‘‘గేమ్ చేంజర్’ చిత్రంలో నాపాత్ర పేరుపార్వతి. మా అమ్మ పేరు కూడాపార్వతి. శంకర్‌గారు ఈ చిత్ర కథ, నాపాత్ర గురించి చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకొచ్చారు. శంకర్‌గారు నా నటన చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. నా కెరీర్‌లో ‘గేమ్ చేంజర్’ సినిమా, నాపాత్ర చాలా ప్రత్యేకం’’ అని అంజలి చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంజలి విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ నేను నటించిన ‘గేమ్ చేంజర్’(తెలుగు), ‘మదగజరాజ’(తమిళ్) సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలవుతుండటంతో హ్యాపీగా ఉంది. ఈ రెండు చిత్రాలకు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. ‘గేమ్ చేంజర్’లో నేను చే సినపార్వతిపాత్ర ఆడియన్స్ కి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యారెక్టర్. ఈపాత్రతో నాకు జాతీయ అవార్డు వస్తుందని అంటున్నారు. కథ విన్నప్పుడు నాకూ అలానే అనిపించింది. అదే నిజమైతే అంతకంటే గొప్ప సక్సెస్ ఇంకేం ఉంటుంది.
⇒ఈ మూవీలో రామ్‌చరణ్ చేసిన అప్పన్న, నేను చేసినపార్వతిల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. చరణ్ సెట్స్‌లో అందరితోనూ బాగా మాట్లాడతారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్‌లో మూడో సినిమా, శంకర్‌గారి దర్శకత్వంలో తొలి సినిమా, రామ్ చరణ్‌గారితో మొదటి సినిమా.. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం నాకు ప్రత్యేకం. శంకర్, మణిరత్నంగార్ల చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. శంకర్‌గారి చిత్రంలో ఛాన్స్ రావడం నా అదృష్టం. ‘గేమ్ చేంజర్’ చూసిన చిరంజీవిగారు.. నాపాత్రను మెచ్చుకోవడమే పెద్ద అవార్డులా అనిపిస్తోంది. తమన్ సంగీతానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment