గేమ్‌ ఛేంజర్‌ టికెట్‌ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ | Ram Charan Game Changer Movie Ticket Rates Hike Approved By AP Government, Check Price Details Inside | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌ టికెట్‌ రేట్ల పెంపునకు పచ్చజెండా.. బెనిఫిట్‌ షో టికెట్‌ ధర ఎంతంటే?

Published Sat, Jan 4 2025 6:48 PM | Last Updated on Sat, Jan 4 2025 7:38 PM

Ram Charan Game Changer Ticket Rate Hike Approved by AP Government

మెగా హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) గేమ్‌ ఛేంజర్‌ సినిమా టికెట్‌ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్‌ షోకు అనుమతిచ్చింది. బెనిఫిట్‌ షో టికెట్‌ ధర రూ.600గా నిర్ణయించింది.

జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలు
మొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది. ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర రూ.135 పెంచగా.. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ.175 పెంచుకునేందుకు అంగీకరిచింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమా..
గేమ్‌ ఛేంజర్‌ సినిమా (Game Changer Movie) విషయానికి వస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. అంజలి ముఖ్య పాత్ర పోషించింది. తమన్‌ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement