జోగిపేట, న్యూస్‌లైన్: ఆర్థిక, ఇతరత్రా కారణాల వల్ల చదువు ఆపేసిన బాలికలను మళ్లీ బడిబాట పట్టించేందుకు గాను ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఆశయం నీరుగారుతోంది. పాఠశాలలను ఆర్భాటంగా ప్రారంభించినా ఇందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. చిత్తశుద్ధి కొరవడడంతో లక్ష్యం మరగున పడినట్టు కన్పిస్తోంది.
జోగిపేట పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 115 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇంత మంది విద్యార్థినుల కోసం ఒకే షెడ్డు ఉంది. అందులోనే ఫర్నిచర్, విద్యార్థినుల పెట్టెలు ఉండగా అక్కడే బోధనా తరగతులు, భోజనం, నిద్రించడానికి కూడా అదే షెడ్డు దిక్కు. వంట మాత్రం పక్కనేగల చిన్న గదిలో చేస్తుంటారు. ఇలా వారు అసౌకర్యాల మధ్య చదువులను సాగిస్తున్నారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా అందులో ఉండలేని పరిస్థితి. ఇక్కడ సొంత భవనం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.
కస్తూర్బాధలు!
Published Fri, Feb 7 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement