మల్లన్న చెంత... భక్తుల చింత | if income is there ... Facilities zero | Sakshi
Sakshi News home page

మల్లన్న చెంత... భక్తుల చింత

Published Wed, Jul 23 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

if income is there ... Facilities zero

 చేర్యాల : తెలంగాణలో మూడు నెలలపాటు జరిగే జానపదుల జాతర బ్రహ్మోత్సవాలకు నెలవు అరుున... పడమటి శివాలయంగా పేరుగాంచిన చేర్యాల మండలంలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. శివస్వరూపమైన మల్లన్న స్వామిని సుమారు 600 ఏళ్లుగా భక్తులు కొలుస్తూనే ఉన్నారు. ధూపదీప నైవేద్యాలతో నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు.

 మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ర్టం నుంచే కాకుండా ఆంద్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మంది భక్తులు వస్తున్నారు. భక్తుల కానుకలతోపాటు బుకింగ్, ఆభరణాల వేలంతో మల్లన్న ఆలయూనికి ప్రధానంగా ఆదాయం సమకూరుతోంది. సుమారుగా 2011లో రూ.7,19,81,614, 2012లో రూ.8,03,19,207, 2013లో రూ.11,04,08,515 ఆదాయం వచ్చిం ది. అరుునా... మల్లన్న ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ఆదా యం ఉన్నా... భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యూరు. దేవాదాయ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిధు లు రాలేదు. ఏటేటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కనీస వసతులు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement