ticket rates hike
-
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది.జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలుమొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది. ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.135 పెంచగా.. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ.175 పెంచుకునేందుకు అంగీకరిచింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.సినిమా..గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. అంజలి ముఖ్య పాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?
సినిమాకు వెళితే పిల్లలు, తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు, తెలిసినవారు, బంధువులు.. ఇలా చాలామందిని గమనించవచ్చు. నిత్యం ఏదో పనుల్లో బిజీగా ఉండేవారికి సినిమాలు ఆటవిడుపుగా మారి వినోదాన్ని అందిస్తుంటాయి. కొన్నేళ్ల కొందట సినిమా నిర్మించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే తరహాలో రాబడి ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. చిత్ర నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఫక్తు వినోదాన్ని అందించాల్సిన సినీ పరిశ్రమలో క్రమంగా వ్యాపార ధోరణి పేరుకుపోతుంది. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్వెల్లో ప్రేక్షకులు పాప్‌కార్న్ కొనుగోలు చేసేంత వరకు వివిధ స్థాయుల్లో వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు: సినిమా ప్రారంభానికి ముందు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులుంటాయి. ఇందులో స్క్రిప్ట్ డెవలప్ మెంట్, లొకేషన్ సెలక్షన్.. వంటి వాటికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది.ప్రొడక్షన్ ఖర్చులు: ఈ ఖర్చు చాలా కీలకం. నటీనటులు, సిబ్బంది జీతాలు, పరికరాల అద్దె, సెట్ నిర్మాణం, దుస్తులు, ప్రత్యేక ఖర్చులు దీని కిందకు వస్తాయి.పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు: ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లైసెన్సింగ్ వంటి వాటి కోసం కొంతక ఖర్చు చేయాల్సి ఉంటుంది.మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్: సినిమాను ప్రమోట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం దీని కిందకు వస్తాయి.సౌకర్యాలకు పెద్దపీటగతంలో వీటన్నింటికి తక్కువగానే ఖర్చు అయ్యేది. ఇటీవల కాలంలో వీటి వ్యయం రూ.కోట్లల్లోనే ఉంది. కొన్నేళ్ల కిందట టౌన్‌లోని చిన్న థియేటర్లో ఫ్యాన్ సౌండ్‌ను భరిస్తూ సినిమా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏసీ థియేటర్, ప్రీమియం సీటింగ్, లగ్జరీ సౌకర్యాలతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా మౌలిక సదుపాయాలను అప్డేట్ చేస్తున్నాయి. ఆ ఆర్థిక భారాన్ని తుదకు ప్రేక్షకులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.పాన్ ఇండియా మార్కుఒకప్పుడు స్థానిక భాషలో సినిమా నిర్మించి అదే రాష్ట్రంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా ‘పాన్ ఇండియా’ మార్కుతో విభిన్న భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అక్కడి భాషల్లో విడుదల చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఫలితంగా సినిమా కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో టికెట్ రేట్లు పెంచుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!లిస్టెడ్ కంపెనీల జోరుపీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీలు దేశవ్యాప్తంగా చాలా మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నాయి. సినిమా టికెట్ కాస్ట్ కంటే యాడ్ఆన్ సర్వీసులుగా ఉండే స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, వాటర్ బాటిల్.. వంటివి విక్రయించడంతోనే అధిక మార్జిన్లు సంపాదిస్తాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తే అదనంగా ఆదాయం సమకూరినట్లే. థియేటర్లలో విభిన్న కంపెనీలు యాడ్లు ఇస్తుంటాయి. దానివల్ల ఆదాయం సమకూరుతుంది. మల్టిప్లెక్స్‌లు ప్రైవేట్ ఈవెంట్లకు స్కీన్లను రెంట్‌కు ఇస్తూంటాయి. అది కూడా ఒక ఆదాయ వనరుగా ఉంది. -
టికెట్ల ధర పెంచాలని కోరిన భోళా శంకర్ నిర్మాతలు
-
ఆర్ఆర్ఆర్ రిలీజ్.. వసూళ్ల జాతరకు టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డెరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓ జీవో విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం.. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
టికెట్ రేట్ల పెంపుతో చిన్న సినిమాలకు అన్యాయం: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రముఖ దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ల రేట్లు అధికంగా పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చిన్న నిర్మాతలను నిరాశ పరిచింది. చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక షోకి అనుమతివ్వాలని కోరుతున్నా ఆ ఊసే లేదు. మల్టీప్లెక్స్‌లలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 ప్రకారం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం కేటాయించి, టికెట్ల రేట్లను పేదవాడి కోసం కనిష్టంగా రూ.50గా నిర్ణయించాలి. కానీ అలాంటి నిబంధనలు జీవోలో లేనే లేవు. తెలంగాణలోని థియేటర్లు ఏషియన్ సునీల్, ‘దిల్’రాజు చేతుల్లోనే ఉన్నాయి. టికెట్ ధరల పెంపుతో వాళ్లిద్దరికి మాత్రమే మేలు జరుగుతోంది. చిన్న సినిమాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా’అని నట్టి కుమార్ తెలిపారు. చదవండి: ఈసారి లవర్స్ డేను ముందుగా సెలబ్రేట్ చేసుకుంటారు: తమన్ చదవండి: Manchu Lakshmi: దానికోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్న మంచు లక్ష్మి -
సాహో అ'ధర'హో!
సాక్షి, హైదరాబాద్: మొన్న మహర్షి నేడు సాహో.. టికెట్ల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న సాహో సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాకు సగానికిపైగా థియేటర్లు రేట్లు పెంచడం వినోద ప్రియులను కలవరపెడుతోంది. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే ‘బుక్ మై షో’వెబ్సైట్లో ఈ మేరకు పెంచిన ధరలు దర్శనమిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా ఈ పెంచిన ధరలతోనే బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలవనుంది. తరువాత శని, ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం వినాయక చవితి కావడంతో సినిమా బుకింగ్‌లు అమాంతం పెరిగాయి. రూ.10 నుంచి రూ.150 అధికంగా.. సాధారణంగా నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.80, ఏసీ థియేటర్లలో రూ.125గా ఉంటుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా థియేటర్లు ఇవే ధరల్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని మాత్రం అస్సలు పాటించడం లేదు. మొదటివారం వీలైనంత వసూలు చేసుకోవాలన్న ఆలోచనతో టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ వ్యత్యాసం అధికంగా ఉంటోంది. వాస్తవానికి జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్‌లో టికెట్ల ధర రూ.138 వద్ద మొదలై గరిష్టంగా రూ.150 వరకు ఉంది. కానీ, సాహో సినిమాకు ఈ వ్యత్యాసం మరీ పెరిగిపోయింది. కొన్ని రూ.175, ఇంకొన్ని రూ.230కి చేరింది. ఇక ఓ ప్రముఖ థియేటర్లో అయితే సోఫా టికెట్ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200గా ఉంది. అయినా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమ నార్హం. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఇవే థియేటర్లు వసూలు చేస్తోన్న మొత్తంలో సాహో సినిమాకు వసూలు చేస్తో న్న మొత్తంలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.150కి వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. సామాన్యులకు అందుబాటులో ఉండే సెకండ్ క్లాస్ టికెట్ ధరలను సైతం భారీగా పెంచారు. చాలా థియేటర్లలో సెకండ్ క్లాస్ కనిపించకుండా పోతోంది. ఏపీ హైకోర్టుకు వివాదం.. సాహో సినిమాకు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు. తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది. కాగా, మహర్షి సినిమా విడుదల సమయంలోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు తమకు తామే టికెట్ల రేటు పెంచాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కానీ, రెండు మూడు రోజుల అనంతరం థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్లు తగ్గించడంతో వివాదం సద్దుమణిగింది. -
సినిమా టికెట్ వార్
టికెట్ల రేట్ల పెంపు విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయి. ధరలు పెంచే ముందు తమను సంప్రదించడంగానీ, అనుమతిగానీ తీసుకోలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. నగరంలో ఇప్పటివరకూ 79 థియేటర్లు టికెట్ల ధరలు పెంచినట్లు మా దృష్టికి వచ్చింది.– మంత్రి తలసాని కోర్టు ఉత్తర్వుల మేరకు ధరలు పెంచాం. గురువారం ఉదయం నుంచి పలు థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.25 నుంచి రూ.50 వరకు పెంపు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. పెంచిన టికెట్ల ధరలు ఏపీలోనూ వర్తింపజేస్తాం. అయితే ఈ పెంపు 2 వారాలు మాత్రమే. – నిర్మాతల మండలి వేసవిలో పిల్లాపాపలతో సినిమాలకు వెళదామనుకుంటే.. ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ.70 పెంచడం సరికాదు. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నాం.. ఇపుడు టికెట్ల ధరలు కూడా పెంచితే సినిమాకు వెళ్లే పరిస్థితే ఉండదు. – సామాన్యుడి గగ్గోలు సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరల పెంపు థియేటర్ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య ‘టికెట్ వార్’కు తెరతీసింది. ప్రభుత్వం అనుమతితోనే టికెట్ల ధరలు పెంచామని థియేటర్ యాజమాన్యాలు చెబుతుంటే.. తమనెవరూ సంప్రదించలేదని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని స్పష్టం చేశారు. యాజమాన్యాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ధరలు పెంచాయన్నారు. థియేటర్ యాజమాన్యాలపై కోర్టుకెళ్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పడంతో ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాల మధ్య వివాదం తీవ్రతరం కానుంది. అన్ని అనుమతులు ఉన్నాయి కోర్టు ఉత్తర్వుల మేరకు ధరలు పెంచామని థియేటర్లు, మల్టీపెక్స్‌ల నిర్వాహకులు బుధవారం సాయంత్రం ప్రకటించారు. గురువారం ఉదయం నుండి పలు థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.25 నుండి 50 రూపాయల వరకు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సింగిల్ థియేటర్ యజమానులు మూడ్రోజుల క్రితమే పెంచిన ధరలను గురువారం నుండి అమలు చేస్తామని ప్రకటించగా, మల్టీపెక్స్‌ల నిర్వాహకులు మాత్రం ఆన్లైన్ టికెట్ల ధరలను బుధవారం సాయంత్రం వరకు ఆయా వెబ్సైట్లలో అందుబాటులో ఉంచలేదు. చివరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రతి టికెట్‌పై రూ.50 పెంచుతూ టికెట్లను ఆన్లైన్లో విక్రయించారు. అయితే కోర్టు ఉత్తర్వులపై సవాల్ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టకపోవటంతో పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. తాము కోర్టును ఆశ్రయించే టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి తీసుకున్నామని నిర్మాతల మండలి ప్రతినిధి దిల్ రాజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పెంచిన టికెట్ల ధరలు ఏపీలోనూ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. అందుకే తాము సింగిల్ థియేటర్లలో టికెట్ ధర రూ.80 నుంచి 110, మల్లీప్లెక్స్‌లో రూ.130 నుంచి 200 వరకు పెంచామని యజమానులంటున్నారు. ఈ పెంపు 2వారాలు మాత్రమేనన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలోని ఓ సింగిల్ థియేటర్లో సినిమా చూడాలంటే రూ.30 కనీస టికెట్ ధరగా ఉండగా.. సెకండ్ క్లాస్‌లో రూ.60 ఉన్న ధరను రూ.80, బాల్కనీ అయితే రూ.100 నుండి 125కి పెంచేశారు. అదే మల్టీపెక్స్ విషయానికి వస్తే ఖైరతాబాద్‌లోని ఐమాక్స్‌లో స్మాల్ స్క్రీన్ టికెట్ ధర రూ.138 నుండి రూ.200, బిగ్‌స్క్రీన్ అయితే రూ.250 నుండి రూ.300లకు పెంచి విక్రయించారు. సీఎస్, అధికారులతో మంత్రి సమీక్ష టికెట్ల పెంపు వ్యవహారంపై తమ దృష్టికి రాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారమే వెల్లడించారు. కాగా, టికెట్ల పెంపు అంశం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశం కావడంతోబుధవారం మంత్రి ఈ వివాదంపై సమీక్ష నిర్వహించారు. సీఎస్, అధికారులతో కలిసి ఈ విషయంపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల రేట్లు పెంపు విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయని అన్నారు. ధరలు పెంచేముందు తమను సంప్రదించడంగానీ, అనుమతిగానీ తీసుకోలేదని అసలు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మంత్రి స్పష్టంచేశారు. నగరంలో ఇప్పటివరకూ 79 థియేటర్లు టికెట్ల ధరలు పెంచినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తలసాని వెల్లడించారు. ప్రజలపై భారం పడేలా టికెట్ల ధరలు పెంచడం సరికాదన్నారు. ఇందుకు తామెలాంటి అనుమతి ఇవ్వలేదని పునరుద్ఘాటించారు. సామాన్యుడికి కూడా వినోదం కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో తాము హోంశాఖ, న్యాయశాఖలతోనూ సంప్రదింపులు జరిపామన్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే తాము కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. సామాన్యుల గగ్గోలు టికెట్ల ధరల పెంపు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. వేసవి సెలవులు కాబట్టి, పిల్లాపాపలతో సినిమాలకు వెళ్లి సరదాగా గడుపుతామని అనుకుంటే.. ఒక్కో టికెట్‌పై ఏకంగా 70 రూపాయలు పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నాం.. ఇపుడు టికెట్ల ధరలు కూడా పెంచితే.. సినిమాకు వెళ్లే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. ఇపుడున్న ధరలతో నలుగురు సభ్యులున్న కుటుంబం మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళితే.. టికెట్లకు రూ.800పోగా, ఇంటర్వెల్లో తినుబండారాలకు రూ.300 నుంచి రూ.400 వరకు వాచిపోవడం ఖాయం. మొత్తంగా ఈ ఖర్చు రూ.1200 వరకు చేరుతోంది. -
సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం పెంచలేదు
-
పైసా వసూల్
వినోదం కోసం వెళ్లిన వారికి థియేటర్ల యజమానులు అధిక ధరలతో సినిమా చూపిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఐదు థియేటర్లు ఉండగా, అందులో పార్కింగ్ పేరిట ప్రేక్షకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని థియేటర్లలోనైతే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యే క స్థలం లేదు. సినిమాలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెంచే హక్కులు ప్రభుత్వం యా జమాన్యాలకు ఇచ్చింది. అయినప్పటికీ టికెట్ల ధరలు పెంచడంతో పాటు పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. పార్కింగ్ చేసిన వాహనాలు విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. ప్రత్యేకంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30ల, ఆటోలకు, ద్విచక్రవాహనాలకు రూ.20, సైకిళ్లకు రూ.10లు వసూలు చేస్తూ సినిమాకు వచ్చిన వారి జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సినిమాకు వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న రశీదు ఇలా ఒక్క థియేటర్లో ఒక షోకు సుమారు 100 వరకు వాహనాలు వస్తుండగా వాటికి రూ. 1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు అవుతున్నాయి. ఇలా ఒక రోజులో నాలుగు షోలకు రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో థియేటర్లు 5 ఒక థియేటర్లో ఉండే సీట్లు 400-500 ఒక షోకు పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనాలు 100 పార్కింగ్ చేసే ఆటోలు 10 పార్కింగ్ చేసే ఆటోలు 10 ఉన్నత వర్గాల వారు వచ్చే కార్లు 5 అన్నీ అసౌకర్యలే.. సినిమా థియేటర్‌కు వచ్చిన వారిని అసౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. థియేటర్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సినిమాకు వచ్చిన వందలాది మందికి సరిపోక, శుభ్రంగా లేకపోవటంతో సినిమాకు వచ్చిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. విరామ సమయంలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ కొనుగోలు చేసేవారు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట లభించే ధరల కంటే రూ.5 నుంచి రూ.10ల వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు దగాకు గురికావాల్సి వస్తోంది. పేరున్న హీరో సినిమా వస్తే సినిమా యాజమాన్యం ఏకంగా టికెట్ ధరలు పెంచేస్తోంది. ఇప్పటకైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. -
ఈ థియేటర్లకు ఏమైంది?
మధురవాడ ప్రాంతానికి చెందిన రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సీఎంఆర్ సెంట్రల్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు సభ్యులకు రూ.150 చొప్పున ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాడు. ట్యాక్స్‌తో కలిపి రూ. 687 అయింది. విరామ సమయంలో బయటకు పిల్లలను తీసుకుని వచ్చి రెండు పాప్‌కార్న్‌లు, రెండు కూల్ డ్రింక్‌లు ఇవ్వమన్నాడు. వాస్తవానికి వాటి ధర రూ.200కు మించి ఉండదని రాజేష్ ఊహించాడు. కానీ రూ.900 బిల్లు వేసి అతని చేతిలో వాటిని పెట్టారు. ఒక్కసారిగా కంగుతిన్న రాజేష్ పిల్లలను బాధపెట్టలేక ఆ సమయానికి డబ్బులు చెల్లించేశాడు. ఇది ఆయన ఒక్కడికే కాదు.. మల్టీప్లెక్స్ థియేటర్లకు వినోదం కోసం వెళుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎదురవుతున్న అనుభవం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తనకు వచ్చే జీతంలో 15 శాతం ఒక్క సినిమాకు ఖర్చు అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. జగదాంబ ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్‌కు లక్ష్మణ్ తన భార్యతో సినిమాకు వెళ్లాడు. సినిమా టికెట్ రూ.118( ఇద్దరి రూ.236), బైక్ పార్కింగ్ రూ.20, కూల్ డ్రింక్రూ.60 (ఇద్దరికి రూ.120), సమోసాలు రూ.30 (నాలుగు), పాప్‌కార్న్ రూ.30 (ఇద్దరికి రూ.60) ఖర్చు అయింది. రూ. 500 నోటుతో వెళ్లిన ఆయనకు తిరిగి వచ్చేటప్పుడు కాస్తా చిల్లర మిగిలింది. సినిమా పూర్తయ్యేలోగా ఆయనకు సినిమా కనిపించింది. సినిమా ప్రేక్షకుడి ప్రస్తుత పరిస్థితిని సంఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి. టికెట్ల ధరలతో పాటు తినుబండారాల విషయంలో ప్రేక్షకుడు నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. పైగా జీఎస్టీ బాధుడు. ఎమ్మార్పీకే తినుబండారాలు విక్రయించాలన్న అధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అలసిన మనసుకు సాంత్వన చేకూర్చేది వినోదం. అందులోనూ ప్రతి ఒక్కరినీ రంజింపజేసే మాధ్యమం సినిమా. అలాంటి సినీ వినోదం మరింత ఖరీదైపోయింది. సింగిల్ థియేటర్ల స్థానాన్ని మల్టీప్లెక్స్‌లు ఆక్రమిస్తున్న తరుణంలో సగటు ప్రేక్షకుడిని దోపిడీ చేయడమనేది సర్వసాధారణమైపోయింది. పార్కింగ్ కష్టాలు మొదలుకొని, టికెట్ ధరలు, ఫుడ్ అండ్ బేవరేజెస్ వరకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమాకు సొంత కారులో వెళ్లిరావాలంటేనే రూ.2వేల వరకు ఖర్చవుతున్నాయి. అందులో టికెట్లకు రూ.600 అయితే, మిగిలినదంతా ఫుడ్ అండ్ బేవరేజెస్కే! అలాగని ఇంటి నుంచి బిస్కెట్ ప్యాకెట్టో, వాటర్ బాటిలో తీసుకువెళ్దామంటే థియేటర్ డోర్ దగ్గరే ఆపేస్తున్నారు. దాంతో రెండున్నర గంటల వినోదానికి వేలల్లో వదిలించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తూ ముంబై హైకోర్టు మల్టీప్లెక్స్‌ల్లోకి స్నాక్స్ తీసుకువెళ్లేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. మార్గదర్శకాలు రూపొందించాలని సూచించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి మల్టీప్లెక్స్‌ల్లో బయట ఫుడ్ అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని థియేటర్లలో బయట ఫుడ్ అనుమతించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. నగరంలోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా చిప్స్ ప్యాకెట్లను రూ.10 నుంచి విక్రయిస్తున్నారు. ఇవి బయట మార్కెట్లో కనిపించవు. వాటి నాణ్యతను బట్టి చూస్తే రూ.5 కూడా ఎక్కువే. నాణ్యత లేని తినుబండారాలను నచ్చిన ధరకు అమ్ముతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. సీఎంఆర్ లాంటి అతి పెద్ద మాల్లో మనకు నచ్చిన పాప్‌కార్న్ ప్లేవర్ రూ.25 మాత్రమే. కానీ సినిమా థియేటర్లలో రూ.30(మల్టీప్లెక్స్‌లో రూ.60 నుంచి). నగరంలో ఎక్కడ తీసుకున్న సమోసా ధర రూ.5 నుంచి రూ.7. మల్టీప్లెక్స్‌లో మాత్రం వీటి ధర ఒక్కొక్కటి రూ.50. ఎగ్ పఫ్ ప్రముఖ ఫుడ్ జోన్ల్లో రూ.15 దాటదు. కానీ సినిమా థియేటర్లలో రూ. 30. కేఎఫ్సీలో రూ.80లకు మీడియం సైజ్ కూల్ డ్రింక్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది. కానీ థియేటర్లలో కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ రూ.60కు అమ్ముతున్నారు. స్వీట్ కార్న్ నగరంలోని ఎక్కడైనా రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. కాని సినిమా థియేటర్లలో మాత్రం రూ.50. మిగతా తినుబండారాలు కూడా ఇలానే విక్రయిస్తున్నారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ మీదే అధికాదాయం ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు మల్టీప్లెక్స్‌లు, థియేటర్లకు పెనుభారంగా పరిణమించే అవకాశముందన్నది మల్టీప్లెక్స్ మేనేజర్ల మాట. మల్టీప్లెక్స్‌ల ఆదాయంలో 30 శాతం ఫుడ్ అండ్ బేవరేజెస్ అమ్మకాల ద్వారానే లభిస్తోంది. ఈ కారణం వల్లే ఆదాయం మరింత పెంచుకోవడానికి లైవ్ కిచెన్ కౌంటర్లు, ఎఫ్ అండ్ బీ మెనూ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నాయి. ఫిక్కీ–కేపీఎంజీ 2017లో విడుదల చేసిన అధ్యయనంలోనూ ఎఫ్ అండ్ బీ ఆదాయం ద్వారానే మల్టీప్లెక్స్‌లు తమ ఆదాయం స్థిరంగా వృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడించింది. కోర్టు తీర్పు ఇచ్చినా మారని యాజమన్యాలు సినిమా థియేటర్లలో ప్రత్యేక ప్యాకేజీల ధరలతో తినుబండారాలను గతంలో విక్రయించేవారు. దీనిపై వినియోగదారుల కోర్టు గతేడాది నవంబర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 జనవరి నుంచి అన్ని థియేటర్లలో సాధారణ ధరలకే తినుబండారాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్ని థియేటర్ల యాజమాన్యాలను పిలిచి సాధారణ ధరలకే తినుబండారాలు విక్రయించాలని సూచించారు. మొదట్లో వాటర్ బాటిల్ మాత్రమే ఎమ్మార్పీకి విక్రయించారు. తర్వాత కోర్టు, కలెక్టర్ ఆదేశాలకు తమకు వర్తించవు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాగా..వాణిజ్య సంస్థల్లో, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కోర్టు చెప్పినా.. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం విచ్చలవిడిగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తారటా.. ప్రేక్షకుల నుంచి థియేటర్ల యాజమాన్యాలు అడ్డంగా దోచుకుంటున్నా.. తమకు ఏం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులు. సినిమా థియేటర్లపై నియంత్రణకు కలెక్టరేట్లో సీ సెక్షన్ ఉంది. వారు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేస్తుండాలి. యాజమాన్యాలు తమ కార్యాలయాలకు పిలిపించుకుని మాట్లాడటం తప్పితే.. ఇటీవల కాలంలో థియేటర్లను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. థియేటర్లలో జరుగుతున్న ధరల దోపిడీపై వివరణ అడిగితే.. వారు చెప్పే సమాధానం ‘మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు’. ఫిర్యాదు చేస్తే అప్పుడు తనిఖీలు చేస్తాం అంటూ సెలవిస్తున్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సినిమా హాళ్లకు వెళ్లి తినుబండరాలను కొనేవారికి కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఉందని అందరికీ తెలిసినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇంత ధరలతో వినోదమా.. వినోదాన్ని ఎవరు కోరుకోరు. కానీ మరి ఇంత మూల్యానికా.. ధరలు పెంచడం వలనే పైరసీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. సరసమైన ధరలు ఉంటే ప్రతీ ఒక్కరూ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్లు, తినుబండారాల ధరలు పెరిగితే సామాన్యుడు థియేటర్ల వైపు చూడడు. –దినేష్, ప్రేక్షకుడు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం ఏ సినిమా థియేటర్లలో అయినా అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నట్టు 1100, 18004250082, 18004252977 నంబర్లకు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం. నిజంగానే అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడప్పుడు తూనికలు– కొలతల అధి కారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. – ఆర్.నరసింహమూర్తి, సి–సెక్షన్ సూపరింటెండెంట్ చుక్కలు చూపిస్తున్నారు సరదాగా సినిమా కోసం వస్తే ప్రత్యేక ధరలంటూ చుక్కలు చూపిస్తున్నారు. కుటుంబంతో కలసి సినిమాకు రావాలంటే భయం వేస్తుంది. మా నుంచి యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకుంటున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అధికారులు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేయాలి. –కల్యాణ్,ప్రేక్షకుడు థియేటర్లను తనిఖీ చేయాలి సినిమా థియేటర్లలో లభించే ఆహార పదార్థాలు తినాలంటే భయం వేస్తుంది. ఒక వైపు అధికంగా ధరలు ఉంటే మరో వైపు ఎలాంటి నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారు. కొన్ని చిప్స్ ప్యాకెట్ల థియేటర్లలో తప్పితే.. ఎక్కడా లభించవు. వాటిని తినడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లను తనిఖీ చేయాలి. –కిశోర్ వర్మ, ప్రేక్షకుడు -
మెట్రోలో రేట్ల దెబ్బకు 3 లక్షల మంది తగ్గారు!
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ మెట్రో టికెట్ రేట్లు పెంచడంతో అందులో రోజూ ప్రయాణించేవారిలో 3 లక్షల మంది(11 శాతం) తగ్గిపోయారు. మెట్రోలో సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 27.4 లక్షల మంది ప్రయాణించగా.. ఈ సంఖ్య అక్టోబర్‌లో 24.2 లక్షలకు పడిపోయింది. ఈ మేరకు ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) జవాబిచ్చింది. -
ప్రయాణికులపై ప్రై‘వేటు’!
రవాణా పన్ను సాకుతో చార్జీలు పెంచిన ట్రావెల్స్ నాన్ ఏసీల్లో రూ.50, ఏసీ బస్సుల్లో రూ. 100 పెంపు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చార్జీల మోత మోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన అంతర్రాష్ట్ర పన్నును సాకుగా చూపుతూ.. ఏకంగా ఒక్కో సీటుపై రూ.50 నుంచి రూ.100 వరకు పెంచేశారు. సర్కారుకు చెల్లించే త్రైమాసిక పన్నుకు రెండింతల సొమ్మును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు ఒక సీటుకు రూ.2,625 చొప్పున 40 సీట్ల (సగటున) బస్సుకు సంబంధించి.. ప్రతి మూడు నెలలకోసారి రూ.లక్షా 10 వేల వరకు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక సీటుకు రూ.50 చొప్పున చార్జీ పెంచడంతో నాన్ఏసీ బస్సుల్లో మూడు నెలలకు సుమారు రూ.లక్షా 80 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏసీ బస్సుల్లో ఒక సీటుకు రూ.వంద చొప్పున పెంచడంతో అదనంగా రూ.3.60 లక్షలు వస్తాయి. మొత్తంగా పన్ను పేరిట అటు ప్రభుత్వం, ఇటు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటుండగా... సాధారణ ప్రయాణికులు మాత్రం బలవుతున్నారు. తెలంగాణ నుంచి ఏపీలోని సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారిపై సగటున రూ.300 నుంచి రూ.500 వరకు అదనపు భారం పడుతోంది. పన్ను విధింపునకు వ్యతిరేకంగా గగ్గోలు పెట్టిన ఆపరేటర్లు ఇప్పుడు మౌనంగా ఉండిపోవడమే.. వారికి వస్తున్న లాభాలకు నిదర్శనం. సగటు ప్రయాణికుడిపైనే.. రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజ మండ్రి, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రతి రోజూ 650 నుంచి 700 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు లు, రైళ్లకు దీటుగా ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్నగ ర్, అమీర్‌పేట్, లకిడీకాపూల్, కాచిగూడ తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటు బస్సులు బయలుదేరుతాయి. రాష్ట్రస్థాయి కాంట్రాక్టు క్యారేజీలుగా గుర్తింపు పొందిన ఈ బస్సులు ఇటీవలి వరకు ఉమ్మడి రాష్ట్ర లెక్కల ప్రకారం ప్రతి సీటుకు రూ.2,625 చొప్పున చెల్లించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర పన్ను విధిం చడం, ఈ పన్ను మొత్తాన్ని తుది తీర్పు వెలువడే వరకు ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ నుంచి రాకపోకలు సాగించే బస్సులు ఏపీతో పాటు, తెలంగాణలోనూ త్రైమాసిక పన్ను చెల్లిం చాల్సి వస్తోంది. ఈ భారం అంతిమంగా ప్రయాణికులపైనే పడుతోంది. చార్జీల పెంపు ప్రభావం ఇలా.. మూడు నెలలకోసారి ఆపరేటర్లు చెల్లించే పన్ను రూ.1,10,000 ఒక సీటుకు చార్జీని రూ.50 చొప్పున పెంచడం వల్ల జమయ్యే మొత్తం నెలకు రూ.60,000 (ఒక నెలలో 15 ట్రిప్పులు) ఇలా నాన్ ఏసీ బస్సుల్లో వచ్చే మొత్తం మూడు నెలలకు రూ.1.80 లక్షలు ఏసీ బస్సుల్లో మూడు నెలలకు వచ్చే సొమ్ము రూ.3.60 లక్షల వరకు పెరుగుతుంది వేసవి సెలవుల్లో మరింత భారం రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు పరీక్షలు ముగించి సెలవులు ప్రకటించాయి. మరికొన్ని తరగతులకు పరీక్షలు జరుగుతున్నాయి. మే తొలివారం నాటికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ర ద్దీ బాగా పెరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే 80కి పైగా రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. అరకొరగా ఏర్పాటు చేసే అదనపు రైళ్లు ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. మరోవైపు సాధారణ రోజుల్లో ఆయా మార్గాల్లో 1,500 బస్సులు నడిపే ఆర్టీసీ కూడా... వేసవి రద్దీకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలను రూపొందించలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.50 నుంచి రూ.100 వరకు చార్జీలు పెంచిన ఆపరేటర్లు.. వేసవి రద్దీ సమయంలో మరింత భారం మోపే అవకాశం ఉంది.