రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సరిగ్గా 30 రోజుల్లో(జనవరి 10) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘వినయ విధేయ రామ’చిత్రం తర్వాత రామ్‌చరణ్– కియారా అద్వానీ రెండోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటించారు.
ఈ సినిమాలో అంజలి, ఎస్‌జే సూర్య, సముద్రఖని, జయరాం ఇతర పాత్రలు పోషించారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది. ΄పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.
కాగా ఈ సినిమా విడుదలకి 30 రోజులు ఉండటంతో కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ బైక్ పై వస్తున్న రామ్‌చరణ్ సరికొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ‘గేమ్ ఛేంజర్’ కు సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్‌లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో షేర్ చేశారాయన. ‘గేమ్ ఛేంజర్’కి తమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment