకు యాక్టింగ్‌ అంటే ఇష్టం లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న వ్యాపారం పట్ల సంతృప్తిగా ఉన్నానని కుండలు బద్ధలు కొట్టినట్లు సన్నిహితుల నుంచి సమాచారం. కాగా నిహారిక-చైతన్యలు 2020 లాక్‌డౌన్‌లో డిసెంబర్‌ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement