ఆ వీడియోపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరోయిన్‌ Raveena Tandon Files Rs 100 Crore Lawsuit That Video. Sakshi
Sakshi News home page

ఆ వీడియోపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరోయిన్‌

Published Sat, Jun 15 2024 12:38 PM

Raveena Tandon Files Rs 100 Crore Lawsuit That Video

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ , ఆమె డ్రైవర్‌పై కొందరు దాడి చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్వతంత్ర జర్నలిస్ట్‌ మొహ్సిన్ షేక్ అనే వ్యక్తికి పరువు నష్టం నోటీసులు పంపారు. ఇదే విషయాన్ని రవీనా తరపు న్యాయవాది సనా రయీస్ ఖాన్ తెలియజేశారు. ఇటీవల, రవీనాను తప్పుడు  ఫిర్యాదుతో ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆమె తెలిపింది.

కొద్దిరోజుల క్రితం రవీనా టాండన్‌కు సంబంధించిన వీడియో అంటూ షోషల్‌ మీడియాలో జర్నలిస్ట్‌ పేరుతో మొహ్సిన్ షేక్ షేర్ ‌చేశారు. ఆ వీడియోలో తమపై దాడి చేయకండి అంటూ ఒకరు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉంది. అందులో ఉన్నది రవీనా టాండన్‌ అని ఆయన పేర్కొనడంతో ఆ వీడియో  నెట్టింట చక్కర్లు కొట్టింది. మద్యం సేవించి డ్రైవర్‌తో పాటు ఆమె ప్రయాణిస్తుందని చెప్పాడు.  ర్యాష్‌ డ్రైవింగ్‌కు వారు పాల్పడటం వల్ల ఆ సమయంలో ముగ్గురు గాయాపడ్డారని, దీంతో వారి బంధువులు వచ్చి రవీనా టాండన్‌పై దాడి చేశారని తెలిపాడు. ఆ సమయంలో తమపై దాడి చేయకండి అంటూ ఆమె వేడుకున్నట్లు వీడియోలో ఉందని తెలిపాడు.  దీనిపై ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

అది తప్పుడు సమాచారం అని, రవీనా టాండన్‌ మద్యం తాగలేదని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదుదారు తప్పుడు కేసు పెట్టారని వారు తెలిపారు. రవీనా కారును పార్క్‌ చేసేందుకు డ్రైవర్‌ రివర్స్‌ చేస్తున్న సమయంలో ఓ కుటుంబం నడుచుకుంటూ వెళ్తోంది. కారు వారి దగ్గరకు వెళ్లడంతో డ్రైవర్‌తో వారు గొడవ పెట్టుకున్నారు. అది కాస్త పెద్దగా మారడంతో నటి అక్కడకు చేరకున్నారు. స్థానికుల నుంచి డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నంలో రవీనా కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమెపై కూడా వారు గొడవ పడ్డారు. ఆపై వారు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేశారు. కానీ దీనిని సోషల్‌ మీడియాలో రవీనాను కొట్టారని, మద్యం సేవించి కారు నడిపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అయిందని చెప్పారు.

రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం సేవించలేదని వారిపై తప్పుడు ఆరోపణలు చేశారని ముంబై పోలీసులు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తనపై తప్పుడు ప్రచారం చేసిన స్వతంత్ర జర్నలిస్ట్‌కు రూ. 100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. న్యాయవాది సనా ఖాన్ ద్వారా అతనికి నోటీసులు చేరవేశారు.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement