'అన్ని పార్టీలు టికెట్ ఇస్తామన్నాయి' | I was offered Lok Sabha and Rajya Sabha tickets, says Raveena Tandon | Sakshi
Sakshi News home page

'అన్ని పార్టీలు టికెట్ ఇస్తామన్నాయి'

Published Mon, Apr 4 2016 8:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'అన్ని పార్టీలు టికెట్ ఇస్తామన్నాయి' - Sakshi

'అన్ని పార్టీలు టికెట్ ఇస్తామన్నాయి'

గుర్గావ్: తాను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తానని బాలీవుడ్ నటి రవీనా టాండన్ తెలిపింది. రెండు పడవలపై కాళ్లు పెట్టడం తనకు ఇష్టం ఉండదని వెల్లడించింది. తన తాజా చిత్రం షూటింగ్ కోసం ఆమె గుర్గావ్ వచ్చింది. నెల రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననుంది. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈ సినిమా ద్వారా సందేశం ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరిలో అంతర్మథనం మొదలవుతుందని చెప్పింది.
 

రాజకీయ ప్రవేశం గురించి అడగ్గా... 'అన్ని ప్రధాన పార్టీలు నాకు లోక్ సభ, రాజ్యసభ సీట్లు ఇస్తామని ఆఫర్ చేశాయి. ప్రస్తుతానికి పాలిటిక్స్ లో చేరే ఉద్దేశం లేదు. స్వేచ్ఛగా నా గళం వినిపించాలనుకుంటున్నా' అని 41 ఏళ్ల రవీనా బదులిచ్చింది. ట్విటర్ లో వ్యక్తం చేసే అభిప్రాయాలపై రాజకీయం చేస్తున్నారని వాపోయింది. ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement