
పూజా కణ్ణన్.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్ కూడా. ఇక్కడున్న ఫొటోని చూస్తుంటే అక్క ఎవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. సాయిపల్లవిలా చెల్లెలిలా ఉంది కదూ! నిజమే. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని సమాచారం. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్’... ఇలా పలు చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా చేసిన స్టంట్ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా పూజా కణ్ణన్ కథానాయికగా పరిచయం కానున్నారని సమాచారం.
శివకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా చేయనున్నారు. సముద్రఖని మరో కీలక పాత్రధారి. దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సాయిపల్లవి ‘కరు’ (తెలుగులో ‘కణం’) అనే సినిమాలో నటించారు. అలాగే ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చేశారు పూజా కణ్ణన్. ఐదేళ్ల క్రితం ‘కారా’ అనే షార్ట్ ఫిలింలో నటించారు పూజ. మరి పూజా కణ్ణన్ వెండితెర అరంగేట్రం షురూ అవుతుందా? వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment