
భర్త అంటే ఇలా ఉండాలి!
మా అమ్మానాన్నలు గొడవ పడగా ఎప్పుడూ చూసింది లేదు. వారిది అన్యోన్య దాంపత్యం. దీనికి కారణం... రహస్యం అనేది లేకుండా ప్రతి చిన్న విషయాన్నీ పరస్పరం పంచుకోవడమే.
మా ఆయన బంగారం: రవీనా టండన్
మా అమ్మానాన్నలు గొడవ పడగా ఎప్పుడూ చూసింది లేదు. వారిది అన్యోన్య దాంపత్యం. దీనికి కారణం... రహస్యం అనేది లేకుండా ప్రతి చిన్న విషయాన్నీ పరస్పరం పంచుకోవడమే. ప్రతి అనుబంధానికి, దాంపత్యానికి కమ్యూనికేషన్ అనేది ముఖ్యం అని నా నమ్మకం.
పెళ్లయిన తరువాత మనసు నిండా సంతోషంతో ఉండాలి తప్ప, తల నిండా సమస్యలతో ఉండకూడదు అనేకునేదాన్ని. అదృష్టవశాత్తూ నన్ను అర్థం చేసుకునే భర్త(అనిల్ తండానీ) లభించాడు. దీనికి ఒక కారణం ఆయన కూడా చిత్రసీమకు చెందిన వ్యక్తే కావడం.
భార్యా భర్తలు ఏ విషయాన్ని అయినా దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి. అహానికి దూరంగా ఉండాలి. సమస్య ఉంటే వివరంగా మాట్లాడుకోవాలి...ఇలాంటి నియమాల్ని తూ.చ తప్పకుండా పాటిస్తున్నాం.
ఏ విషయంలోనైనా మా అభిప్రాయాలు దాదాపుగా కలుస్తాయి. ఇందుకు కాస్త గర్వంగా కూడా ఉంది. అప్పుడప్పుడు సర్దుబాటు చేసుకుంటే ఫరవాలేదుగానీ, సర్దుబాటు పేరుతో అదేపనిగా సంతోషానికి దూరం కావాల్సిన అవసరం లేదు. సొంత అభిప్రాయాలు వదులు కోవాల్సిన అవసరం లేదు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా... ఇద్దరూ సంతోషంగా ఉండడమే ముఖ్యం. ఈ ఎరుక మాలో ఉంది కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాం.
అనిల్‌ని మొదటి సారి కలిసినప్పుడు ‘నాకు తగిన భర్త ఇతనే’ అనిపించింది. నా నమ్మకం వమ్ము కాలేదు. సరైన టైమ్‌లో సరియైన వ్యక్తి నా భర్తగా రావాలనుకున్నాను. అనిల్ రూపంలో అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది.