మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమంపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించింది. ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత దేశవాసులు అందరిమీదా ఉందని తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన తర్వాత రవీనా విలేకరులతో మాట్లాడింది. శ్రీకృష్ణుడి నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పింది. జమ్ము కాశ్మీర్లో వరదలతో బాధపడుతున్నవారిని ఆదుకోడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కూడా ప్రజలకు రవీనా పిలుపునిచ్చింది.