ఈ సోషల్ మీడియా ఉందే..: హీరోయిన్ | Raveena Tandon lauds power of social media | Sakshi
Sakshi News home page

ఈ సోషల్ మీడియా ఉందే..: హీరోయిన్

Jun 9 2016 7:11 PM | Updated on Oct 22 2018 6:02 PM

ఈ సోషల్ మీడియా ఉందే..: హీరోయిన్ - Sakshi

ఈ సోషల్ మీడియా ఉందే..: హీరోయిన్

గ్లామర్ ప్రపంచం చుట్టూ రూమర్లు, గాసిప్స్ ఉంటూనే ఉంటాయి. అందులోనూ సోషల్ మీడియా బాగా విస్తరించిన ప్రస్తుత కాలంలో అయితే అవి మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.

గ్లామర్ ప్రపంచం చుట్టూ రూమర్లు, గాసిప్స్ ఉంటూనే ఉంటాయి. అందులోనూ సోషల్ మీడియా బాగా విస్తరించిన ప్రస్తుత కాలంలో అయితే అవి మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే.. అదే సోషల్ మీడియా తమకు భలే ఉపయోగపడుతోందని అలనాటి హీరోయిన్, తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన రవీనా టాండన్ చెబుతోంది. ముఖ్యంగా గాసిప్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే ఖండించేందుకు సోషల్ మీడియా చాలా ఉపయోగంగా ఉందని తెలిపింది. సోషల్ మీడియా విషయంలో మంచి, చెడు రెండూ ఉంటాయని.. నాణేనికి రెండోవైపు ఏముందో చూపించడానికి ఇది చక్కటి సాధనమని ఆమె తన బ్లాగ్ పోస్టులో రాసింది.

ఇంతకుముందు అయితే తమమీద ఏవైనా తప్పుడు రాతలు వస్తే వాటిని ఖండించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఈలోపే ఆ తప్పుడు రాతలు బాగా ప్రచారం అయిపోయేవని.. ఇప్పుడైతే మరుక్షణంలోనే ఏ రకమైన వివరణ అయినా ఇచ్చుకోవచ్చని తెలిపింది. హృతిక్ రోషన్‌తో వచ్చిన వివాదం నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ తన వివరణ ఇచ్చిన విధానాన్ని కూడా రవీనా టాండన్ ప్రశంసించింది. వాళ్లిద్దరి విషయంలో తానేమంటానని కూడా చాలామంది ప్రశ్నించారని, అయితే తాను ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదానికి తాను జడ్జినేమీ కానని చెప్పింది. తాను ఎవరికీ అనుకూలంగా మాట్లాడబోనని ట్విట్టర్‌లో కూడా రవీనా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement