టీచర్‌కు స్వీట్ షాకిచ్చిన రవీనా | Teachers' Day: Bollywood celebs pay tribute to their mentors | Sakshi
Sakshi News home page

టీచర్‌కు స్వీట్ షాకిచ్చిన రవీనా

Sep 6 2015 12:08 AM | Updated on Sep 3 2017 8:48 AM

టీచర్‌కు స్వీట్ షాకిచ్చిన రవీనా

టీచర్‌కు స్వీట్ షాకిచ్చిన రవీనా

అది ముంబైలోని వృద్ధాశ్రమం. శ్రీమతి పార్మర్ అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ అక్కడి వృద్ధులకు సేవ చేస్తుంటారు.

 అది ముంబైలోని వృద్ధాశ్రమం. శ్రీమతి పార్మర్ అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ అక్కడి వృద్ధులకు సేవ చేస్తుంటారు. టీచర్స్ డే నాడు కూడా ఎప్పటిలా వృద్ధాశ్రమానికి వచ్చారామె. ఇంతలో సడన్‌గా ఆ వృద్ధాశ్రమం కోలాహలంగా మారింది. విషయం ఏమిటంటే, పార్మర్‌ను చూడటానికి ఆమె పూర్వ విద్యార్థిని, బాలీవుడ్ కథా నాయిక రవీనా టాండన్ వచ్చారు. ఆమెను చూడగానే స్వీట్ షాక్‌కు గురయ్యారు పార్మర్. సరిగ్గా పాతికేళ్ల తర్వాత రవీనా తన టీచర్‌ను కలిసి ఆనాటి స్మృతులను పంచుకున్నారు. ‘‘నా వ్యక్తిత్వ వికాసానికి బంగారు బాట వేసిన పార్మర్‌ను నా జీవితంలో మర్చిపోలేను. అందుకే కలవడానికి వెళ్లా’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అని అందులో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement