మధుర: ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ను బాలీవుడ్ నటి రవీనా టాండన్ స్వాగతించారు. ఆదివారం రాత్రి ఓ జ్యూయలరీ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రవీనా.. స్వచ్ఛ భారత్ కు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మోదీపై ప్రశంసలు కురిపించింది రవీనా. కాగా, ఈ మధ్యనే వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు అందరూ ఆసరాగా నిలవాలన్నారు.