రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer Movie) బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై భారీ విజయం దిశగా అడుగులేస్తోంది. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో రెండో రోజున కూడా వసూళ్ల పరంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ అదే స్పీడుని గేమ్ చేంజర్ కొనసాగించే అవకాశం ఉంది.
డ్యాన్సుల గురించి స్పెషల్‌గా చెప్పాలా!
ప్రజా నాయకుడు అప్పన్నగా.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రజా సమస్యలపై పోరాడే కలెక్టర్ రామ్ నందన్‌గా రెండు పాత్రల్లో చరణ్ చూపించిన పెర్ఫామెన్స్ వేరియేషన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే డ్యాన్సుల విషయంలో మెగా పవర్ జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్, అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్ తదితరుల నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండియర్‌గా శంకర్ తెరకెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్ బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
అభిమానులకు రామ్ చరణ్ కృతజ్ఞతలు
రామ్ చరణ్‌ను శంకర్ ఎలా ప్రెజంట్ చేస్తారోనని అందరూ ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూశారు. అందరి అంచనాలను అందుకుంటూ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. ఈ సక్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం విశేషం. గేమ్ చేంజర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇంటికి చేరుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌ను కలిసిన రామ్ చరణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment