తినుబండారాల ధరల పట్టిక
వినోదం కోసం వెళ్లిన వారికి థియేటర్ల యజమానులు అధిక ధరలతో సినిమా చూపిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు.
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఐదు థియేటర్లు ఉండగా, అందులో పార్కింగ్ పేరిట ప్రేక్షకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని థియేటర్లలోనైతే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యే క స్థలం లేదు. సినిమాలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెంచే హక్కులు ప్రభుత్వం యా జమాన్యాలకు ఇచ్చింది. అయినప్పటికీ టికెట్ల ధరలు పెంచడంతో పాటు పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు.
పార్కింగ్ చేసిన వాహనాలు
విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. ప్రత్యేకంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30ల, ఆటోలకు, ద్విచక్రవాహనాలకు రూ.20, సైకిళ్లకు రూ.10లు వసూలు చేస్తూ సినిమాకు వచ్చిన వారి జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సినిమాకు వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న రశీదు
ఇలా ఒక్క థియేటర్‌లో ఒక షోకు సుమారు 100 వరకు వాహనాలు వస్తుండగా వాటికి రూ. 1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు అవుతున్నాయి. ఇలా ఒక రోజులో నాలుగు షోలకు రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలవుతున్నాయి.
జిల్లా కేంద్రంలో థియేటర్లు | 5 |
ఒక థియేటర్‌లో ఉండే సీట్లు | 400-500 |
ఒక షోకు పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనాలు | 100 |
పార్కింగ్ చేసే ఆటోలు | 10 |
పార్కింగ్ చేసే ఆటోలు | 10 |
ఉన్నత వర్గాల వారు వచ్చే కార్లు | 5 |
అన్నీ అసౌకర్యలే..
సినిమా థియేటర్‌కు వచ్చిన వారిని అసౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. థియేటర్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సినిమాకు వచ్చిన వందలాది మందికి సరిపోక, శుభ్రంగా లేకపోవటంతో సినిమాకు వచ్చిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. విరామ సమయంలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ కొనుగోలు చేసేవారు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బయట లభించే ధరల కంటే రూ.5 నుంచి రూ.10ల వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు దగాకు గురికావాల్సి వస్తోంది. పేరున్న హీరో సినిమా వస్తే సినిమా యాజమాన్యం ఏకంగా టికెట్ ధరలు పెంచేస్తోంది. ఇప్పటకైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment