Cheryala
-
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్‌లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
‘అప్పటి వరకు ఆమరణ నిరాహార దీక్ష’
సాక్షి, సిద్ధిపేట : చేర్యాలను డివిజన్‌గా మార్చే వరకు అమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల, నారాయణపేట్ వంటి ప్రాంతాలను జిల్లా చేసిన కేసీఆర్ చేర్యాల డివిజన్ చేయడంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం ఎంపీ సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చేర్యాల ఉద్యమ గడ్డగా పేరుగాంచిందని తెలిపారు. బైరాన్‌పల్లిలో ఒకే రోజు 300 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. మరోసారి చేర్యాల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజలే తూటాలకు బలయ్యారని, 2001 తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజల కృషి మరువలేనిదని ప్రశంసించారు. జనగామ నియోజకవర్గాన్ని రెండు జిల్లాల్లో కలపడంతో విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతర ఎమ్మెల్యే వల్లే ఈప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యాలయాల ఏర్పాటులో వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసి రావడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను పలుమార్లు సంప్రదించినా.. డివిజన్ ఏర్పాటు చేయలేదని ప్రస్తావించారు. 4 నెలల నుంచి చేర్యాల ప్రజలు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాంసాగర్ వెంచర్లో హెచ్చరిక పోస్టర్ల కలకలం
చేర్యాల : మండలంలోని రాంసాగర్ పరిధిలో ఉన్న రాంసాగర్ – కొమురవెల్లి రహదారిపైనున్న దుర్గా భవానీ ఆలయం వద్ద వెంచర్లో ఆదివారం హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన ఈ వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రజెండాలు పాతి, మూడు హెచ్చరిక పోస్టర్లు అంటించారు. ఈ భూమిని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అప్పగించాలని.. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పోస్టర్లలో రాశారు. ఎస్సై లక్ష్మణ్‌రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఎర్రజెండాలు, పోస్టర్లను తొలగించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
చీర్యాలలో చైన్ స్నాచింగ్
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో చైన్‌స్నాచర్లు గురువారం రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన లక్ష్మి(70) గురువారం మధ్యాహ్నం తన ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో బైక్‌పై ఇద్దరు ఆగంతకులు ఆమె వద్దకు వచ్చి ఆగారు. ఏదో అడగబోతున్నట్లు నటించి..ఆమె మెడలోని ఐదు తులాల పుస్తెల తాడును తెంపుకుని క్షణాల్లో మాయమయ్యారు. దీనిపై బాధితురాలి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ గురవారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పాముకాటుతో దంపతుల మృతి
చేర్యాల (వరంగల్ జిల్లా) : రాత్రి నిద్రిస్తున్న దంపతులను పాము కాటు వేయడంతో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రానికి చెందిన హుస్సేన్, రహీమున్నీసా దంపతులు స్థానికంగా పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వీరిని పాము కరిచింది. దీంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ తరలించారు. అయితే హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ దంపతుల్దిరూ మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు సమాచారం. -
మల్లన్న చెంత... భక్తుల చింత
చేర్యాల : తెలంగాణలో మూడు నెలలపాటు జరిగే జానపదుల జాతర బ్రహ్మోత్సవాలకు నెలవు అరుున... పడమటి శివాలయంగా పేరుగాంచిన చేర్యాల మండలంలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. శివస్వరూపమైన మల్లన్న స్వామిని సుమారు 600 ఏళ్లుగా భక్తులు కొలుస్తూనే ఉన్నారు. ధూపదీప నైవేద్యాలతో నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ర్టం నుంచే కాకుండా ఆంద్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మంది భక్తులు వస్తున్నారు. భక్తుల కానుకలతోపాటు బుకింగ్, ఆభరణాల వేలంతో మల్లన్న ఆలయూనికి ప్రధానంగా ఆదాయం సమకూరుతోంది. సుమారుగా 2011లో రూ.7,19,81,614, 2012లో రూ.8,03,19,207, 2013లో రూ.11,04,08,515 ఆదాయం వచ్చిం ది. అరుునా... మల్లన్న ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ఆదా యం ఉన్నా... భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యూరు. దేవాదాయ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిధు లు రాలేదు. ఏటేటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కనీస వసతులు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.