నిర్మాత పెద్ద మనసు..5000 మందికి సాయం | Producer Adityaram Help To 5000 poor People | Sakshi
Sakshi News home page

నిర్మాత పెద్ద మనసు..5000 మందికి సాయం

Published Tue, Jan 21 2025 7:37 PM | Last Updated on Tue, Jan 21 2025 10:33 PM

Producer Adityaram Help To 5000 poor People

ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్‌  పెద్ద మనసు చాటుకున్నాడు. 5000 మందికి పైగా వారి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యావసరాలను అందించారు. వివరాల్లోకి వెళితే... 

పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమా నిర్మించి, టాలిీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అదిత్యరామ్. తర్వాత కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకే కాకుండా పలు రకాలైన బిజినెస్‌లలోకి ఎంటరై తమిళనాడులో స్థిరపడ్డారు. తమిళనాడులో ఆదిత్యారామ్‌ ప్యాలెస్‌ అంటే ఫుల్‌ ఫేమస్‌. ఆయన ప్యాలెస్‌ నుండి ఎంతోమంది అవసరార్ధులకు వారికి కావాలసిన సాయాన్ని అందిస్తుంటారు.

ఆదిత్యరామ్‌ అనగానే అమలాపురం అల్లునిగా ఒక తెలుగువాడుగా చెన్నైలో ఫుల్‌ ఫేమస్‌. ఈ ఏడాది సంక్రాంతి పండగకి ఆయన 5000 మందికి పైగా వారి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యావసరాలను అందించారు. ఆయనద్వారా సాయం పొందినవారు ఎందుకు బాబు ఇవన్నీ మా కోసం చేస్తున్నావని అడగ్గా ఆదిత్యారామ్‌ మాట్లాడుతూ–‘‘ నేను చాలా చిన్న స్థాయినుండి ఈ స్థాయివరకు వచ్చాను. అవసరాలు ఎలా ఉంటాయో అవి అవసరమైన వారికే తెలుస్తాయి. నాకు మీ అవసరాలు తెలుసు. అందుకే నాకు చేతనైన సాయం వీలైనంతమందికి చేస్తుంటాను. ఈ పండక్కి దాదాపు 5000 మందికి పైగానే నిత్యావసరాలను అందించే చేసే అవకాశం దక్కింది. ఇలానే మీ ఆశీస్సులు ఉంటే వీలైనంత ఎక్కువమందికి అవసరమైన వారందరికి సాయం చేయాలని నా మనస్సు ఎప్పుడూ కోరుకుంటుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement