పవన్‌.. ఆ తల్లికి సమాధానం చెప్పే దమ్ముందా?: రోజా | YSRCP RK Roja Serious Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌.. ఆ తల్లికి సమాధానం చెప్పే దమ్ముందా?: రోజా

Published Tue, Jan 7 2025 4:00 PM | Last Updated on Tue, Jan 7 2025 5:44 PM

YSRCP RK Roja Serious Comments On Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్‌కు ఆమె హితవు పలికారు. ఈ సందర్బంగా తల్లి రోధిస్తున్న వీడియోను షేర్ చేశారు.

అభిమానుల మృతి పట్ల పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో రోజా ట్విట్టర్‌ వేదికగా..‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్‌ కల్యాణ్‌?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ మండిపడ్డారు.

ఇక, ఇటీవల నటుడు రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. దీంతో, మృతిచెందిన యువకుల తల్లి, కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను కోల్పోయి రోదిస​్తున్నారు.

ఈ ఘటనపై ట్విట్టర్‌ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు.

	డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ప మాజీ మంత్రి రోజా ఆగ్రహం

కానీ.. ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్‌ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్‌ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన తీరుపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement