GNA Axles
-
జీఎన్ఏ యాక్సిల్స్ లిస్టింగ్ లాభాలు
ముగింపులో 18 శాతం లాభాలు న్యూఢిల్లీ: వాహన విడిభాగాలు తయారు చేసే జీఎన్ఏ యాక్సి ల్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర(రూ.207) తో పోల్చితే బీఎస్ఈలో 20 శాతం, ఎన్ఎస్ఈలో 22 శాతం లాభాలతో లిస్ట్ అయింది. చివరకు బీఎస్ఈలో 18.45 శాతం లాభంతో రూ.245 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ షేర్ 26 శాతం లాభంతో రూ.260 గరిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో 5.9 లక్షలు, ఎన్ఎస్ఈలో 15.2 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.526 కోట్లుగా ఉంది. ఈ నెల 14-16 మధ్య ఈ కంపెనీ రూ.130 కోట్ల సమీకరణ కోసం ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. రూ.205-207 ధరల శ్రేణిగా ఉన్న ఈ ఐపీఓ 55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)కు కేటాయించిన వాటా 17 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్ల వాటా 217 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను -యంత్రాలు, ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను, ఇతర సాధారణ వ్యాపార అవసరాలను తీర్చుకోవడానికి వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. -
జీఎన్ఏ యాక్సెల్స్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ
ముంబై: పంజాబ్ కు చెందిన జీఎన్ఏ యాక్సెల్స్ సోమవారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ఇటీవలి పబ్లిక్ ఇష్యూను ఘనంగా పూర్తిచేసుకున్న ఈ ఆటో విడిభాగాల సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బ్లాక్ బ్లస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 26 శాతం లాభాలతో మదుపర్లను ఆకట్టుకుంటోంది. దాదాపు 20 శాతం ప్రీమియంతో లిస్టయిన సంస్థ ఇష్యూ ధర రూ. 207. అయితే ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో రూ. 260 పైగా ఎగిసింది. జీఎన్ఏ యాక్సెల్స్ ఐపీవో లో 55 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ కావడంతో రూ. 130 కోట్లను సమీకరించింది. కంపెనీ ఆఫర్ చేసిన 44.7 లక్షల షేర్లకుగాను 24.53 కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) విభాగంలో 17.18 రెట్లు, సంపన్నవర్గాల కోటాలో 217 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో సైతం దాదాపు 12 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. మరోవైపు ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కూడా దాదాపు రూ. 38 కోట్లను సమీకరించింది. ప్రధానంగా ఫోర్ వీలర్స్ కు వెనుక భాగంలో బిగించే(రియర్) యాక్సిల్ షాఫ్ట్‌లను తయారు చేస్తుంది. కాగా ఈ ఐపీవో ద్వారా సమకూరిన ఆదాయాన్ని ప్లాంట్, యంత్రాల కొనుగోలుకు, వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం సంస్థ వినియోగించనుంది.