జీఎన్ఏ యాక్సెల్స్‌ బ్లాక్ బస్టర్ ఎంట్రీ | GNA Axles Makes Blockbuster Debut, Shares Surge Over 26percent | Sakshi
Sakshi News home page

జీఎన్ఏ యాక్సెల్స్‌ బ్లాక్ బస్టర్ ఎంట్రీ

Published Mon, Sep 26 2016 11:58 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

జీఎన్ఏ  యాక్సెల్స్‌ బ్లాక్ బస్టర్ ఎంట్రీ - Sakshi

జీఎన్ఏ యాక్సెల్స్‌ బ్లాక్ బస్టర్ ఎంట్రీ

ముంబై: పంజాబ్ కు చెందిన జీఎన్‌ఏ యాక్సెల్స్‌  సోమవారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ఇటీవలి పబ్లిక్‌ ఇష్యూను ఘనంగా  పూర్తిచేసుకున్న ఈ ఆటో విడిభాగాల సంస్థ స్టాక్‌  ఎక్స్ఛేంజీలలో  బ్లాక్ బ్లస్టర్  ఎంట్రీ ఇచ్చింది.   26 శాతం లాభాలతో మదుపర్లను  ఆకట్టుకుంటోంది.  దాదాపు 20 శాతం ప్రీమియంతో లిస్టయిన సంస్థ  ఇష్యూ ధర రూ. 207. అయితే  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  రూ. 260 పైగా  ఎగిసింది.  
జీఎన్‌ఏ యాక్సెల్స్‌  ఐపీవో లో  55 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ కావడంతో రూ. 130 కోట్లను సమీకరించింది. కంపెనీ ఆఫర్‌ చేసిన 44.7 లక్షల షేర్లకుగాను 24.53 కోట్ల బిడ్స్‌ దాఖలయ్యాయి.  సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగంలో 17.18 రెట్లు, సంపన్నవర్గాల కోటాలో 217 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో సైతం దాదాపు 12 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి.

మరోవైపు ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కూడా దాదాపు రూ. 38 కోట్లను సమీకరించింది.  ప్రధానంగా  ఫోర్  వీలర్స్ కు  వెనుక భాగంలో బిగించే(రియర్‌) యాక్సిల్‌ షాఫ్ట్‌లను తయారు చేస్తుంది. కాగా ఈ ఐపీవో ద్వారా సమకూరిన ఆదాయాన్ని    ప్లాంట్, యంత్రాల కొనుగోలుకు,  వర్కింగ్  క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం  సంస్థ వినియోగించనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement