![late Haranaths grandson Virat Raj Debut As Hero - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/28/virat-raj.jpg.webp?itok=uWUeAMCJ)
దివంగత ప్రముఖ నటులు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా పరిచయం కానున్నారు. విరాట్ రాజ్ హీరోగా నటించనున్న సినిమాకు ‘సీతా మనోహర శ్రీరాఘవ’ టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. దుర్గా శ్రీ వత్సస. కె దర్శకత్వంలో ఈ సినిమాను వందన మూవీస్ పతాకంపై టి. సుధాకర్ నిర్మించనున్నారు.
సెప్టెంబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.‘కేజీఎఫ్ 2’, ‘సలార్’ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ‘‘తాత వెంకట సుబ్బరాజు, పెదతాత హరనాథ్‌ల స్ఫూర్తితో హీరోగా పరిచయం అవుతున్నాను’’ అన్నారు విరాట్.
చదవండి : తండ్రైన నటుడు.. బెస్ట్ ఫీలింగ్ అన్న స్టార్ హీరో
ఆదిపురుష్ షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొనడం లేదు! ఎందుకోసం..!
Comments
Please login to add a commentAdd a comment