No facilities
-
Telangana Police: వర్రీలో వారియర్స్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఆస్పత్రి, వాక్సినేషన్ సెంటర్, కరోనా మృతుల మార్చురీ, కర్ఫ్యూ చెక్‌పోస్టు, మాస్కుల ధారణపై చెకింగ్స్.. ఇలా ఎక్కడ చూసినా కనిపించే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు. అయితే వీరికి అవసరమైన ‘భద్రత’ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫస్ట్ వేవ్‌లో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది అశువులు బాశారు. సెకండ్ వేవ్‌లోనూ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో ఈ వారియర్స్‌తో పాటు వారి కుటుంబాల నుంచీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీసు విభాగంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా.. దాదాపు 15 మంది వరకు ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. ► మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడండి అంటూ గడిచిన కొన్ని రోజులుగా వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్మీడియాల వేదికగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. తమ సిబ్బంది విషయంలో మాత్రం ఆ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ► సెకండ్ వేవ్ పంజా విసరడం మొదలెట్టి నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ పోలీసుస్టేషన్లలోని అధికారుల మాట అటుంచితే బందోబస్తు, రిసెప్షన్ సిబ్బందికి మాస్‌్కలు, శానిటైజర్ల సరఫరా జరగలేదు. ఇక పీపీఈ కిట్స్ అనే ఆలోచనే వాస్తవదూరంగా అయిపోయింది. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ సంస్థలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి అమలు చేస్తున్నాయి.పోలీసు విభాగానికి మాత్రం ఇలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ► పోలీసు అధికారులు నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి పనిచేయాల్సి ఉంటోంది. ఉన్నతాధికారులైన డీసీపీలు, ఏసీపీలకు తక్కువైనా ఇన్స్పెక్టర్, ఎస్సైలు, రిసెప్షన్స్‌లో సిబ్బందికి తాకిడి ఎక్కువ. ► కోవిడ్ బారినపడిన పోలీసుల కోసం పేట్ల బురుజులో రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటైన కరోనా పరీక్ష కేంద్రం, ఆపై హెచ్‌సీక్యూ మందుల పంపిణీ మాదిరిగా వీటి పని తీరు ఉండకూడదని సిబ్బంది కోరుతున్నారు. ( చదవండి: వాట్సప్ చేస్తే ఉచిత భోజనం.. వారికి మాత్రమే! ) -
ఎడ్లబండే 108
సాక్షి, నార్నూర్ (ఆసిఫాబాద్) : మండలంలోని మల్లెంగి గ్రామ పంచాయతీ పరిధిలోని బారిక్‌రావుగూడ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఎన్నికలప్పుడు అధికారులు, పాలకులు ఇచ్చిన హా మీలు నీటిమూటలుగానే మిగిలాయి. గిరిజనుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీ ఏపీవో, స్థానిక పాలకులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వాహనం 108 అం బులెన్స్ రాలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎ వరికైన జ్వరం వచ్చిన లేదా అనారోగ్యానికి గురైన ఎడ్ల బండిలో వాగు దాటాల్సిందేనని వాపోతున్నారు. బారిక్‌రావుగూడ గ్రామానికి రోడ్డు మా ర్గం సరిగా లేకపోవడంతో దాదాపు 5 కిలో మీటరు కాలినడకన మల్లెంగి గ్రామానికి చేరుకోలి. గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆటోలు, 108 అంబులెన్స్‌లు రాలేని పరిస్థితి ఉందని గ్రామ పటల్ బారిక్రావు తెలిపారు. ఇప్పటికైనా బారిక్‌రావుగూడ వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరచేతిలో ప్రాణాలు.. కాన్పు సమయంలో అందుబాటులో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ రాత్రైనా ఎడ్ల బండిపై నార్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మంది గర్భిణులు ఇబ్బందిపడ్డారు. దాదాపు 12కిలో మీటర్లు ఎడ్ల బండిలో ప్రయాణించడం వలన అనారోగ్యానికి గురి కావడంతో పాటు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లాదిస్తున్నారు. వర్షా కాలం వాగులో వరద నీరు భారీగా చేరడంతో రా కపోకలకు అంతరాయం ఏర్పాడుతోంది. ఖరీప్ సాగు పనులకు అవసరమయ్యే సరకులను ముందే విత్తనాలు, వస్తువులను ప్రజలు తెచ్చుకొని పెట్టుకుంటారు. అత్యవసర సమయంలో తాడు సహాయంతో వాగు దాటాల్సిందే. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు.. గ్రామ సమస్యలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లే దు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు చెబుతున్నా రు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. వంతెన నిర్మించాలి బారిక్‌రావుగూడలో దాదాపు 150 కుటుంబాలు ఉంటాయి. కనీసం రోడ్డు లేదు. వాగుపై వంతెన లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. వర్షకాలంలో పరిస్థితి మరీ దారుణం. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించి సౌకర్యాలు కల్పించాలి. – పూసం రూపాబాయి, సర్పంచ్, మల్లెంగి ఎండ్ల బండే దిక్కు గ్రామంలో జ్వరం వచ్చి నా.. గర్భిణులకు పురిటి నొ ప్పులు వచ్చినా.. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ రాదు. ఎండ్ల బండిపైనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అధికారులకు చెప్పినా పట్టించుకో వడం లేదు. రోడ్డు లేక చాలా గోసైతాంది. – నాగు, బారిక్‌రావుగూడ -
‘ఓపీ’క పట్టాల్సిందే
సాక్షి, నిడదవోలు (పశ్చిమగోదావరి) : నిడదవోలు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎండమావిగానే మిగిలిపోయింది. సరైన వసతులు లేక వైద్యం కోసం రోగులు క్యూలైన్లలో అవస్థలు పడాల్సివస్తోంది. భవనం పైఅంతస్తులో నాలుగు వార్డుల్లో ఇన్‌పేషెంట్లకు 30 పడకలు ఏర్పాటు చేశారు. కింద భాగంలోని 15 గదులను వివిధ విభాగాల సేవలకు కేటాయించారు. కింద భాగంలో వైద్యులు ఓపీ చూసేందుకు అవసరమైన గదులు నిర్మించకపోవడంతో రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఆసుపత్రి స్థాయి పెంచినా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 1987లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని స్థాపించారు. అప్పటి వైద్యశాఖ మంత్రి 8 పడకల ఆసుపత్రిగా దీనిని ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రి మంజూరుకావడంతో 2016లో రూ.2.97 కోట్లతో రెండంతస్తుల పక్కా భవనాన్ని నిర్మించారు. అడ్డదిడ్డంగా భవనాన్ని నిర్మించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిడదవోలు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న 46 గ్రామాల నుంచి రోజూ 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. ప్రతీ మంగళవారం గర్బిణీ స్త్రీలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. నిడదవోలు చట్టు పక్కల గ్రామాల నుంచి∙అధిక సంఖ్యలో పేద వర్గాలు వైద్య పరీక్షలకు ఇక్కడికే వస్తుంటారు. ప్రతీ నెల సుమారు 10 పాము కాటు కేసులు వస్తున్నాయి. అత్యవసర కేసులు, పురుగుమందు తాగిన కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు 30 పడకల ఆసుపత్రి భవనాన్ని తప్ప ఓపీ కోసం వచ్చిన వారితో పాటు ఆసుపత్రి సిబ్బందికి మరుదొడ్లు నిర్మించడం మరిచిపోయారు. ఆసుపత్రి ఫ్లాన్లో మరుగుదొడ్లు లేకపోవడంతో వైద్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంబందిత కాంట్రాక్టర్, ఆసుపత్రి కమిటీ వారు పట్టించుకోకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు కనీసం మూత్రవిసర్జనకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఆసుపత్రి బయట రాయలవారి చెరువు వద్దకు వెళ్ళి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద భవనం కట్టి మరుగుదొడ్డి నిర్మించకపోవడంతో ఇదేక్కడి చోద్యమని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత టీడీపీ ప్రభుత్వంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించారే తప్ప, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆస్పత్రిని ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీంతో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. నిబంధనల ప్రకారం 30 పడకల ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్, నాలుగు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు, హెడ్ నర్సు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, రేడియో గ్రాఫర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ రూం టెక్నీషియన్, డార్క్‌రూం అసిస్టెంట్, పోస్టుమార్టమ్ గది అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, నలుగురు నర్సులు ఉండాలి. వాటిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు, రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తణుకు, రాజమండ్రి ఆస్పత్రులకు.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో మార్గ మధ్యంలో ప్రాణాలు గాలిలో కలసిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్నింటిని తణుకు, రాజమండ్రి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు ఎటాంటి వైద్యం అందించాలో తెలియక వైద్యులు అయోమయానికి గురువుతున్నారు. ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రతి చిన్నదానికి బయటకువెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. దీంతో సీరియస్ కేసులను తణుకు, రాజమండ్రి తరలిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో సరైన సామగ్రి లేకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. గైనకాలజిస్ట్, మత్తు వైద్యురాలు ఉండడంతో పురిటి కేసులను చూస్తున్నారు. పురుడు పోసే సమయంలో అత్యవసర వైద్య సేవలు చేసేందుకు పూర్తిస్థాయిలో ఎక్విప్మెంట్, హెడ్ నర్సు లేకపోవడంతో తణుకుకు రిఫర్ చేస్తున్నారు. జనరేటర్ పనిచేయకపోవడంతో కరెంట్ లేని సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలు ఆసుపత్రిలో ప్రధానంగా 108 సేవలు అందుబాటులో లేకపోవడంతో కానూరు, తణుకు వాహనాలు వస్తున్నాయి. ప్రతీ మూడు నెలలకు 280 పాము, కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. రేబీస్ వ్యాక్సిన్ కొరతగా ఉంది. పాముకాటు కేసులకు సరైన చికిత్స అందడం లేదు. గదుల కొరత ఆసుపత్రుని గదులు కొరత వెంటాడుతోంది, ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ వైద్యులు, ఇద్దరు అవుట్సోర్సింగ్ వైద్యులు ఉన్నారు. ఇంకా రెండు పోస్టులు భర్తీ చేస్తే వారికి గదులు లేక ఇబ్బందిపడాలి. పురుగు మందు కక్కించడానికి గది లేకపోవడంతో ఆసుపత్రి బయటనే ఆ పని చేయిస్తున్నారు. క్షత్రగాత్రలకు సిమెంట్ కట్టు వేయడానికి, డ్రస్సింగ్ చేయడానికి, కుట్లు వేయడానికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మందులు భద్రపర్చడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటిన్నింటికి తక్షణం పరిష్కారం చూపాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
యానాదులం..అభివృద్ధిఎరుగం
సాక్షి, కాళ్ల (పశ్చిమగోదావరి) : ఎన్నో ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. ఇప్పటికీ చీకటిలోనే జీవితాలు.. ఇన్నాళ్లూ పరిపాలించిన ప్రభుత్వాలు వారి జీవన విధానంలో ఎటువంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కట్టుకోవడానికి సరైన బట్ట, నివాసం లేక కాలువ, పొలాల గట్ల మీద కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని కాళ్ల మండలంలో వీరు ఎక్కువగా ఉన్నారు. కాళ్ల, దొడ్డనపూడి, ఏలూరుపాడు గ్రామాల్లో సుమారు 10 కుటుంబాలు ఈ విధంగానే జీవిస్తున్నాయి. సరైన గూడు లేక ఎండకు ఎండి, వానకు తడుస్తూ కనీసం కరెంటు సౌకర్యం లేకుండా చీకట్లోనే జీవిస్తున్నారు. పొలాల్లో ఎలుకలను, కాలువల్లో చేపలను పట్టుకుని జీవించడం వీరి వృత్తి. కనీసం వీరి పిల్లలు చదువు సంధ్య లేకుండా పొలాలగట్లపై తిరుగుతున్నా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. 20 ఏళ్లుగా కాలువ గట్టునే.. కాళ్ల మండలంలోని దొడ్డనపూడి పంట కాలువ గట్టును ఆనుకుని సుమారు 20 ఏళ్లుగా రావూరి బ్రహ్మం, రావూరి శ్రీను కుటుంబాలు జీవిస్తున్నాయి. కనీసం వీరికి రేషన్‌కార్డులు కూడా లేవు. కొన్నేళ్ల క్రితం వీరు చీకట్లో ఉండటం చూసి విద్యుత్ స్తంభం వేశారు. అయితే ఆ విద్యుత్ స్తంభం పాడైపోయి ఏడాదిన్నర గడుస్తున్నా కరెంటు కనెక్షన్ మాత్రం ఇవ్వలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దిక్కతోచని స్థితిలోనే పాములు, పురుగుల మధ్య కాళం వెళ్లదీస్తున్నామని చెప్పారు. అదే కాలువ గట్లను ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులకు విద్యుత్ ఆగితే నిమిషాల మీద పనిచేసే అధికారులు పేదలు చీకట్లో మగ్గుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామంలో పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు పట్టించుకుని విద్యుత్ లైట్లు వేయాలని, అదే విధంగా రేషన్‌కార్డులు అందించి, సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. -
పట్టాలెక్కని సౌకర్యాలు
సాక్షి, మహానంది(కర్నూలు) : నంద్యాల – గుంటూరు రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కరువయ్యాయి. రైలు వచ్చే వరకు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఈ రైల్వేస్టేషన్‌కు సమీపంలో కేవలం 4 కి.మీ. దూరంలో మహానంది పుణ్యక్షేత్రం ఉండడంతో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. రోజుకు సుమారు 2 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ రైల్వే శాఖ అధికారులు రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి వెళ్లేందుకు సమీప గ్రామాల వారు అధిక సంఖ్యలో ఈ స్టేషన్ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. గాజులపల్లె స్టేషన్ నుంచి చలమ, పచ్చర్ల, కృష్ణంశెట్టిపల్లె, గిద్దలూరు తదితర స్టేషన్ల మీదుగా విజయవాడకు వెళ్లేందుకు సమీప గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు మహానంది పుణ్యక్షేత్రం దగ్గరగా ఉండడంతో అటు విజయవాడ నుంచి, ఇటు గుంతకల్లు వైపు నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. కాని ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో డీఆర్ఎంగా ఆనంద్మాథూర్ విధులు నిర్వహించే సమయంలో సుమారు రూ.16 లక్షలతో షెడ్లు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కాని అవి నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో భక్తులు, ప్రయాణికులు మండుటెండల్లోనే రైళ్లకోసం వేచి చూడాల్సి వస్తోంది. మహానంది స్టేషన్‌గా పేరు మార్పు ఎప్పుడు? గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా పేరు మార్చాలని, దీని ద్వారా మహానంది పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని అధికారులు కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహానంది దేవస్థానం ఈఓ సుబ్రమణ్యం, వేదపండితులు రవిశంకర అవధాని, అధికారులు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో చర్చించడంతో పాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారని దేవస్థానం అధికారులకు తెలిపారు. ఈ సారైనా ఎంపీ చొరవతో మహానంది ఫుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్థిక మంత్రి ఇలాకాలో వైద్యం కోసం వెతలే..
సాక్షి, కోటనందూరు (తూర్పు గోదావరి): పాలకుల మోసపూరిత హామీలతో ప్రజల కష్టాలు తీరడంలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఎంతో ఆశపడి ప్రజలు ఓట్లు వేస్తే తీరా గద్దెనెక్కాక పాలకులు వంచిస్తున్నారు. ప్రజలకు కనీస అవసరమైన వైద్య సదుపాయాల కల్పనలో కోటనందూరు మండలంలో గత 30 ఏళ్లుగా పాలకులు అనుసరిస్తున్న తీరు ఇదే. టీడీపీ నేతలు 2003లో మళ్లీ ఏదిఏమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనతో పాతకొట్టాంలో 10 పడకల ఆసుపత్రి, కోటనందూరు పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధికి హడావుడిగా శిలాఫలకాలు వేశారు. దురదృష్టం వెంటాడి అధికారం దక్కకపోవడంతో ఆ నిర్మాణం జరగలేదు. వేసిన శిలాఫలకాలు నేటికీ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. మరలా 2014వ సంవత్సరంలో ఎన్నికల ముందు అవే శిలాఫలకాల పనులను పూర్తి చేసి చూపిస్తామంటూ ఊదరకొట్టారు. అయితే ఐదేళ్లు గడచినా ఆ నాడు ఇచ్చిన ఏ హామీలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. పాలకుల నిర్వాకంతో ఈ రోజుకీ ప్రభుత్వ వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికమంత్రి ఇలాకాలో ఉన్న ఈ దుస్థితిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంమవుతోంది. గత 50 ఏళ్లుగా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం స్థాయి పెరగలేదు. 1964లో 6 పడకల ఆసుపత్రిగా ఏర్పడిన ఈ పీహెచ్సీ నేటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఈ ఆసుపత్రిలో కనీస వసతులైన మరుగుదొడ్డి, మంచినీరు, కూర్చోడానికి బల్లలు లేని పరిస్థితి ఉంది. అవసరం మేర వైద్య సిబ్బంది లేక రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. జిల్లాలో ప్రసవాల్లో మొదటి స్థానంలో ఉందని చెప్పుకునే ఈ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో నీటి సదుపాయం లేని దయనీయ పరిస్థితులు ఉన్నాయి. సుమారు లక్ష మందికి వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని 2014లో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఒకప్పుడు 500 ఉండే ఓపీ నేడు 100కు పడిపోయింది. 24 గంటలూ అందాల్సిన వైద్య సేవలు కొన్ని గం టలకు మాత్రమే పరిమితమయ్యాయి. 50 ఏళ్లగా ప్రభుత్వ వైద్య సేవల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఉన్న పరిస్థితులు కూడా టీడీపీ హయాంలో దిగజారిపోయాయి. సగటు పేదవాడు ఏదైన వైద్యం చేయిం చుకోవాలంటే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వెక్కిరిస్తున్న శిలాఫలకం మండలంలో పాతకొట్టాం గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంపై ఎల్డీపేట, కొత్తకొట్టాం, పాతకొట్టాం, కేఒ అగ్రహారం, కేఎస్ కొత్తూరు, తిమ్మరాజుపేట, కేఈ చిన్నయ్యపాలెంతో పాటు విశాఖ జిల్లాలోని మరికొన్ని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ఈ గ్రామాలన్నింటికీ పాతకొట్టాం కేంద్రంగా ఉండడంతో ఇక్కడ 10 పడకల ఆసుపత్రిని నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఆసుపత్రి లేని కారణంగా సుమారు 40 వేల మందికి ప్రభుత్వ వైద్యం అందని పరిస్థితి నెలకొంది. వైద్యం అవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ప్రస్తుతం అరకొర వసతులున్న శిథిల భవనంలో ఆరోగ్య ఉపకేంద్రం ద్వారా మొక్కుబడిగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దయనీయం కోటనందూరు పీహెచ్సీలో రోగులకు, సిబ్బందికి అవసరమైన కనీస వసతులు లేవు. రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్లగా ఆసుపత్రి నిర్వహణ అత్యంత దయనీయంగా మారింది. సిబ్బంది కొరతతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. ఈ ఆసుపత్రిలో కనీసం రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలమై ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితిలో ఉంది. చాలా కాలంగా 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పడమే కాని మారింది కనబడలేదు. – డేవిడ్, కోటనందూరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం పాతకొట్టాంలో ప్రభుత్వ ఆసుపత్రి లేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఏ రకమైన వైద్యం కావాలన్నా ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ వైద్య దొరకక దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ప్రభుత్వ వైద్యం అందితే బాగుంటుంది. – పంపనబోయిన సత్యవతి, తిమ్మరాజుపేట -
పైసా వసూల్
వినోదం కోసం వెళ్లిన వారికి థియేటర్ల యజమానులు అధిక ధరలతో సినిమా చూపిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఐదు థియేటర్లు ఉండగా, అందులో పార్కింగ్ పేరిట ప్రేక్షకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని థియేటర్లలోనైతే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యే క స్థలం లేదు. సినిమాలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెంచే హక్కులు ప్రభుత్వం యా జమాన్యాలకు ఇచ్చింది. అయినప్పటికీ టికెట్ల ధరలు పెంచడంతో పాటు పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. పార్కింగ్ చేసిన వాహనాలు విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. ప్రత్యేకంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30ల, ఆటోలకు, ద్విచక్రవాహనాలకు రూ.20, సైకిళ్లకు రూ.10లు వసూలు చేస్తూ సినిమాకు వచ్చిన వారి జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సినిమాకు వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న రశీదు ఇలా ఒక్క థియేటర్లో ఒక షోకు సుమారు 100 వరకు వాహనాలు వస్తుండగా వాటికి రూ. 1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు అవుతున్నాయి. ఇలా ఒక రోజులో నాలుగు షోలకు రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో థియేటర్లు 5 ఒక థియేటర్లో ఉండే సీట్లు 400-500 ఒక షోకు పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనాలు 100 పార్కింగ్ చేసే ఆటోలు 10 పార్కింగ్ చేసే ఆటోలు 10 ఉన్నత వర్గాల వారు వచ్చే కార్లు 5 అన్నీ అసౌకర్యలే.. సినిమా థియేటర్‌కు వచ్చిన వారిని అసౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. థియేటర్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సినిమాకు వచ్చిన వందలాది మందికి సరిపోక, శుభ్రంగా లేకపోవటంతో సినిమాకు వచ్చిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. విరామ సమయంలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ కొనుగోలు చేసేవారు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట లభించే ధరల కంటే రూ.5 నుంచి రూ.10ల వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు దగాకు గురికావాల్సి వస్తోంది. పేరున్న హీరో సినిమా వస్తే సినిమా యాజమాన్యం ఏకంగా టికెట్ ధరలు పెంచేస్తోంది. ఇప్పటకైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. -
పేరుకే రైల్వే స్టేషన్లు!
తలమడుగు(బోథ్) : బోథ్ నియోజకవర్గంలో తలమడుగు, ఉండమ్ గ్రామంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లు ప్యాసింజర్ రైళ్లకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. గతంలో తాంసీ, తలమడుగు మండల ప్రజల రావాణా సౌకర్యార్థ్థం రైలు ప్రయాణం మాత్రమే ఉండేది. ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లను పాలకులు పట్టించుకోక పోవడంతో స్టేషన్లలో కనీస వసతులు కరువయ్యాయి. 1976లో నుంచి అసౌకర్యాలే.. 1976లో తలమడుగు గ్రామం మీదుగా మహరాష్ట్ర కిన్వాట్ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. బోథ్ నియోజకవర్గంలో బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నుర్, సిరికొండ, బీంపూర్, తాంసీ, తలమడుగు, మండలాలు ఉన్నాయి. వాటిలో తలమడుగు రైల్వే స్టేషన్ మాత్రం తాంసీ, తలమడుగు, భీంపూర్, మండలాల ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు తరచూ హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈస్టేషన్ మీదుగా దీక్షభూమి, పాట్నా, నాందేడ్ స్పెషల్, నందిగామ్, కృçష్ణ, సంత్రగాంచి, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి, కేవలం ప్యాసింజర్ రైళ్లు రెండు మాత్రమే ఇక్కడ అగుతాయి. బస్సు చార్జీలు ప్రయాణికులకు భారమవుతుండడంతో నిరుపేద, మధ్యతరతి ప్రజలు రైళ్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని, రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ తలమడుగులోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. తాగునీటి వసతి, ప్రాయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎండాకాలం ఎండలో, వర్షాకాలంలో తడుస్తూ రైలు ప్రయాణం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రాయణికులు స్టేషన్ నుంచి ప్రాయాణం సాగిస్తున్నా అధికారులు వసతులు కల్పించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలు ఆపకపోవడంతో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి తిరిగి ఎక్స్‌ప్రెస్ రైలులో తలమడుగు, ఉండమ్, రైల్వే స్టేషన్ల మీదుగానే వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డబ్బులు, సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంపీ గోడం నగేశ్ చొరవ తీసుకుని తలమడుగులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని, ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలి తలమడుగు రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైళ్లు మాత్రమే అపుతున్నారు. మిగతా రైళ్లు ఇక్కడ ఆపడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ రైళ్లు నిలిపితే ఎలాంటి సమస్యలు ఉండవు. గతంలో నాందేడ్, నుంచి రైల్వే ఉన్నధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. – లింగాల రాజన్న, తలమడుగు కనీస సౌకర్యాలు కల్పించాలి రైల్వె స్టేషన్లో ప్రాయాణికులకు కూర్చోడానికి కుర్చీలు తాగేందుకు నీటి సౌకర్యం లేవు. దీంతో ఇక్కడకు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ కాలంలో ఎండను, వర్షాకాలంలో వానను తట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. రైల్వే స్టేషన్‌కు రావాలంటే రోడ్డు పూర్తిగా బురదమయంగా ఉంటుంది. బురదలోంచి నడిచి వస్తున్నాం. కనీసం తాగునీటి సౌకర్యం, కనీస సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శరత్‌యాదవ్, తాంసీ -
రోగి ‘ఓపి’కకు..పరీక్ష
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. వైద్యం దైన్యంగా మారింది. వివిధ ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ..హాస్పిటల్‌కు వచ్చేవారికి చీత్కారాలు.. చీదరింపులుతప్ప.. చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రమాదంలో గాయపడి వచ్చే వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఓపీకి వచ్చే వారి పరిస్థితిమొదట ఎదురుచూపులు.. ఆ తర్వాత మాత్రలే దిక్కు అన్న చందంగా తయారైంది. జిల్లాలోనిఆస్పత్రుల్లో.. సోమవారం సాక్షి నిర్వహించిన విజిట్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం,ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపించింది. సాక్షి, తిరుపతి (అలిపిరి): రాయలసీమకే పెద్దాస్పత్రిగా గుర్తింపు పొందిన రుయాకు సుస్తీ చేసింది. సోమవారం సాక్షి బృందం రుయా ఆస్పత్రిని విజిట్ చేసింది. పరిశీలనలో.. రుయాలో ఓపీ విభాగం సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఓపీ నమోదు కేంద్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 8.30 గంటలకు ఓపీ నమోదు సేవలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటలకు ఓపీ నమోదు చేసుకున్న రోగులు ఆయా విభాగాల వారీగా ఓపీ విభాగాల వద్దకు చేరుకుం టారు. గేట్లు తెరిచిన వెంటనే ఓపీ నమోదు హాలులోకి 500 మంది ఒక్కసారి దూసుకుపోతున్నారు. దీంతో ఓపీ నమోదు హాలు రోగులతో కిక్కిరిసిపోతుంది. రుయా ఆస్పత్రిలో కంప్యూటర్, ఇంటర్నెట్ నిర్వహణ నిమిత్తం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.లక్షలు చెల్లిస్తున్నారు. అయినా ఓపీ కేంద్రాల నిర్వాహణ అధ్వానంగా మారింది. సమయపాలన పాటించని వైద్యులు రుయా ఆస్పత్రిలో ఉన్నతాధికారులు మొదలుకుని సీనియర్ వైద్యుల వరకు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రాంభమైనా అధికారులు అందుబాటులో ఉండడం లేదు. ఓపీ సేవలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు వున్నా కొందరు వైద్యులు 12 గంటలకే వెళ్లిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, చోటామోటా నాయకుల రెకమెండేషన్ వుంటేనే ఆపరేషన్లు త్వరితగతిన చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. లేకుంటే పడిగాపులు తప్పవు. పట్టించుకునేవారు లేరు.. నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి ఎడమ కాలికి గాయమైంది. రుయాకు వైద్యం కోసం వచ్చా. ఆర్థో విభాగానికి వెళితే తగిలిన గాయానికి కట్టుకట్టారు. నెల రోజులుగా రుయా ఆవరణలోని విశ్రాంతి సముదాయంలో ఉన్న.. దెబ్బ మానడం లేదు. వైద్యులు బయట మందులు రాస్తున్నారు. దిక్కులేక ఇక్కడే ఉన్నాను – రాము, మైసూరు, కర్ణాటక సహాయకులుంటేనే వైద్యం అంటున్నారు కుడికాలుకు అరికాలులో చెక్కపేడు ఇరుక్కుపోయింది. వారం రోజుల క్రితం రుయా ఆర్థో విభాగానికి వస్తే గాయాన్ని క్లీన్‌చేసి కట్టుకట్టి పంపారు. మళ్లీ వైద్యం కోసం వస్తే ఆపరేషన్ చేసి చెక్కను తీస్తాం.. నీకు సహాయకులుంటే వైద్యం చేస్తాం.. లేకుంటే లేదు. అని చెప్పారు. నాకు ఎవరూ లేరు... వైద్యం కోసం వస్తే ఇలా చెప్పడం బాధేసింది. పెద్ద సార్లు నాకు వైద్యం అందించి కాలులోని చెక్క పేడును తొలగించాలి. – సుబ్బరాజు, నాయుడు పేట, నెల్లూరు జిల్లా -
రిమ్స్‌లో అన్నీ అగచాట్లే
సాక్షి, కడప : కడపలో ఉన్న రిమ్స్‌లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రిమ్స్‌కు వెళ్లిన రోగులకు సంబంధించి ఓపీ దగ్గరి నుంచి వైద్య సేవలు పొంది ఇంటికి వచ్చేంతవరకు అన్నీ అగచాట్లే. ఒకప్పుడు కడప నుంచి రిమ్స్ వరకు ఉచిత బస్సులు ఉండేవి. అవీ లేవు. ఎన్నో ప్రయాసలు కోర్చి ఆస్పత్రికి వెళ్లినా, అక్కడ కూలైన్లలో ఓపీ తీసుకోవడంలోనే సగం ప్రాణం పోతుంది. తర్వాత మళ్లీ డాక్టర్ వద్ద వైద్య పరీక్షలనంతరం నేరుగా రక్త, ఇతర పరీక్షలకు వెళితే అక్కడ క్యూలైన్లు.. మళ్లీ వాటి రిపోర్టుల కోసం మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఒకటేమిటి అనేక రకాల సమస్యలు వేధిస్తున్నాయి. పైగా ఐపీలో లిఫ్ట్‌లు కూడా పనిచేయకపోవడంతో రోగులను తిప్పలు తప్పడం లేదు. చివరికి రోగులను తరలించే వీల్ ఛైర్లు కూడా ఒక్కోసారి అందుబాటులో లేకపోవడంతో రోగులను బంధువులే ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు ‘సాక్షి’ కంటపడ్డాయి. పేరుకే సూపర్ స్పెషాలిటీ రిమ్స్ పేరుకే సూపర్. కానీ స్పెషాలిటీలో లేదు. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి విభాగాలే ఇంతవరకు ఏర్పాటు కాలేదు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు కూడా అందుబాటులో లేరు. అనేక రకాల పరికరాలు కూడా రిమ్స్‌కు రావాల్సి ఉంది. సామగ్రి లేకపోవడంతోనే ఇక్కడి నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో రోగిని ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు 1,800 నుంచి 2,000 మంది వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. ఆర్థోపెడిక్‌కు సంబంధించి సోమవారం దాదాపు 215 మంది రిమ్స్‌కు రాగా, జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 202 మంది, గైనకాలజీకి సంబంధించి 140, చర్మవ్యాధులకు సంబంధించి 115, కంటి వ్యాధిగ్రస్తులు 110 మంది వచ్చారు. ఆపరేషన్లకు సంబంధించి గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తాలమిక్ తదితర వాటికి ఆపరేషన్లు అనుకున్న సమయానికే జరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఆస్పత్రులకు 13వేల మంది రోగులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 24 గంటల ఆస్పత్రులు, రిమ్స్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులకు దాదాపు ప్రతిరోజు 12 వేల నుంచి 13 వేల మంది రోగులు వస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో అల్లాడుతున్న బాధితులతోపాటు ప్రతినిత్యం జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతోపాటు ఇతర సమస్యలతో రోజూ భారీగా ఆస్పత్రులకు వెళుతున్నారు. అయితే వచ్చిన రోగులందరినీ పరీక్షిస్తున్నా నాణ్యమైన వైద్య సేవలు అందడం గగనంగా మారింది. మంచినీటికి నోచుకోని జిల్లా ఆస్పత్రి ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి మండు వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతోంది. మంచినీటి కోసం బయటికి రోగులు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఆస్పత్రిలో మంచినీటి ట్యాంకు మరమ్మత్తులకు గురి కావడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. పైగా డాక్టర్లు కూడా సమయపాలన పాటించడం లేదు. సివిల్ సర్జన్ల కొరత కూడా ఆస్పత్రిని వెంటాడుతోంది. కొన్ని మందులు బయటికి రాసిస్తున్నారు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో కూడా రోగులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈసీజీ మిషన్ కూడా చెడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఐవీ సెట్లు కనబడవు....ఐరన్ మాత్రలూ లేవు జిల్లాలోని రాజంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్లాది రూపాయలతో నిర్మించినా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా, ఓపీ తీసుకోవాలన్నా ఎండలోనే రోగులకు తిప్పలు తప్పడం లేదు. బడ్జెట్ కొరత కారణంగా మందులు కూడా అంతంతమాత్రంగానే వచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐవీసెట్లు లేవు. ఐరన్ మాత్రలు కూడా అందుబాటులో లేవు. దీంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మొత్తానికి ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని, బాగు చేయాలని రోగులు కోరుతున్నారు. బద్వేలులో కూడా వైద్యుల కొరత వెంటాడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిని ప్రస్తుతం సీమాంక్ కేంద్రంలోనే నడుపుతున్నారు. రైల్వేకోడూరు 30పడకల ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కోసం లక్షలు వెచ్చించి నిర్మించినా వైద్యుడు లేకపోవవడంతో ప్రారంభించలేదు. ఎక్స్‌రే ప్లాంటు ఉన్నా మూలనపడింది. జమ్మలమడుగు ఆస్పత్రి నుంచి చిన్నచిన్న సమస్యలకు సైతం రోగులను రెఫర్ చేస్తున్నారు. గైనకాలజీ, అనస్తిషియా వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రేడియాలజిస్టు లేరు. మంత్రి నియోజకవర్గంలోని ఆస్పత్రిలో సమస్యలను పట్టించుకునేవారే లేరు. రాయచోటి ఆస్పత్రిలో కూడా వసతులు అరకొరగానే ఉన్నాయి. పేరుకు 50 పడకల ఆస్పత్రి అయినా వంద పడకల ఆస్పత్రిలాగా రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. సమీప ప్రాంతంలో కుక్క చనిపోయి రెండు రోజులు కావడంతో దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. కమలాపురంలో 30 పడకల ఆస్పత్రి ఉన్నా చిన్నపిల్లలు, అనస్తీషియా, గైనకాలజీ వైద్యులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్స్‌రే కూడా లేదు. రోగులు అధికంగా ఉన్నా అనువైన వసతులు లేవని లబోదిబోమంటున్నారు. పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మైదుకూరులో ఆస్పత్రి ఆధునీకరిస్తుండడంతో పక్కన గదుల్లో వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రస్తుతం కాన్పులకు ఇబ్బందిగా మారింది. ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం ఇద్దరే ఉన్నారు. ఇక 24 గంటల ఆస్పత్రిగా పేరొందిన వనిపెంట ఆస్పత్రిలో అయితే ఒకే ఒక వైద్యుడు ఉంటారు. రోగులు అధిక సంఖ్యలో వస్తుండడంతో రోగులను పరీక్షించం కష్టంగా మారుతోంది. స్కానింగ్‌కు బయటకు.. ప్రత్యేకంగా ఎప్పటినుంచో రిమ్స్‌కు ఎంఆర్ఐ స్కానింగ్ వస్తుందంటున్నా ఇప్పటికీ కనిపించడం లేదు. పైగా ఎంసీఐ నిబంధనల ప్రకారం ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఉండాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతి లేదు. సిటీ స్కానింగ్ ఉన్నా పనిచేయడం లేదు. ఆర్ఎంఓ నుంచి ఇప్పటివరకు కొన్నివేల స్కానింగ్‌లు నిర్వహించారు. అది మరమ్మతులకు గురికావడంతో నెల కిందటి నుంచి సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీంతో రోగులను ఆరోగ్యశ్రీ ద్వారా బయటికి పంపి స్కానింగ్‌లు చేస్తున్నారు. సీటీస్కాన్ పనిచేయడం లేదంటూ బోర్డు ఏర్పాటు -
జ్వరమా..! అయితే లైన్లో నిలబడు..!!
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. మందులమాట పక్కన పెడితే కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఆపత్కాలంలో ఇక్కడికొచ్చే నిరుపేద రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకునే వైద్యులు ఇష్టానుసారం డ్యూటీలు చేస్తుండడంతో నిరుపేదలకు హౌస్ సర్జన్లే దిక్కవుతున్నారు. ఇక జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ ఎంఆర్ఐ, ఆల్ట్రాసౌండ్ సేవలు అందుబాటులో లేవు. మందుల కొరత పట్టిపీడిస్తుండగా..రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. అధునాతన యంత్రాలుదిష్టిబొమ్మలుగా మారడంతో రోగులంతా అప్పులు చేసి మరీ ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: అనంతపురంలోని సర్వజనాస్పత్రి జిల్లాకే పెద్దదిక్కుగా ఉంది. జిల్లాలోని నిరుపేదలంతా ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా ఇక్కడికే పరుగుల వస్తారు. కానీ ఇక్కడ సకాలంలో వైద్యం అందక రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. మందుల్లేవ్ ఆస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఈ మూడు నెలల కాలానికి సంబంధించి 600 రకాల మందులు ఇంత వరకు సరఫరా కాలేదు. గతంలో వచ్చిన మందులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు కాటన్, సర్జికల్ గ్లౌస్ పూర్తిస్థాయిలో లేవు. దీంతో గైనిక్, సర్జికల్, మెడిసిన్, ఏఎంసీ, ఆర్థో, తదితర విభాగాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. స్కానింగ్ సేవలు బంద్ ఆస్పత్రిలో 14 రోజులుగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు బంద్ అయ్యాయి. అందుబాటులో ఉన్న ఒక్క రేడియాలజిస్టు లేకపోవడంతో స్కాన్ సెంటర్‌ను మూసి వేశారు. దీంతో రోజూ 50 స్కాన్ జాప్యం జరుగుతోంది. ఎంఆర్ఐ ఊసే లేదు సర్వజనాస్పత్రికి ఎంఆర్ఐ మంజూరైనా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో ఎంఆర్ఐ ఏర్పాటుకి నిర్మాణ పనులు చేపట్టారు. ఎప్పటిలోపు పనులు పూర్తవుతాయో తెలియడం లేదు. అత్యవసర కేసులను మాత్రం ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేట్‌గా చేయిస్తోంది. గంటపాటు క్యూలోనే స్ట్రెచర్‌పై ఉన్న వ్యక్తి పేరు శ్రీనివాసులు.యాడికి మండలం బోరెడ్డిపల్లి. ఛాతి నొప్పి రావడంతో కుటుంబీకులు ఉదయం 10.14 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వార్డుకు వెళితే ఓపీకి వెళ్లమన్నారు. గంటపాటు క్యూలో నిలుచుని ఓపీ నంబర్ 15కి వెళ్లగా.. అక్కడి వైద్యురాలు పరీక్షించకుండానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లమన్నారు. దీంతో కుటుంబీకులు 11.25కు మళ్లీ ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఏఎంసీకి అడ్మిషన్ రాయగా, అడ్మిషన్ కోసం గంటల తరబడి వేచి చూశారు. చివరకు 1.25 గంటలకు ఆస్పత్రిలో అడ్మిషన్ చేశారు. కటికనేలపైనే నగరానికి చెందిన లక్ష్మి ఈ నెల 17 ఆస్పత్రిలో అడ్మిషన్ కాగా అబార్షన్ అయ్యింది. గైనిక్ వార్డులోనే వైద్యులు అడ్మిట్ చేశారు. మంచ లేకపోవడంతో నేలపైనే పడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఆస్పత్రిలోని లేబర్, పోస్టునేటల్, మెడిసిన్, ఆర్థో, ఎంఎస్ 1, 2, ఎఫ్ఎస్ 1,2 వార్డుల్లో నెలకొంది. సర్వజనాస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా నమోదైనా ఆ స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పురంలో వెరీపూర్ హిందూపురం అర్బన్: జిల్లా ఆస్పత్రిగా హిందూపురంలో వైద్యసేవలు వెరీపూర్గా ఉన్నాయి. పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా సేవలు మాత్రం ఆ మేరకు అందడం లేదు. రోజూ 1,500 మంది దాకా ఓపీ ఉన్నప్పటికీ ఆ మేరకు వైద్యులు, సిబ్బంది లేరు. ఈ కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. మందుల కొరత వేధిస్తుండడంతో జనం బయట కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రిలో రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉండడంతో వ్యాధి నిర్ధారణ కష్టంగా మారింది. అందువల్లే ఇక్కడి వైద్యులు అన్ని రోగాలకు ఒకే రకంగా వైద్యం చేస్తున్నారు. దీంతో డిశ్చార్జి అయిన రెండు, మూడు రోజుల్లోనే జనం మళ్లీ రోగాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. మూలనపడ్డ పరికరాలు ఆస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), సర్జికల్, చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు మూలపడ్డాయి. నూతనంగా వెంటిలేటర్లు రావడంతో పాత వాటిని మరమ్మత్తులు చేయించడం లేదు. ఇక ఆర్థో, సీఎస్ఎస్డీ విభాగాల్లో ఆటోక్లేవ్ మిషన్ ఒకటి పనిచేయడం లేదు. దీంతో కాటన్ తదితర వాటిని స్టెరిలైజ్ పూర్తి స్థాయిలో చేయడం లేదని సిబ్బందే చెబుతున్నారు. నూతనంగా వచ్చిన ఆటోక్లేవ్‌లను వాడకుండా మూలకుపెట్టారు. ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదు. హౌస్సర్జన్లే దిక్కు సర్వజనాస్పత్రి రెగ్యులర్ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న హౌస్సర్జన్లే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. సోమవారం గైనిక్, లేబర్ ఓపీలతో పాటు లేబర్ వార్డులోనూ హౌస్సర్జన్లే సేవలందించారు. అలాగే చిన్నపిల్లల విభాగంలోని ఎస్ఎన్సీయూలోనూ హౌస్ సర్జనే చిన్నారులను చూసి మందులు రాశారు. అరకొర సేవలు గుంతకల్లు: పట్టణంలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి అరకొర వైద్యసేవలతో నెట్టుకొస్తోంది. గుంతకల్లు మండలంతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు మండలాల వారే కాకుండా సరిహద్దులోని కర్నూలు జిల్లా మద్దికెర, చిప్పగిరి మండలాల వారంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే వస్తుంటారు. దీంతో రోజూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య 50 కిపైగానే ఉంటుంది. గర్భిణులు అధిక సంఖ్యలో వచ్చే ఈ ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండడం లేదు. సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. తగినంత సిబ్బంది లేక అటెండర్ల వైద్యం చేస్తున్నారు. బ్లడ్ స్టోరేజీ ఫ్రిడ్జ్ కాలిపోవడంతో రక్తం నిల్వచేయడం లేదు. దీంతో అత్యవసరంలో రక్తం అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని ఓ ఎక్స్‌రే మిషన్ పనిచేయకపోవడంతో జనం ప్రైవేటుకు వెళ్తున్నారు. -
సమస్యల వలయంలో రిమ్స్
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) సమస్యల వలయంలో చిక్కుకుంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ వైద్యం, సదుపాయాలు సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. రిమ్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న వైద్యులు సమయ పాలన పాటించడంలేదు. ప్రసూతి వార్డుల్లో రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన అభివృద్ధి కమిటీ సమావేశం ఆగస్టు నుంచి ఆఊసేలేదు. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు శనివారం రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగురామన్న, రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడం నగేష్, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జెడ్పీ చైర్పర్సన్ శోభరాణి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కనీస సౌకర్యాలు కరువు.. రిమ్స్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల ఆస్పత్రి, నిత్యం 1500 మంది రోగులు వచ్చే రిమ్స్‌లో తాగునీటి కష్టాలు ఉండడం గమనార్హం. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేస్తున్నారు. ఆస్పత్రికి 4 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం 2 లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్ తెప్పించుకుంటున్నా అవి సరిపోవడం లేదు. కనీసం ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కులాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడంతస్తుల్లో ఉన్న రోగులు నిత్యం నీటి కోసం కిందకు రావాల్సిందే. అది కూడా రిమ్స్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరే దిక్కవుతోంది. నీటి సరఫరాల లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రిమ్స్‌తో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీటి కొరత ఏర్పడుతుంది. ఈ రెండింటికి కలిపి సుమారు 10 లక్షల నీటి అవసరం ఉంటుంది. గతంలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో తలమడుగు మండలంలోని మత్తడివాగు నుంచి పైప్‌లైన్ ద్వారా రిమ్స్‌కు నీటి సరఫరాచేయాలనే ప్రతిపాదనలు పెట్టారు. కానీ దానిపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలోనైనా తాగునీటి సమస్య పరిష్కారంపై ఒక స్పష్టత వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. పెరిగిపోతున్న రెఫర్లు... రిమ్స్‌కు వచ్చే అత్యవసర కేసులు దాదాపు 80శాతం ఇతర ప్రాంతాలకే రెఫర్ చేస్తున్నారు. చిన్నచిన్న కేసులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రి పూర్తి చేస్తే రెఫర్ కేసులు తగ్గడంతో పాటు మరణాలు తగ్గిపోయి, అత్యవసర సమయంలో రోగులకు వైద్యం అందుతుంది. అయితే సూపర్ స్పెషాలిటీ పూర్తి కావడానికి కనీసం మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రిమ్స్‌లో రెఫర్ కేసులు, మరణాల పరిస్థితి ఇలాగే కొనసాగడం తప్పదనే చెప్పవచ్చు. దీనిపై మంత్రులు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆటంకాలెన్నో!
ఆకివీడు : ‘ఆటలకు అమిత ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేస్తాం. వారు ఆటల్లో తర్ఫీదు పొందేందుకు అన్ని వసతులూ కల్పిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 464 ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పచ్చికబయళ్లను తలపిస్తున్నాయి. కొన్ని మైదానాలు ఆటకు అనుకూలంగా లేవు. చాలా పాఠశాలల్లో కీడ్రా పరికరాలే లేవు. దాతల సహకాంతో క్రీడా సామగ్రి పాఠశాలలకు అందినా ఆడుకునేందుకు క్రీడామైదానం అనుకూలంగా లేకపోవడంతో అవి స్టోర్ రూమ్లకే పరిమితమైపోతున్నాయి. రైకాకి రెక్కలొచ్చేనా! గతంలో పైకా (పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్) పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవారు. అయితే ఆ పథకం పేరును గత ప్రభుత్వం రైకా(రాజీవ్ యువ క్రీడా ఖేల్ అభియాన్)గా మార్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అటకెక్కించాయి. పాఠశాలల్లో చదువుతున్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఈ పథకం కింద మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలి. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలి. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పీఈటీలేరీ ! పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సరిపడా పీఈటీలూ లేరు. పీఈటీలు ఉన్నా.. బడుల్లో క్రీడా మైదానాలు లేవు. మైదానాలు ఉన్నా.. అవి ఆటలకు అనుకూలంగా లేవు. ఇలా అనేక సమస్యలు ఆటలతో దోబూచులాడుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల కొరత అధ్వానంగా తయారైన మైదానాల మరమ్మతులకు, క్రీడా సామగ్రికి నిధుల కొరత ఉన్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అయితే స్కూల్ గ్రాంట్‌ను దీనికి వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆ గ్రాంటుతో బడి నిర్వహణ చేస్తున్నందున క్రీడాభివృద్ధికి దానిని కేటాయించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్ గ్రాంట్ వినియోగించలేం స్కూల్ గ్రాంట్‌ను క్రీడాభివృద్ధికి వినియోగించలేం. రూ.7 వేల గ్రాంటును బడి నిర్వహణకే సరిపోతోంది. – రామానుజాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు, చినకాపవరం ఆటలకు జాగాలేదు మా బడిలో క్రీడా ప్రాంగణం ఉన్నా.. ఆడుకునేందుకు జాగాలేదు. నిన్న మొన్నటి వరకూ వర్షపు నీటితో మైదానం నిండిపోయింది. ఇప్పుడిప్పుడే నీరు ఇంకుతోంది. ప్రస్తుతం కొద్ది ఖాళీ స్థలంలోనే ఆటలాడుకుంటున్నాం. మాకు తగిన శిక్షణ లేదు. – రవి, విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు స్కూల్ గ్రాంట్‌తో క్రీడాసామగ్రి స్కూల్ గ్రాంట్లతో క్రీడా సామగ్రి కొనుక్కోవచ్చు. దాతల సహకారంతో కొన్ని పాఠశాలలకు సామగ్రి అందుతోంది. – ఎం.సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం. రైకా తేదీలు ఖరారు కాలేదు రైకా పోటీలకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశం ఉంది. అండర్–14, అండర్–17 స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తాం. మండలం, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఈ ఏడాది పోటీలు లేవు. – ఎస్కె. అజీజ్, జిల్లా క్రీడాధికారి, ఏలూరు -
ఆటంకాలెన్నో!
ఆకివీడు : ‘ఆటలకు అమిత ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేస్తాం. వారు ఆటల్లో తర్ఫీదు పొందేందుకు అన్ని వసతులూ కల్పిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 464 ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పచ్చికబయళ్లను తలపిస్తున్నాయి. కొన్ని మైదానాలు ఆటకు అనుకూలంగా లేవు. చాలా పాఠశాలల్లో కీడ్రా పరికరాలే లేవు. దాతల సహకాంతో క్రీడా సామగ్రి పాఠశాలలకు అందినా ఆడుకునేందుకు క్రీడామైదానం అనుకూలంగా లేకపోవడంతో అవి స్టోర్ రూమ్లకే పరిమితమైపోతున్నాయి. రైకాకి రెక్కలొచ్చేనా! గతంలో పైకా (పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్) పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవారు. అయితే ఆ పథకం పేరును గత ప్రభుత్వం రైకా(రాజీవ్ యువ క్రీడా ఖేల్ అభియాన్)గా మార్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అటకెక్కించాయి. పాఠశాలల్లో చదువుతున్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఈ పథకం కింద మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలి. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలి. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పీఈటీలేరీ ! పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సరిపడా పీఈటీలూ లేరు. పీఈటీలు ఉన్నా.. బడుల్లో క్రీడా మైదానాలు లేవు. మైదానాలు ఉన్నా.. అవి ఆటలకు అనుకూలంగా లేవు. ఇలా అనేక సమస్యలు ఆటలతో దోబూచులాడుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల కొరత అధ్వానంగా తయారైన మైదానాల మరమ్మతులకు, క్రీడా సామగ్రికి నిధుల కొరత ఉన్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అయితే స్కూల్ గ్రాంట్‌ను దీనికి వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆ గ్రాంటుతో బడి నిర్వహణ చేస్తున్నందున క్రీడాభివృద్ధికి దానిని కేటాయించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్ గ్రాంట్ వినియోగించలేం స్కూల్ గ్రాంట్‌ను క్రీడాభివృద్ధికి వినియోగించలేం. రూ.7 వేల గ్రాంటును బడి నిర్వహణకే సరిపోతోంది. – రామానుజాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు, చినకాపవరం ఆటలకు జాగాలేదు మా బడిలో క్రీడా ప్రాంగణం ఉన్నా.. ఆడుకునేందుకు జాగాలేదు. నిన్న మొన్నటి వరకూ వర్షపు నీటితో మైదానం నిండిపోయింది. ఇప్పుడిప్పుడే నీరు ఇంకుతోంది. ప్రస్తుతం కొద్ది ఖాళీ స్థలంలోనే ఆటలాడుకుంటున్నాం. మాకు తగిన శిక్షణ లేదు. – రవి, విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు స్కూల్ గ్రాంట్‌తో క్రీడాసామగ్రి స్కూల్ గ్రాంట్లతో క్రీడా సామగ్రి కొనుక్కోవచ్చు. దాతల సహకారంతో కొన్ని పాఠశాలలకు సామగ్రి అందుతోంది. – ఎం.సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం. రైకా తేదీలు ఖరారు కాలేదు రైకా పోటీలకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశం ఉంది. అండర్–14, అండర్–17 స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తాం. మండలం, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఈ ఏడాది పోటీలు లేవు. – ఎస్కె. అజీజ్, జిల్లా క్రీడాధికారి, ఏలూరు -
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి దుస్థితి
-
గ్రేటర్లో పడకేసిన వైద్యం
-
దేవుడే దిక్కు!
వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం స్వామివారి దర్శనం కోసం వచ్చిన రంజిత్‌కుమార్(22) అనే యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ లేదు. చివరికి కుటుంబసభ్యులు 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే ఊపిరి ఆగిపోయింది. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. వేములవాడ అర్బన్: ఎములాడ రాజన్న భక్తులకు అత్యవసర వేళ్లలో వైద్యం అందని ద్రాక్షలా మారింది. భక్తుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా ఆలయ యంత్రాగం ఆలోచించడం లేదు. కూలైన్లలో స్పృహతప్పి పడిపోయినా, ఆలయంలో కోడెలు దాడి చేసినా, మరేదైనా కారణంగా గాయాలైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కేవలం ఉత్సవాల సమయంలో రెండు లేదా మూడు రోజులపాటు వైద్య సేవలందించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కోడెల దాడి, క్యూలైన్లలో స్పృహతప్పి పడిపోవడం, ఆలయ ఆవరణలోనే గుండెపోటు రావడం లాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నా అధికారుల్లో ఇసుమంతైనా చలనం లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ప్రథమ చికిత్సకు నోచుకోని భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేంకు ప్రతిరోజు కనీసం ఐదువేల మంది భక్తులు వస్తుంటారు. ఆది, సోమ, శుక్ర, శని వారాలతో పాటు పండగలు, ప్రత్యేక రోజుల్లో సుమారు ముప్పైవేల మంది తరలివస్తుంటారు. మహాశివరాత్రి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. దీంతో నిత్యం ఈ క్షేత్రంలో భక్తుల సందడి కనిపిస్తూంటుంది. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కనీసం ఒకరోజైనా ఇక్కడే నిద్ర చేయాలనే ఆనవాయితీ కొనసాగుతోంది. గదులు లభించని భక్తులంతా ఆలయ ఆవరణలోనే సేదతీరుతారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యపరమైన సమస్య తలెత్తితే వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితే నెలకొని ఉంది. దీంతోపాటు ఉపవాస దీక్షతో రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇందులో పిల్లలు, వృద్ధులు, వికలాంగలు ఉంటారు. ఈ క్రమంలో వయోభారంతో బాధపడే వారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడేవారు, వృద్ధులు క్యూలైన్లలో అలసిపోయి స్పృహతప్పి పడిపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న ఆలయ యంత్రాంగం కనీసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే కన్నుమూశారు. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు ఉదయం పూటనే ధర్మగుండంలో స్నానాలాచరించి ఉపవాసంతోనే స్వామి వారిని దర్శించుకోవడం శ్రేష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న కొంతమంది కిందపడిపోవడం, ధర్మగుండం వద్ద జారిపేడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇదంతా చూస్తున్న ఆలయ అధికార యంత్రాంగం భక్తులకు వైద్య సేవలందించేందుకు కనీస చర్యలకు పూనుకోవడం లేదు. భక్తుల రద్దీ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇక ఆ రాజన్నే దిక్కంటూ భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. అనాథలు, యాచకుల పరిస్థితి దయనీయం: రాజన్నను నమ్ముకొని అనేక మంది అనాథలు, యాచకులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కుటుంబసభ్యులకు ఆదరణకు దూరమైన పలువురు వృద్ధులు స్వామివారిపైనే భారం వేసి ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాచకులు సైతం భక్తులు చేసే దానధర్మాలపైనే బతుకీడుస్తున్నారు. వీరంతా వయోభారం, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారే. ఇలాంటికి వారికి ఆలయం తరఫున వైద్యం అందించే పరిస్థితి లేకపోగా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇప్పటికే పలువురు వృద్ధులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. అందుబాటులో లేని అంబులెన్స్ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా దేవాదాయశాఖ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు భక్తులకు ఏదైనా జరిగితే వారి సంబంధీకులే స్వయంగా ఎత్తుకెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచాలని భక్తజనం కోరుకుంటున్నారు. హోమియో వైద్యశాల మూతబడి మూడేళ్లు రాజన్న ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించబడిన హోమియో వైద్యశాల నిరుపయోగంగా మారిందని భావించిన ఆలయ అధికారులు ఆ వైద్యశాలను మూడేళ్ల క్రితమే ఎత్తివేశారు. హోమియో వైద్యశాలతో ఆర్థిక భారం పడుతుందని దానిని శాశ్వతంగా మూసేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోమియో వైద్యశాల ఉన్నన్నాళ్లు ఓ డాక్డర్, ఓ కాంపౌండర్ అందుబాటులో ఉంటూ కనీసం ప్రథమ చికిత్సనైనా అందించేవారు. ఆ వైద్యశాలను మూసేసిన అధికారులు మరో సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న క్రమంలో రెండుసార్లు జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో దీని ఊసెత్తకపోవడం పట్ల భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి నిన్న రంజిత్‌కుమార్ అనే 22 ఏళ్ల యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. అంబులెన్స్ లేనేలేదు. చివరికి 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యసిబ్బందినైనా అందుబాటులో ఉంచాలి. - నాగుల విష్ణుప్రసాద్, స్థానిక నాయకుడు రద్దీ సమయంలో వైద్యం అందిస్తాం ఆలయం పక్షాన ఆసుపత్రి ఏర్పాటు చేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమ, శుక్రవారాలు వైద్యులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యశాఖ సిబ్బందిని ఇక్కడ డిప్యూట్ చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. భక్తులకు అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో -
నెల్లూరు మెటర్నిటీ ఆసుపత్రిలో వసతుల లేమి!
-
మల్లన్న చెంత... భక్తుల చింత
చేర్యాల : తెలంగాణలో మూడు నెలలపాటు జరిగే జానపదుల జాతర బ్రహ్మోత్సవాలకు నెలవు అరుున... పడమటి శివాలయంగా పేరుగాంచిన చేర్యాల మండలంలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. శివస్వరూపమైన మల్లన్న స్వామిని సుమారు 600 ఏళ్లుగా భక్తులు కొలుస్తూనే ఉన్నారు. ధూపదీప నైవేద్యాలతో నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ర్టం నుంచే కాకుండా ఆంద్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మంది భక్తులు వస్తున్నారు. భక్తుల కానుకలతోపాటు బుకింగ్, ఆభరణాల వేలంతో మల్లన్న ఆలయూనికి ప్రధానంగా ఆదాయం సమకూరుతోంది. సుమారుగా 2011లో రూ.7,19,81,614, 2012లో రూ.8,03,19,207, 2013లో రూ.11,04,08,515 ఆదాయం వచ్చిం ది. అరుునా... మల్లన్న ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ఆదా యం ఉన్నా... భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యూరు. దేవాదాయ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిధు లు రాలేదు. ఏటేటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కనీస వసతులు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
కస్తూర్బాధలు!
జోగిపేట, న్యూస్‌లైన్: ఆర్థిక, ఇతరత్రా కారణాల వల్ల చదువు ఆపేసిన బాలికలను మళ్లీ బడిబాట పట్టించేందుకు గాను ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఆశయం నీరుగారుతోంది. పాఠశాలలను ఆర్భాటంగా ప్రారంభించినా ఇందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. చిత్తశుద్ధి కొరవడడంతో లక్ష్యం మరగున పడినట్టు కన్పిస్తోంది. జోగిపేట పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 115 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇంత మంది విద్యార్థినుల కోసం ఒకే షెడ్డు ఉంది. అందులోనే ఫర్నిచర్, విద్యార్థినుల పెట్టెలు ఉండగా అక్కడే బోధనా తరగతులు, భోజనం, నిద్రించడానికి కూడా అదే షెడ్డు దిక్కు. వంట మాత్రం పక్కనేగల చిన్న గదిలో చేస్తుంటారు. ఇలా వారు అసౌకర్యాల మధ్య చదువులను సాగిస్తున్నారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా అందులో ఉండలేని పరిస్థితి. ఇక్కడ సొంత భవనం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. -
సౌకర్యాలుంటే సరా.. సేవలేవి?
పోలవరం, న్యూస్‌లైన్ : పలు ప్రభుత్వాసుపత్రులలో వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతుంటే పోలవరంలోని ప్రభుత్వ వైద్యశాల (సామాజిక ఆరోగ్య కేంద్రం) పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ వసతులు పూరిస్థాయిలో ఉన్నా వైద్య సిబ్బంది కొరతతో వైద్యం అందక రోగులు వెనుదిరగాల్సి వస్తోంది. నాలుగు పీహెచ్‌సీలకు, 70 గిరిజన, గిరిజనేతర గ్రామాల ప్రజలకు ప్రధాన వైద్యశాల కావడంతో పోలవరంలోని సీహెచ్‌సీకి పూర్తిస్థాయిలో వసతులు కల్పించారు. గతేడాది రూ. 20 లక్షలతో అన్ని వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య రెగ్యులర్ వైద్యులు లేకపోవడం. దీంతో ఇతర పీహెచ్‌సీల నుంచి వైద్యులను రప్పించి ఓపీ నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మాతా శిశు సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకంగా సీమాంక్ సెంటర్ కూడా ఉంది. కానీ గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేందుకు టెక్నిషియన్ లేరు. ఎక్స్‌రే విభాగంలో రేడియో గ్రాఫర్ కూడా లేకపోవడంతో ఈ పరికరాలు అక్కరకు రావడం లేదు. దీంతో ఆ వైద్య పరీక్షల కోసం కొవ్వూరు, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యాధికారులను నియమించడంతోపాటు రేడియోగ్రాఫర్‌ను, అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెక్నీషియన్‌ను నియమించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వ్యవసాయ మార్కెట్లు వెలవెల
సాక్షి, కొత్తగూడెం: రైతులకు అన్నిచోట్ల కష్టాలే... ఆటుపోట్లను ఎదుర్కొని పండిచిన పంటను విక్రయించే చోట కూడా రైతును సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేని స్థితిలో జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. రైతు విశ్రాంతి భవనాలు, పంట ఉత్పత్తులు పోసే ప్లాట్‌ఫాంలు శిథిలావస్థకు చేరుకున్నా...ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టించుకునే దిక్కులేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్లున్నాయి. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, వైరా, ఇల్లెందు, ఏన్కూరు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేటలో ఈ మార్కెట్లున్నాయి. వివిధ కేటగిరీల్లో ఈ మార్కెట్లలో మొత్తం 130 పోస్టులకుగాను 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలు ఉండగా, మిగిలిన మార్కెట్లకు లేవు. ఖమ్మం, నేలకొండపల్లి మార్కెట్లకు పూర్తి స్థాయి అధికారులుండగా మిగతా మార్కెట్లు ఇన్చార్జిల పాలనలోనే సాగుతున్నాయి. జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఏ మార్కెట్లోనూ పూర్తి స్థాయిలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. విశ్రాంతి భవనాలు, తాగునీటి వసతి, భోజన హోటళ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్కెట్లకు రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, అపరాలు, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలి. కానీ కొన్ని మార్కెట్లలో వసతులు లేకపోవడంతో అసలు కొనుగోళ్లే జరపడం లేదు. రైతులు కూడా మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర అందదని, సౌకర్యాలు ఉండవన్న కారణంతో అటువైపు అడుగుపెట్టడం లేదు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లేకపోవడంతో రైతులు మార్కెట్లలో నిలువునా మోసపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలోనే వ్యవసాయ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ రైతు విశ్రాంతి భవనం మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మంచినీటి వసతి లేక రైతులు అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఉన్న ట్యాంకుకు మరమ్మతులు చేయలేదు. మార్కెట్ యార్డుల్లో ఉన్న పంపులకు ట్యాప్‌లు పనిచేయడం లేదు. మార్కెట్ నిండా చెత్తా చెదారం పేరుకుపోయింది. యార్డుల్లో ఉన్న మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. మార్కెట్లో అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఇంకా ఫైరింజన్‌ను ఏర్పాటు చేయలేదు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అధికారికంగా ప్రారంభించలేదు. దమ్మపేట మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ పరిధిలో ములకలపల్లిలో గోదాం ఉన్నప్పటికి నిర్వహణ లేక అది నిరుపయోగంగా ఉంది. చండ్రుగొండలో గోదాం ఉన్నా అసలు విద్యుత్ సౌకర్యమే లేదు. వైరాలో మార్కెట్ యార్డును అన్ని సదుపాయాలతో నిర్మించినప్పటికీ అక్కడ ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఏడాది క్రితం రూ.13 కోట్లతో నిర్మించిన గోదాంలు నిరుపయోగంగా మారాయి. అంతేకాకుండా ఇక్కడి వేబ్రిడ్జి మూలన పడింది. పంటల ధరలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైతు సలహా కేంద్రంలో ఒక్క రోజు కూడా అధికార్లు కనిపించిన పాపాన పోలేదు. మూత్రశాలలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. ఏన్కూరు మార్కెట్ యార్డులో కేవలం ప్లాట్‌ఫాంలు మాత్రమే నిర్మించారు. గోదాంల నిర్మాణం ఇంకా చేపట్టలేదు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం లేదు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు. నిర్వహణ లేక ఇక్కడ ఉన్న వేబ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. మార్కెట్లో సీసీ రోడ్లు నిర్మించకపోవడంతో మార్కెట్ అంతా గుంతలమయంగా మారింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం ఉన్నప్పటికీ వసతులు లేక అది నిరుపయోగంగా ఉంది. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోదాంలను స్టోర్‌రూం గా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న యంత్రాలు తుప్పుపడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మార్కెట్లో విద్యుత్ సరఫరా చేసే స్తంభాలకు తీగలు వేలాడి ప్రమాదకరంగా మారాయి. బూర్గంపాడులోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో మణుగూరు, పినపాక, గుండాల అశ్వాపురం మండల కేంద్రాల్లో గోదాంలు నిర్మించారు. అయితే ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. ఈ గోదాంలను గ్యాస్‌గోదాంలు, చౌకధరల దుకాణాల నిల్వలకు ఉపయోగిస్తున్నారు. ఇల్లెందు మార్కెట్ యార్డులో దళారులు ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఈ మార్కెట్‌కు ఎక్కువగా రావడం లేదు. ఈ విషయంలో అధికారులు స్పందించకపోవడంతో యార్డులోని గోదాంలు, ఫ్లాట్ ఫాంలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ యార్డు పరిధిలో టేకులపల్లిలో గోదాం ఉన్నా అది కూడా నిరుపయోగంగా మారింది. సత్తుపల్లి మార్కెట్‌యార్డుకి ఏటా రూ. కోటికి పైగా, కల్లూరు మార్కెట్‌కు రూ. కోటిన్నరకు పైగా సెస్ రూపంలో ఆదాయం వస్తోంది. మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటలకు సరైన ధర కల్పించకపోవడంతో ప్రస్తుతం ఇక్కడి రైతులు అమ్మకానికి పంటలను ఎక్కువగా తీసుకురావడం లేదు. దీంతో రైతు విశ్రాంతి భవనాలు నిరుపయోగంగా మారాయి. గతేడాది రూ. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ప్లాట్‌ఫాంలు పిచ్చిమొక్కలతో నిండాయి. మధిర వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి మార్కెటింగ్ భవనం, వేబ్రిడ్జి నిరుపయోగంగా ఉన్నాయి. అప్పుడప్పుడు మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ రైతులకు తాగునీటి సౌకర్యంలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, రైతుసేవాకేంద్రం రైతులకు అందుబాటులో లేవు. కొత్తగూడెం మార్కెట్‌యార్డులో రైతులకు విశ్రాంతిగదులు లేవు.., తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులు పండించిన అపారాలు, ధాన్యం, మొక్కజొన్నల నిల్వచేసేందుకు గోదాంలు ఉన్నాయి.. కానీ వాటిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను వ్యాపారులే నిల్వ చేసుకుంటున్నారు. భద్రాచలం మార్కెట్ యార్డులో రైతులకు తాగునీటి సౌకర్యం లేదు. అసలు ఇక్కడ విశ్రాంతి భవనమే లేదు. చర్లలో మార్కెట్ కమిటీ యార్డు దూరంగా ఉండడంతో రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకురావడం లేదు. దీన్ని గిరిజన సహకార సంస్థకు అద్దెకు ఇచ్చారు. దీంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోళ్లే జరగడం లేదు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. -
అన్నింటికీ అవతలికే..
ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : ‘డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్న జిల్లాకేంద్రంలోని గెజిటెడ్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలో 600లకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆదిలాబాద్‌లో పురాతన పాఠశాలల్లో ఇదొక్కటి. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న బి.చంద్రకుమార్ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారు. అంతటి చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో ఇంతవరకు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. దీంతో వారు బయటకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది.’ జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలలుండగా.. అందులో 2.60 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తునానరు. వీరందరికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించినా.. వారు పట్టించుకోవడంలేదు. ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా వారికే తెలియడం లేదు. కాకి లెక్కలు.. 2011-12 విద్యా సంవత్సరంలో 1,114 మం జూరు కాగా 1,054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. 2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యం గల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం పాఠశాలలు కలిపి 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నట్లు ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న విద్యార్థినుల డ్రాపౌట్లు.. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో విద్యార్థినులు అనేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సక్రమంగా పాఠశాలలకు రాలేకపోతున్నారు. మరికొంత మంది పాఠశాల రావడం మానేస్తున్నారు. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటే పోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేవు. దీంతో అవి కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి. -
గాడి తప్పుతున్న గ్రంథాలయాలు
వెంకటగిరి, న్యూస్‌లైన్ : విజ్ఞాన గనులుగా విరాజిల్లిన గ్రంథాలయాలు నానాటికి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి ఏటా గ్రంథాలయాల ప్రాముఖ్యతను, ఖ్యాతిని కీర్తిస్తూ వారోత్సవాలు నిర్వహించడం తప్ప వాటి ప్రగతికి ప్రణాళిక రూపొందించిన దాఖలాలు లేవు. అరకొర వసతులు కలిసిగిన శిథిల భవనాల్లో, చెదలుపట్టిన గ్రంథాలతో వ్యవస్థను నడిపిస్తూ మమ అనిపిస్తున్నారు. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీకాక, ఉన్న ఉద్యోగులు పదవీ విరమణతో అనేక గ్రంథాలయాలు మూతపడుతున్నాయి. అనేక ప్రధాన గ్రంథాయాలను సైతం ఇన్చార్జిల పాలనలోనే నడిపిస్తున్నారు. జిల్లాలోని నెల్లూరు నగరం, గూడూరు, కావలి ప్రధాన పట్టణాల్లో గ్రేడ్-1 గ్రంథాలయాలు ఉండగా, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, రాపూరు, కోవూరులో ద్వితీయశ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో, పట్టణాల్లో మొత్తం 65 గ్రంథాలయాలు ఉండగా, అందులో 58 శాఖాగ్రంథాలయాలు ఉన్నాయి. 7 గ్రామీణ గ్రంథాలయాలు పాఠకులకు సేవలు అందిస్తున్నాయి. గ్రంథాలయాలు పాఠకులకు అందుబాటులో ఉంటూ వారికి విజ్ఞానం అందించడంలో ప్రధాన భూమిక నిర్వహించాల్సి ఉంది. జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో కనీస వసతుల సైత్యం మృగ్యమయ్యాయి. సొంత భవనాలు లేని గ్రంథాలయాలు అనేకం ఉన్నాయి. ఎన్నోఏళ్లుగా సొంత భవనాలు కోసం ప్రతిపాదనలు పంపడమే తప్ప అవి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. గ్రంథాలయాలకు నిధులు సక్రమంగా కేటాయించకపోవడం, విడుదల చేయకపోవడంతో కొత్త గ్రంథాల కొనుగోలు కానీ, పత్రికలు, ఉద్యోగ, విద్యా సంబంధిత పుస్తకాల కొనుగోలు ఎప్పుడో నిలిచిపోయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఆయా గ్రంథాలయాలకు కేటాయించిన పుస్తకాలు మినహా కొత్త పుస్తకాలే లేవు. జిల్లాలోని 46 మండలాలు, మునిసిపాలిటీల నుంచి సుమారు రూ.4 కోట్ల మేర సెస్ బకాయిలు జిల్లా గ్రంథాలయ సంస్థకు రావాల్సి ఉంది. కనీసం ఈ బకాయిలను వసూలు చేస్తే జిల్లాలోని గ్రంథాలయాలన్నిటికీ పుష్కలంగా కొత్త గ్రంథాలు కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో నూతన పరిజ్ఞానం, వసతులు కల్పించాల్సి అవసరం ఉంది. శాస్త్రసాంకేతిక రంగాలతో పాటు సమాచారం అందించే గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందితే పాఠకులకు ఎంతో ఉపకరిస్తుంది. అయితే పాలకులు మాత్రం ఆ తరహాలో దృష్టి సారించకపోవడంతో గ్రంథాలయంలోని వసతులు మెరుగు పడకపోగా ఖాళీ అయిన పోస్టులు సైతం భర్తీ కావడం లేదు. జిల్లాలో గ్రేడ్-1 గ్రంథ పాలకులు రెండు, గ్రేడ్-2 పాలకులు మూడు, గ్రేడ్-3 గ్రంథపాలకులు -8, అటెండర్లు 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
పరువు కాలిపోయింది!
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : రాయలసీమ జిల్లాలతోపాటు, బళ్లారి, నెల్లూరు జిల్లాలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పెద్ద దిక్కు. అయితే ప్రభుత్వం ఈ ఆసుపత్రి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలోని కాలిన రోగుల విభాగం సమస్యలతో సతమతమవుతోంది. ఇక్కడ రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైద్యం అందక, మరోవైపు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి, చావు ఎప్పుడొస్తుందా అని రోగులు ఎదురు చూసే దయనీయ పరిస్థితి దాపురించింది. ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అనుబంధంగా ఉన్న ఈ విభాగంలో సమస్యలు తాండవిస్తున్నాయి. 20 పడకలున్న ఈ విభాగంలో అవసరమైన వైద్యనిపుణులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ కొన్నేళ్లుగా ఒకే ప్రొఫెసర్ ఈ విభాగానికి సేవలందిస్తున్నారు. అవసరమైన వైద్యులను అందించకపోవడంతో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలోనూ సర్జరీలు తగ్గిపోయాయి. సర్జరీ తర్వాత పర్యవేక్షణ చేసే వైద్యులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఈ విభాగంలో పనిచేసిన ఓ వైద్యురాలు పదోన్నతి రావడంతో, ఇతర ప్రాంతానికి వెళ్లే ఇష్టం లేక దీర్ఘకాలిక సెలవు పెట్టారు. కాలిన రోగుల వార్డులో ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ. ఈ కారణంగా ఈ విభాగాన్ని పూర్తిగా ఆపరేషన్ థియేటర్ స్థాయిలో స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలో దీనిని సెంట్రల్ ఏసీగా మార్చారు. అయితే నిర్వహణ లోపం కారణంగా తరచూ ఏసీ పనిచేయడం మానేస్తోంది. నాలుగు నెలలుగా ఏసీ పనిచేయకపోవడంతో ఉక్కపోత భరించలేక రోగులు సొంతంగా ఇళ్ల వద్ద నుంచి ఫ్యాన్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. మంచాలు, వాటిపై పరుపులు, ఆయా రోగులుండే రూంలకు కర్టెన్లు లేకపోవడం ఈ విభాగం దయనీయ పరిస్థితిని చాటుతోంది. ఈ కారణాలతో ఈ విభాగంలో ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోంది. రోగికి అవసరమైన మందులు, నాణ్యమైన చికిత్సనందించే వైద్యం అందించే వారు లేకపోవడంతో రోగుల మరణాల శాతం అధికంగా ఉంది. 35 శాతంపైగా కాలిన రోగులు ఈ విభాగంలో మరణించే శాతం అధికంగా ఉందని రోగుల కుటుంబీకులు చెబుతున్నారు. రోజూ మరణాలను చూడలేక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్సను భరించలేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇదే ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ వైద్యం అందుకుంటున్నారు. రోజుకో పూట వచ్చే వైద్యుడు సూచించే మందులను రోగులకు రాస్తూ ఎప్పుడెప్పుడు బయటపడదామన్న ఆలోచనతో కుటుంబీకులు ఇక్కడ కాలం వెల్లదీస్తున్నారు. ఈ విభాగంలో వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేద న్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.