నన్ను అలా పిలవొద్దు: కమల్‌ హాసన్‌ | Veteran actor Kamal Haasan says no to all titles including Ulaganayagan | Sakshi
Sakshi News home page

నన్ను అలా పిలవొద్దు: కమల్‌ హాసన్‌

Published Tue, Nov 12 2024 2:54 AM | Last Updated on Tue, Nov 12 2024 2:54 AM

Veteran actor Kamal Haasan says no to all titles including Ulaganayagan

‘ఉలగనాయగన్స్ , విశ్వ నటుడు, లోక నాయకుడు’... ఇలా కమల్‌హాసన్స్ ను ఆయన అభిమానులు ప్రేమగా, ఆ΄్యాయంగా పిలుచుకుంటుంటారు. అయితే ఇకపై తనను ఆ తరహా స్టార్‌ ట్యాగ్స్‌తో పిలవొద్దని, కమల్‌ హాసన్స్  అని పిలిస్తే చాలంటూ ‘ఎక్స్‌’లో ఓ లేఖను షేర్‌ చేశారు కమల్‌ హాసన్స్ . ‘‘నా పనిని మెచ్చి, నాకు ఎన్నో బిరుదులు ఇచ్చిన నా అభిమానులు, ప్రేక్షకులు, నా తోటి నటీనటులకు కృతజ్ఞతలు. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు కలిస్తే ఓ సృజనాత్మక సినిమా అవుతుంది. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా అభిప్రాయం.

అలాగే ఓ వ్యక్తిగా నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. సినిమా రంగంలో నిత్య విద్యార్థిగా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దయచేసి ఇకపై నన్ను ఎవరూ బిరుదుల పేర్లతో పిలవొద్దు. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. కమల్‌ హాసన్‌ లేదా కమల్‌ లేదా కేహెచ్‌ అని పిలిస్తే చాలని నా ఫ్యాన్స్, నా తోటి నటీనటులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులను కోరుకుంటున్నాను’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన. ఇక కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం జూన్‌ 3న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement