
రవీనా టాండన్.. 90వ దశకంలో బాలీవుడ్‌లో స్టార్ హీయిన్‌గా రాణించిన వారిలో ఆమె ఒకరు. అప్పట్లో తెరపై ఈ పేరు కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయేవారు. తూ ఛీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ ‘మొహ్రా’ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆమె అందానికి బాలీవుడ్ ఫియా అయింది. వరుస సినిమాలతో అదరగొట్టేసింది. కానీ ఒకనొక దశలో ఆమెపై అహంకారి అనే ముద్రపడింది. దర్శక నిర్మాత మాట వినదనే అపవాదు ఆమెపై పడింది. ఫలితంగా కొన్ని సినిమాలు ఆమె చేతి నుంచి జారిపోయాయి.
తాజాగా ఈ విషయాలపై రవినా టాండన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు అంగీకరించకపోవడంతో తనపై అహంకారి అనే ముద్ర వేశారని చెప్పారు. ‘కొన్ని విషయాల్లో నేను అసౌకర్యంగా ఉండేదాన్ని. స్విమింగ్ డ్రెస్ ధరించడం నాకు నచ్చదు. అలాగే ముద్దు సన్నివేశాలు కూడా చేయలాని ఉండేది కాదు. సినిమా ఒప్పందానికి ముందే నేను ఈ కండీషన్ పెట్టేదాన్ని. అందుకే నాపై అహంకారి అనే ముద్ర వేశారు. సినిమా అవకాశాలు రాకపోయినా కూడా.. నేను అలాంటి సీన్స్ చేయలేదు.
రెండు రేప్ సీన్స్‌లో నటించినప్పటికీ.. ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ కూడా లేకుండా రేప్ సీన్స్‌లో నటించిన ఏకైక నటిని నేనే. అలాంటి సీన్స్ ఉన్నాయని చాలా సినిమాలు వదులుకున్నాను. ‘డర్’ సినిమా అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపించాయి. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించనని దర్శక,నిర్మాతలకు చెప్పేశా. ప్రేమ్ ఖైదీ చిత్రాన్ని కూడా అలానే వదిలేశా’అని రవినా టాండర్ చెప్పుకొచ్చారు. తెలుగులో బాలయ్య ‘బంగారు బుల్లోడు’, వినోద్‌కుమార్ ‘రథసారథి’, నాగార్జున ‘ఆకాశవీథిలో’ సినిమాలలో రవీనా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment