Raveena Tandon Opens Up About Broken Engagement With Akshay Kumar, Deets Inside - Sakshi
Sakshi News home page

Raveena Tandon: ప్రియుడితో నిశ్చితార్థం రద్దు, ఇద్దరం చెరొకరితో డేటింగ్‌ చేశాం..

Published Wed, Feb 8 2023 2:00 PM | Last Updated on Wed, Feb 8 2023 5:06 PM

Raveena Tandon about Engagement Broke Up with Akshay Kumar - Sakshi

ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రవీనా టండన్‌ ఇప్పుడు ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. చివరగా కేజీఎఫ్‌ 2 మూవీలో మెరిసిన రవీనా గతంలో తన కోస్టార్‌ అక్షయ్‌ కుమార్‌తో పెళ్లిదాకా వెళ్లింది. కానీ తర్వాత నిశ్చితార్థం క్యాన్సిల్‌ చేసుకోవడంతో అప్పట్లో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయం గురించి రవీనా మీడియాతో మాట్లాడుతూ.. 'మొహ్రా(1994) సినిమాలో అక్షయ్‌, నేను కలిసి నటించాం. అప్పుడు మా జంట బాగా ఫేమస్‌. 90's లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. అయితే సరిగ్గా ఎప్పుడనేది మాత్రం గుర్తు లేదు. తర్వాత విడిపోయి చెరో దారి చూసుకున్నాం. నేనొకరితో డేటింగ్‌ చేశా, అతడూ మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య జెలసీ ఎందుకొస్తుంది?

అప్పటికీ, ఇప్పటికీ మేము హిట్‌ పెయిరే.. అప్పుడప్పుడు కలుసుకుంటాం.. మాట్లాడుకుంటాం. అయినా కాలేజీలో వారానికో బాయ్‌ఫ్రెండ్‌ను మారుస్తారు. కానీ ఒక్క నిశ్చితార్థం బ్రేక్‌ అయినందుకు అది మైండ్‌లో అలా ఉండిపోయింది. ఎందుకో మరి తెలియదు. ఇప్పుడు బ్రేకప్‌లు, విడాకులు అయినా కూడా జనాలు ముందుకు సాగుతున్నారు. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు' అని చెప్పుకొచ్చింది రవీనా. కాగా అక్షయ్‌ రవీనాకు బ్రేకప్‌ చెప్పాక అచ్చం తనలా ఉండే అమ్మాయితో డేటింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే రవీనా టండన్‌ బిజినెస్‌మెన్‌ అనిల్‌ తడానీని పెళ్లి చేసుకోగా వీరికి రాశా, రణ్‌బీర్‌వర్దన్‌ సంతానం. అక్షయ్‌ కుమార్‌ ట్వింకిల్‌ ఖన్నాను పెళ్లి చేసుకోగా వీరికి ఆరవ్‌, నితారా ప్లిలలు ఉన్నారు.

చదవండి: జనాలు నాపై కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement